అన్వేషించండి

Harish Shankar: ఆ హీరోను పొట్టోడా అంటే కోపం వచ్చేది, వాళ్లకు నాకు తిక్క ఉందిలాంటి డైలాగులే నచ్చుతాయి: హరీష్ శంకర్

Harish Shankar: హ‌రీశ్ శంక‌ర్.. ఏద‌నుకున్నా బ‌య‌టికి చెప్పేస్తాడు. ఎవ‌రి గురించి ఆలోచించ‌డు. అలా ఈ మ‌ధ్య వార్త‌ల్లో బాగా నిలిచాడు. ఇక ఇప్పుడు ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

Daawath with Harish Shankar: టాలీవుడ్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్.. ర‌వితేజ హీరోగా, హ‌రీశ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల రిలీజైన సినిమా 'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్'. ఆగ‌స్టు 15న రిలీజైన ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఇక ఆ సినిమా ప్రమోష‌న్స్ టైంలో హ‌రీశ్ శంక‌ర్ చేసిన కొన్ని కామెంట్స్ పై తీవ్ర కాంట్ర‌వ‌ర్సీ న‌డిచింది. ఇక ఇప్పుడు ఆయ‌న ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూ ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. దావ‌త్ సీజ‌న్ - 2కి వ‌చ్చిన హ‌రీశ్ శంక‌ర్.. ఆ కాంట్ర‌వ‌ర్సీపై, త‌న‌కు సంబంధించిన కొన్ని సినిమాల గురించి మాట్లాడారు. అరియాన యాంక‌ర్ గా ఉన్న ఆ షోకి వ‌చ్చిన హ‌రీశ్ ఇంట్రెస్టింగ్ విష‌యాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ గురించి, ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి, వాళ్ల సినిమాల్లోని డైలాగులు గురించి చెప్పుకొచ్చారు. 

కాంట్ర‌వ‌ర్సీ ఎందుకు వ‌దిలేసి వెళ్లిపొమ్మ‌న్నారు.. 

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ యూట్యూబ్ ఛానెల్ లో ‘దావ‌త్’ షో న‌డుస్తోంది. ఆ షోకి సంబంధించి ఇటీవ‌ల సీజ‌న్ -2ని ప్రారంభించారు. హ‌రీశ్ శంక‌ర్ ఆ షోకి చీఫ్ గెస్ట్ గా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చాలా విష‌యాలు చెప్పారు. అరియాన అడిగిన చాలా ప్ర‌శ్న‌ల‌కి ఆన్స‌ర్స్ ఇచ్చారు. ఇంట‌ర్వ్యూ మొత్తం ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉన్న‌ట్లు ప్రోమో చూస్తే తెలుస్తుంది. 

"విప‌రీత‌మైన నెగ‌టివిటీ ఉంది.. ఎక్క‌డికైనా వెళ్లిపో కొన్నిరోజులు, ట్విట్ట‌ర్ వ‌దిలేయ్, ఎక్క‌డైనా దాక్కో అన్నారు కొంత‌మంది .. కానీ, ఎందుకు వెళ్తాం సినిమా ఇండ‌స్ట్రీని వ‌దిలేసి. ఎవ‌రో న‌న్ను బ‌ల‌వంత‌పెడితే ఇండ‌స్ట్రీలోకి రాలేదు. నా ప్యాష‌న్ తో నేను వ‌చ్చాను" అని చెప్పారు హ‌రీశ్ శంక‌ర్. 

ఆడియెన్స్ కి అలాంటివి ఎక్క‌వు.. 

"భాగ్య‌శ్రీ పాకెట్ లో దానిగురించి చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు. ఫొటోలు తీసి పెడుతున్నారు అంద‌రూ. కావాల‌ని టార్గెట్ చేస్తున్నారు. పెట్టండి త‌ప్పులేదు. ఆ సినిమాలో అలా ఉంది పెట్టాల్సి వ‌చ్చింది. నిజానికి మ‌న ఆడియెన్స్ ఎలా ఉంటారంటే? క‌ట్నం తీసుకుని మ‌గాడు కాపురం చేస్తే వ్య‌భిచారం అంటారు అని డైలాగ్ పెట్టాను. అది ఎవ్వ‌రికీ ఎక్క‌దు. ట్రెండ్ సెట్ చేస్తాను, నాకు తిక్క ఉంది లాంటి డైలాగులు పెడితే.. న‌చ్చుతాయి. ఈ పాయింట్ గురించి ఎందుకు మాట్లాడ‌తారు? నేను బ‌య‌ట ఏదైతే మాట్లాడ‌తానో.. దాన్ని సినిమాలు రాస్తే బోలెడు డ‌బ్బులు ఇస్తారు. నేను ఎవ్వ‌రినీ టార్గెట్ చేయ‌ను. న‌న్ను ఎదురుగా ఉండి ఎవ‌రైతే పుష్ చేస్తారో అప్పుడే మాట్ల‌డ‌తాను నేను"

పొట్టోడా డైలాగ్ అలా వ‌చ్చిందే.. 

"నా క‌థ ఫ‌స్ట్ ఓకే చేసింది జూనియ‌ర్ ఎన్టీఆర్ గారు. నేను ఆయ‌న్ని టైగ‌ర్ అని పిల‌స్తుంటాను. ఆ టైంలో సోష‌ల్ మీడియాలో పొట్టోడి సినిమా ఎప్పుడు తీస్తున్నావు?  పొట్టోడి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది లాంటివి వ‌చ్చేవి. అప్పుడు నాకు కోపం వ‌చ్చేది. అలా కోపంలో నుంచి వ‌చ్చిందే పొట్టోడా అనే డైలాగ్. కొంత‌మంది మా హీరో జోలికి రాకు అని వార్నింగ్ లు ఇస్తుంటారు. కానీ, వాళ్ల‌కు తిరిగి నేను వార్నింగ్ ఇచ్చి నా స్థాయిని త‌గ్గించుకోలేను" అని అన్నారు.

ఆ ప‌దును ఇప్పుడు త‌ట్టుకోలేరు.. 

'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' టైటిల్ పెట్ట‌డంపై ఆయ‌న ఇలా చెప్పుకొచ్చారు. "క‌ల్యాణ్ గారికి ఆ సినిమా గురించి చెప్ప‌గానే 'భ‌వ‌దీయుడులో ఒక విన‌యం ఉంది, భ‌గ‌త్ సింగ్ లో ఒక విస్ఫోటం ఉంది అందుకే విస్ఫోటం అని టైటిల్' పెట్ట‌మ‌న్నారు. కానీ పెట్ట‌లేదు.. ఇక గాజుగ్లాసు డైలాగ్ గురించి వ‌స్తే.. త‌న వైవాహిక జీవితం కానీ, ఏదైనా త‌న‌ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ ప‌దును ఎలా ఉంటుందో చూస్తారు" అని ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి ఆ ప్రోమోలో చెప్పారు శంక‌ర్.  

ఎందుకు పెట్టానా అనిపించింది.. 

'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్' లో ఒక రెండు హిందీ సాంగ్స్ ఎక్కువైన‌ప్పుడు ఎందుకు రా పెట్టాను అనిపించింది అని అన్నారు హ‌రీశ్ శంక‌ర్. ఇక ఇప్పుడు టెక్నాల‌జీ వ‌ల్ల డైరెక్ట్ గా రైట‌ర్, డైరెక్ట‌ర్ తో మాట్లాడ‌గ‌తులున్నారు. కానీ, కొంత‌మంది దాన్ని పాడుచేస్తున్నారు. ఇండ‌స్ట్రీలో ఫ్లాప్ ఇవ్వ‌ని డైరెక్ట‌ర్ ఉన్నారా? ఎందుకు అలా మాట్లాడ‌తారో అర్థ‌మే కాదు..  ప్ర‌తిసారి మా ఆలోచ‌న‌లు, మా ప‌నులు క‌రెక్ట్ అవ్వాల్సిన ప‌నిలేదు. ఎక్క‌డో ఒక చోట మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు హ‌రీశ్.   

ఎస్ ఆర్కే అంటే త‌న‌కు చాలా ఇష్టం అని.. ఆయ‌న ఫొటో పోస్ట్ చేసిన‌ప్పుడ‌ల్లా 'అన్న ఎస్ ఆర్కే తో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఎప్పుడన్నా అని ఎవ‌రైనా కామెంట్ చేస్తే' "అబ్బా ఆ ఊహ ఎంత బాగుందో" అనిపిస్తుంద‌ని అన్నారు హ‌రీశ్.  ఛాలెంజ్ లో చిరంజీవి గారు ఒక్క రావుగోపాల్ వ‌ర్మ‌నే చూశారు.. లైఫ్ లో తాను చాలామంది రావుగోపాల్ వ‌ర్మల‌ను చూశాన‌ని..  జీవితం అనేది వంట కాద‌ని, అంద‌రికీ న‌చ్చ‌దు అంటూ కొన్ని విష‌యాలు పంచుకున్నారు హ‌రీశ్ శంక‌ర్. చాలా ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు చెప్పారు. ఆయ‌న చెప్పిన మాట‌లు చాలా ఇంట్ర‌స్టింగ్ గా అనిపిస్తున్నాయి. దీంతో ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రేక్ష‌కులు.  

Also Read: ప్రదీప్ మాచిరాజు ముద్దు... సుడిగాలి సుధీర్‌తో లవ్ వద్దు - రష్మీ గౌతమ్ ఏమన్నదో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget