Dil Raju: నన్ను తిట్టుకోకండి, ఇప్పటికే లీకైన పాట కాబట్టి అలా అనిపిస్తోంది - ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌పై దిల్ రాజు క్లారిటీ
Game Changer: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుండి ‘జరగండి’ పాట ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. కానీ రిలీజ్ డేట్‌పై మాత్రం ఇంకా క్లారిటీ లేకపోవడంతో దానిపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Dil Raju about Game Changer Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును ఫ్యాన్స్ అంతా పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా వారు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ రావడంతో మరింత సంతోషంగా ఫీల్ అయ్యారు. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ నుండి మొదటి పాట విడుదల అవ్వనుందని సంక్రాంతికి అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ పాట బయటికి రాకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘జరగండి’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్‌పై వస్తున్న స్పందనపై దిల్ రాజు స్పందించారు.
ఓపికకు పరీక్ష..
రామ్ చరణ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేయడం కోసం టాలీవుడ్ మేకర్స్ అంతా ఒక్కచోట చేరారు. ఈ ఈవెంట్‌కు చాలామంది ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈవెంట్‌లో పాల్గొని ‘గేమ్ ఛేంజర్’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా దిల్ రాజు స్పీచ్ ప్రారంభించగానే రిలీజ్ డేట్ కావాలా అని ఫ్యాన్స్‌ను అడిగారు. ‘‘మీ ఓపికకు చాలా పరీక్ష పెడుతున్నాం. ఒక ఉప్పెన, ఒక తుఫాను వచ్చే ముందు ఓపిక పట్టక తప్పదు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి రామ్ చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆ రేంజ్‌కు సినిమా రీచ్ అవ్వాలంటే శంకర్.. ఒక్కొక్క పాటను, ఒక్కొక్క సీన్‌ను తీర్చిదిద్దుతున్నారు’’ అని తెలిపారు దిల్ రాజు.
సీట్లలో కూర్చోరు..
‘‘ఇంకా రెండు నెలల్లో గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తవుతుంది. ఇప్పటికే జరగండి సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈరోజు సాంగ్‌లో చూసింది కేవలం 2 శాతమే. 98 శాతం దాచిపెట్టుకున్నారు శంకర్. రిలీజ్ అయ్యాక థియేటర్లలో చూసినప్పుడు సాంగ్ విలువ ఏంటని మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క సాంగ్ మాత్రమే కాదు.. పూర్తిగా అయిదు పాటలను ఆయన స్టైల్‌లో డిజైన్ చేశారు శంకర్. మూడు పాటలకు అభిమానులు సీట్లలో కూర్చోకుండా లేచి డ్యాన్సులు చేసేలాగా ఉంటుంది. ఇంకొక అయిదు నెలలు నన్ను తిట్టుకోకుండా ఓపిక పట్టండి. చాలామంది దిల్ మామ ఒక అప్డేట్ ఇవ్వు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కానీ దిల్ మామ అప్డేట్ ఇవ్వలేడు. ఈ అప్డేట్ ఇవ్వు అని శంకర్ అన్నప్పుడే నేను ఇవ్వగలుగుతాను’’ అని ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు.
విజువల్ ట్రీట్..
‘‘గేమ్ ఛేంజర్ విషయంలో ముందుగానే ఎలాంటి లీక్ నేను ఇవ్వలేను. చరణ్‌కు ఇది చాలా స్పెషల్ బర్త్‌డే. క్లిన్ కారా ఆయన లైఫ్‌లోకి వచ్చింది. జరగండి పాట కూడా రిలీజ్ అయ్యింది. ఈ పాట మాస్ ఆడియన్స్‌కు ఎంత రీచ్ అవ్వాలో అంత రీచ్ అయ్యింది. ఇంకొక మూడు రోజుల తర్వాత ఈ సాంగ్ గురించి ప్రతీ అభిమాని మాట్లాడుకుంటాడు. ఇప్పటికే లీక్ అయిన పాట కాబట్టి ప్రస్తుతం ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో సాంగ్ అంటే విజువల్ ట్రీట్ ఉంటుంది. లిరికల్ వీడియోలో మిమ్మల్ని 100 శాతం తృప్తిపరచలేము. థియేటర్లలో మాత్రం 100 శాతం ఈ పాట వచ్చినప్పుడు మీరు సీట్స్‌లో కూర్చోరు’’ అని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చారు దిల్ రాజు.
Also Read: టిల్లు స్క్వేర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - 'మ్యాడ్'కు తాత, బ్లాక్ బస్టరే!