అన్వేషించండి

Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Dil Raju On Game Changer promotions: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు దిల్ రాజు. 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో తాజాగా జరిగిన చెన్నై ప్రెస్ మీట్ లో వెల్లడించారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్ లో ఈ మూవీ వేడుకలను ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనుకుంటున్నారో మొత్తం లిస్ట్ బయట పెట్టేశారు నిర్మాత దిల్ రాజు. మరి సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లు ఎక్కడెక్కడ ప్లాన్ చేశారో తెలుసుకుందాం పదండి. 

'గేమ్ ఛేంజర్' టీజర్ కు ముహూర్తం ఫిక్స్ 
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రామ్ చరణ్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు మూవీపై అంచనాలను భారీగా పెంచాయి. అయితే సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే మూవీ ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అనే విషయంపై మాత్రం ఇప్పటిదాకా మెగా ఫాన్స్ కి క్లారిటీ లేదు. తాజాగా దిల్ రాజు ఆ క్లారిటీని కూడా ఇచ్చేశారు. 'గేమ్ ఛేంజర్' మూవీ నిర్మాత దిల్ రాజు చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ మేరకు మాట్లాడారు. ఈ నెల 9న లక్నోలో 'గేమ్ ఛేంజర్' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఉంటుందని వెల్లడించారు. ఆ తర్వాత యూఎస్, చెన్నైలో స్పెషల్ ఈవెంట్లు, 2025 జనవరి మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నట్టు దిల్ రాజు చెప్పుకొచ్చారు. 

దిల్ రాజు నుంచి మరో బిగ్ అనౌన్మెంట్ 
ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ "21 ఏళ్ల నా సినీ ప్రయాణంలో 'గేమ్ ఛేంజర్' మూవీ 50వ సినిమా. మూడేళ్ల క్రితం డైరెక్టర్ శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నా స్నేహితుడు - నిర్మాత ఆదిత్య రామ్ తెలుగులో నాలుగు సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. వ్యాపారం నిమిత్తం చెన్నైలో బిజీ అయిన ఆయన 'గేమ్ ఛేంజర్' సినిమాలో భాగం కావాలని అడగగానే ఓకే చెప్పారు. అలా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఆదిత్య రామ్ మూవీస్ సంస్థలు 'గేమ్ ఛేంజర్' మూవీ నిర్మాణంలో ఒక్కటయ్యాయి. ఈ ఒక్క సినిమానే కాదు మరిన్ని సినిమాలకు కలిసి పని చేయబోతున్నాము" అంటూ అనౌన్స్ చేశారు. అలాగే ఆయన మూవీ ఈవెంట్స్ గురించి మాట్లాడుతూ "నవంబర్ 9న లక్నోలో 'గేమ్ ఛేంజర్' టీజర్ లాంచ్ చేయబోతున్నాం. ఆ తర్వాత యూఎస్ లో డల్లాస్ లో, చెన్నైలో ఈవెంట్స్ ప్లాన్ చేసాము. 2025 స్టార్టింగ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్స్ ఉండబోతున్నాయి. సినిమా జనవరి 10న రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎగ్జైటింగ్ గా ఉన్నాను" అంటూ మెగా అభిమానులు జోష్ పెంచేశారు దిల్ రాజు.

Read Also : Anushka Ghaati Update: అనుష్క బర్త్ డే సర్‌ప్రైజ్ లోడింగ్ - "ఘాటీ" నుంచి స్పెషల్ అనౌన్స్‌మెంట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget