Euphoria: ‘యుఫోరియా’ను తల్లిదండ్రులు అస్సలు మిస్ కావద్దు... అసలు సినిమాలో ఏముందో చెప్పేసిన గుణశేఖర్
Euphoria: టాలీవుడ్ స్థాయిని పెంచిన దర్శకులలో స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ ఒకరు. ఈ మధ్య కాలంలో ఆయనకు సరైన హిట్ లేకపోయినప్పటికీ, ‘యుఫోరియా’ అంటూ యూత్ సెంట్రిక్ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు

Euphoria Rama Rama Song Launch: వైవిధ్యమైన కథలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న దర్శకుడు గుణ శేఖర్. స్టార్స్‌కి స్టార్డమ్ ఇచ్చే సత్తా ఉన్న ఈ దర్శకుడి నుంచి రాబోతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘యుఫోరియా’. సమకాలీన అంశాలతో, లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యూత్ అనే కాన్సెప్ట్‌లను మిక్స్ చేస్తూ.. ప్రస్తుత యువతరానికి ఓ మంచి మెసేజ్‌ను ఈ సినిమా ద్వారా గుణ శేఖర్ ఇవ్వబోతున్నారు. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫ్లై హై సాంగ్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ మూవీ నుంచి ‘రామ రామ..’ అనే సాంగ్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటి భూమిక, విఘ్నేష్ గవిరెడ్డి, రోహిత్, డైరెక్టర్ గుణశేఖర్, నీలిమ గుణ, ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆదిత్య మ్యూజిక్ మాధవ్, మాస్టర్ ఆరుష్, యానీ మాస్టర్ వంటి వారంతా పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘‘నేను మాత్రమే కాదు.. నాతో పాటు రాగిణి, నీలిమ, యుక్త కలిసి ఈ ‘యుఫోరియా’ సినిమాను తీశాం. కుటుంబ సమేతంగా అంతా హాయిగా నవ్వుకుంటూ చూసేలా ఈ సినిమాను రూపొందించాం. అందరూ కనెక్ట్ అయ్యేలా.. ఆహ్లాదకరంగా చక్కటి మెసేజ్‌తో ఈ సినిమా ఉంటుంది. ‘ఫ్లై హై’ అనే పాటతో అందరినీ మెప్పించిన కాల భైరవ.. ఇప్పుడు ‘రామ రామ’ అనే సాంగ్‌తో మరోసారి మీ ముందుకు వచ్చారు. చైతన్య ప్రసాద్ ఈ పాటకు మంచి సాహిత్యాన్ని అందించగా.. అందరూ ఎంజాయ్ చేసేలా పాట ఉంటుంది. ప్రవీణ్ పూడి వంటి టెక్నీషియన్‌తో వర్క్ చేయటం హ్యపీగా ఉంది. అలాగే ప్రవీణ్ కె.పోతన్ అనే సినిమాటోగ్రాఫర్‌ను ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాను. ఇందులో దాదాపు ఓ 20 మంది కొత్త వారిని పరిచయం చేశాను. ఇందులో విఘ్నేష్ గవిరెడ్డి హీరోగా కనిపిస్తారు. తను మనసు పెట్టి నటించాడు. ఆయనే కాదు ఇందులో నటించిన వారందరూ చక్కగా నటించారు. రోహిత్ ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు. చాలా రోజుల తర్వాత నా ‘ఒక్కడు’ భూమిక ఈ సినిమా ద్వారా.. చాలా మంచి పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె పాత్ర అందరినీ మెస్మరైజ్ చేస్తుంది’’ అని అన్నారు.
Also Read: 'ఈగ'ను కాపీ చేశారు... మలయాళ సినిమాకు రాజమౌళి నిర్మాత కాపీరైట్ నోటీసులు
నటి భూమిక మాట్లాడుతూ.. ‘యుఫోరియా’ నా హృదయానికి ఎంతో దగ్గరైన మూవీ. నాకు పదకొండేళ్ల కొడుకున్నాడు. విఘ్నేష్‌తో ఎక్కువగా సెట్స్‌లో ఉన్నప్పుడు నిజంగ ఇంట్లో మా అబ్బాయితో ఉన్నట్లే అనిపించింది. తను ఎంతో గొప్పగా నటించాడు. ఈ మూవీ నుంచి విడుదలైన రామ రామ సాంగ్ ఎంతో నచ్చింది. కాల భైరవ సంగీతాన్ని అందరినీ అలరిస్తుంది. ఈ సినిమా అందరిపై ఎంతగానో ఇంపాక్ట్ చూపిస్తుందని నమ్ముతున్నాను. తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదని చెప్పకొచ్చారు.
ఎడిటర్ ప్రవీణ్ పూడి మాట్లాడుతూ.. గుణ శేఖర్ సార్ తెరకెక్కించిన ‘చూడాలని ఉంది’ సినిమాకు నేను అసిస్టెంట్ ఎడిటర్‌గా వర్క్ చేశాను. అప్పుడు ఆయనని ఎలాగైతే చూశానో, ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆయనలో ఏం మార్పు రాలేదు. తన సినిమాల ద్వారా సోసైటీకి ఏదైనా చెప్పాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి థాట్ ఉన్న వ్యక్తులు ఈ సోసైటీకి చాలా అవసరం. చాలా గ్యాప్ తర్వాత భూమిక తెలుగులో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆవిష్కరిస్తుంది. తల్లిదండ్రులందరూ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. చాలా మంది కొత్త వాళ్లను ఈ సినిమా ద్వారా గుణశేఖర్ పరిచయం చేస్తున్నారు. అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.
నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ.. ఈ సినిమా నుంచి రిలీజైన ‘రామ రామ’ సాంగ్ చూస్తుంటే నాకు ‘ఒక్కడు’ సినిమాలో చెప్పవే చిరుగాలి సాంగ్‌లో భూమికను చూసినట్లే అనిపించింది. ఆమె ఈ సినిమాలో నటించినందుకు ఎంతో గొప్పగా భావిస్తున్నాం. ఈ సినిమాతో ఆమె క్యూట్ మామ్‌గా పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. కాల భైరవ బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారని అన్నారు.
Also Read: అనుష్కతో విక్రమ్ ప్రభు పెళ్లి... లిరిసిస్ట్‌గా మారిన క్రిష్... 'సైలోరే' రాసింది దర్శకుడే





















