అన్వేషించండి

Anushka Ghaati Update: అనుష్క బర్త్ డే సర్‌ప్రైజ్ లోడింగ్ - "ఘాటీ" నుంచి స్పెషల్ అనౌన్స్‌మెంట్!

Anushka Ghaati: టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి అభిమానులకు గుడ్ న్యూస్. ఆమె పుట్టినరోజు సందర్భంగా 'ఘాటి' మూవీ నుంచి అప్డేట్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను నవంబర్ 7న విడుదల చేయనున్నారు.

Anushka Shetty Ghaati Update: ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ అనుష్క. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి ఫేమ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సినిమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తోంది. అయితే అభిమానుల కోసం అన్నట్టుగా అడపాదడపా సినిమాలు చేస్తూ థియేటర్లలోకి వస్తోంది. చాలా కాలం నుంచి అనుష్క తెరపై కనిపించకపోవడంతో ఆమెను అభిమానులు బాగా మిస్ అవుతున్నారు. ఆ లోటును తీర్చడానికే అన్నట్టుగా త్వరలోనే రాబోతున్న అనుష్క పుట్టినరోజు కానుకగా ఆమె నటిస్తున్న "ఘాటి" నుంచి ఒక అప్డేట్ లోడ్ అవుతోంది.

అనుష్క శెట్టి చివరిసారిగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చి ఆకట్టుకుంది. ఆ తర్వాత తెరమరుగు అయిపోయిన ఈ బ్యూటీ సైలెంట్ గా రెండు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది. అందులో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'ఘాటి' కూడా ఒకటి. కొన్నాళ్ల క్రితం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మెయిన్ లీడ్ గా 'ఘాటి' అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ తాజాగా మేకర్స్ 'ఘాటి' సినిమా నుంచి ఒక సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చి అనుష్క అభిమానులను ఆశ్చర్యపరిచారు.

నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు కావడంతో అదే రోజు 'ఘాటి' మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటించి గుడ్ న్యూస్ చెప్పారు అనుష్క ఫ్యాన్స్ కి. అలాగే ఈ పోస్టర్ ద్వారా 'ఘాటి' షూటింగ్ మరో నాలుగు రోజుల్లో కంప్లీట్ అవుతుందని అనౌన్స్ చేశారు. దీంతో ఇప్పటి నుంచే స్వీటీ ఫ్యాన్స్ 'ఘాటీ' సినిమా అప్డేట్ తో పాటు అనుష్క పుట్టినరోజు వేడుకల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక 'ఘాటి' మూవీ కేవలం లేడీ ఓరియంటెడ్ మాత్రమే కాదు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుందని తెలుస్తోంది. ఈ అప్డేట్ తో అనుష్క మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైమెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉండగా డైరెక్టర్ క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాకు దర్శకత్వం వహిస్తూ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశారు. ఇలా మధ్యలోనే 'హరిహర వీరమల్లు' మూవీని వదిలేసి అనుష్కతో 'ఘాటి' అనే ఈ కొత్త సినిమాను మొదలు పెట్టారు. మరోవైపు అనుష్క తన ఫస్ట్ మలయాళ మూవీకి కూడా రెడీ అవుతోంది. 'కథనార్ ది వైల్డ్ సార్సరర్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరి అనుష్క పుట్టిన రోజు కానుకగా ఈ మూవీ నుంచి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Read Also :Appudo Ippudo Eppudo Trailer: ‘రియా ఎక్కడ’ టైప్‌లో ‘డివైస్ ఎక్కడ’ - నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ చూశారా?

 

టాప్ హెడ్ లైన్స్

Bhogi New Release Date : శర్వానంద్ 'భోగి' న్యూ రిలీజ్ డేట్ - రష్మిక 'మైసా'తో పోటీ ఉంటుందా?
శర్వానంద్ 'భోగి' న్యూ రిలీజ్ డేట్ - రష్మిక 'మైసా'తో పోటీ ఉంటుందా?
This Week Theatrical Releases : ఒకే వారం థియేటర్లలో 20 సినిమాలు - శుక్రవారం 14 మూవీస్ రిలీజ్... మీ ఫేవరెట్ ఏంటి?
ఒకే వారం థియేటర్లలో 20 సినిమాలు - శుక్రవారం 14 మూవీస్ రిలీజ్... మీ ఫేవరెట్ ఏంటి?
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
The Odyssey OTT : రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు
రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
The Odyssey OTT : రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు
రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు
Travis Head Exit:  SRH అభిమానులకు హెడ్ షాక్ .. ఐపీఎల్ 2027 సీజన్‌కు ఆసీస్ ఓపెనర్ దూరం, విడిపోనున్న విధ్వంసకర ట్రావిషేక్ జోడీ
SRH అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన హెడ్.. ఐపీఎల్ 2027 సీజన్‌కు ఆసీస్ ఓపెనర్ దూరం, విడిపోనున్న విధ్వంసకర ట్రావిషేక్ జోడీ
Embed widget