Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్
డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడవ తర్వాత తొలిసారి హీరోయిన్ డింపుల్ హయతి మీడియా ముందుకు వచ్చారు. ఇంతకీ, ఆవిడ ఏం చెప్పారంటే?
యువ కథానాయిక డింపుల్ హయతి (Dimple Hayathi)పై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే (DCP Rahul Hegde) కేసు పెట్టిన విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమలో, ప్రేక్షకుల్లో ఆ కేసు సంచలనానికి దారి తీసింది. తన క్లయింట్ డింపుల్ హయతికి ప్రాణహాని ఉందని ఆమె లాయర్ వెల్లడించారు. ఆ తర్వాత కేసు పరిస్థితి ఏమైంది? ఎంత వరకు వచ్చింది? అనేది తెలియలేదు. కానీ, ఆ గొడవ తర్వాత తొలిసారి డింపుల్ హయతి మీడియా ముందుకు వచ్చారు.
క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో డింపుల్!
ప్రతి ఏడాది జూన్ 4న నేషనల్ క్యాన్సర్ సర్వైవర్ డే నిర్వస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి జయించిన వ్యక్తులతో శనివారం (జూన్ 3న) అపోలో ఆస్పత్రిలో 'క్యాన్సర్ ఛాంపియన్స్ యునైటెడ్' ప్రోగ్రాం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి డింపుల్ హయతి అతిథిగా హాజరు అయ్యారు.
అయితే, 'క్యాన్సర్ ఛాంపియన్స్ యునైటెడ్' ప్రోగ్రాంలో డీసీపీ రాహుల్ హెగ్డే కేసు గురించి డింపుల్ హయతి మాట్లాడానికి నిరాకరించారు. గతంలోనూ ఆమె ఆ కేసు గురించి ట్వీట్ చేయడం తప్ప నోరు విప్పి మాట్లాడినది లేదు. ఒకరితో ఫోనులో మాట్లాడగా... ఆ వాయిస్ వైరల్ అయ్యింది.
గొడవకు కారణం మూగ జీవాలు?
అసలు రాహుల్ హెగ్డేకి, డింపుల్ హయతికి మధ్య ఎందుకు గొడవ వచ్చింది? అని చాలా మందిలో సందేహాలు తలెత్తాయి. అందుకు కారణం మూగ జీవాల అని ఆమె న్యాయవాది తెలిపారు. మూగ జీవాల పట్ల రాహుల్ హెగ్డే కఠినంగా వ్యవహరించారని, వాటిని హింసకు గురి చేస్తుంటే డింపుల్ హయతి వద్దని వారించారని, అందుకని ఆమెపై తప్పుడు కేసు పెట్టారని న్యాయవాది పాల్ సత్యానందన్ గతంలో పేర్కొన్నారు.
Also Read : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
డింపుల్ హయతికి ప్రాణహాని!?
డింపుల్ హయతికి ప్రాణహాని ఉందని సైతం ఆమె న్యాయవాది వ్యాఖ్యానించారు. చాలా మంది నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం డింపుల్ బయటకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారని, మానసిక వ్యధకు గురి అయ్యారని కొన్ని రోజుల క్రితం పాల్ సత్యానందన్ పేర్కొన్నారు. ఆమెకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయ్యిందన్నారు. చట్టబద్ధంగా కేసును ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. డీసీపీ కారును డింపుల్ హయతి తన్నినట్లు ఎక్కడా కూడా ఫుటేజ్ లేదని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ
డింపుల్ హయతి వర్సెస్ డీసీపీ రాహుల్ హెగ్డే కేసులో జీహెచ్ఎంసీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఎందుకంటే... బల్దియా పరిధిలోని టాఫిక్ నిర్వహణ, నియంత్రణ విధులను పోలీస్ శాఖ నిర్వర్తిస్తోంది. ఆ బాధ్యత వాళ్ళదే అయినప్పటికీ... రోడ్లు, వనరుల కల్పన మాత్రం బల్దియాదే. ట్రాఫిక్ సిగ్నల్స్ మొదలుకుని ట్రాఫిక్ కోన్స్, ప్రీ కాస్ట్ డివైడర్లను ఏర్పాటు చేసేది జీహెచ్ఎంసీ అధికారులే.
View this post on Instagram
సెల్లార్‌లోకి కోన్స్ ఎవరు తీసుకు వెళ్లారు?
డింపుల్ హయతి న్యాయవాది సంధించిన ప్రశ్నల్లో రోడ్స్ మీద ఉండాల్సిన కోన్స్ అపార్ట్మెంట్ సెల్లార్‌లోకి ఎవరు తీసుకు వెళ్లారు? అని! ఆ విషయం మీద బల్దియా అధికారులను ప్రశ్నిస్తే... తమకు తెలియదని జవాబు ఇస్తున్నారు. ఆ కోన్స్, ప్రీ కాస్ట్ డివైడర్లను సెల్లార్‌లోకి తరలించడం నిబంధలకు విరుద్ధమని జీహెచ్ఎంసీ అధికారులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో ఎవరు తరలించారో తెలుసుకుని చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానాలు దాటవేస్తున్నారు. దాంతో డింపుల్ హయతి ట్వీట్స్ చేసినట్లు అధికార దుర్వినియోగం జరిగిందని ప్రజల్లో కొందరు భావిస్తున్నారు.