అన్వేషించండి

ధృవ x ఏజెంట్ - అక్కినేని, మెగా వారసులతో సూరి సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నారా? 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'ఏజెంట్' సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భాగం అవుతున్నాడు. 'ధృవ x ఏజెంట్' పేరుతో మేకర్స్ ఓ స్పెషల్ వీడియోని పోస్ట్ చేసారు.

'సైరా నరసింహా రెడ్డి' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి.. ఇప్పుడు యూత్ కింగ్ అఖిల్ తో 'ఏజెంట్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తన చిత్రాల్లో హీరోలను సరికొత్తగా ఆవిష్కరించే సూరి.. ఈసారి అక్కినేని వారసుడిని వైల్డ్ గా ప్రెజెంట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 28న తెలుగు మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం తాజాగా 'ధృవ x ఏజెంట్' అంటూ ఒక స్పెషల్ వీడియోని పోస్ట్ చేసింది.
 
'ధృవ x ఏజెంట్'.. విషయాలు మరింత వైల్డ్ గా మారబోతున్నాయి.. వేచి ఉండండి అంటూ అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ సైడ్ లుక్ ని చూపించారు. బ్యాగ్రౌండ్ లో 'ధృవ' థీమ్ మ్యూజిక్ ప్లే అవుతుంటే.. “ఏజెంట్ ఎక్కడున్నావ్” అంటూ చెర్రీ వాయిస్ ఓవర్ వినిపిస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. మెగా అక్కినేని వారసులు కలిసి ఏదో వైల్డ్ గా ప్లాన్ చేస్తున్నారనే చర్చ మొదలైంది.
గతంలో సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందిన 'ధృవ' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో చెర్రీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా నటించాడు. ఇప్పుడు ఏజెంట్ మూవీలో అఖిల్ ఒక గూఢాచారిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు వీరిద్దరినీ ఒకే వీడియోలో భాగం చేయడంతో.. సూరి సినిమాటిక్ యూనివర్స్ అనే డిస్కషన్ తెర మీదకు వచ్చింది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాటిక్ యూనివెర్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిలిమ్స్ తో పాటుగా లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ వంటి దర్శకులు హలీవుడ్ లో మాదిరిగా సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ధృవ Vs ఏజెంట్ వీడియోతో సూరి యూనివర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
 
డైరక్టర్ సురేందర్ రెడ్డి నిజంగానే సినిమాటిక్ యూనివర్స్ లో చరణ్, అఖిల్ లను భాగం చేస్తున్నాడా? లేదా 'ఏజెంట్' ప్రమోషన్స్ కోసం ఏదైనా స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి అక్కినేని, మెగా ఫ్యామిలీల మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జునల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి వారసులు కూడా అదే బంధాన్ని కొనసాగిస్తున్నారు.

రామ్ చరణ్, అఖిల్ మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా, ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా మెలుగుతుంటారు. గతంలో అనేక సందర్భాల్లో ఒకరిపై ఒకరికున్న అనుబంధాన్ని బయటపెట్టారు. అసలు అఖిల్ కు 'ఏజెంట్' ప్రాజెక్ట్ సెట్ అవ్వడం వెనుక చరణ్ చెయ్యి ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 
 
ఈ క్రమంలోనే ఏదొక విధంగా 'ఏజెంట్' మూవీలో చెర్రీ భాగం అవుతున్నాడని క్లారిటీ వచ్చేసింది. ఇది కచ్చితంగా అఖిల్ సినిమాకు కలిసొచ్చే అంశం అవుతుందని చెప్పాలి. ఎందుకంటే RRR సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆయనకు సంబధించిన ప్రతీ విషయం కూడా ట్రెండింగ్ అయిపోతుంది. ఇప్పుడు చరణ్ క్రేజ్ కూడా ‘ఏజెంట్’ సినిమా చుట్టూ హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తోందని చెప్పొచ్చు.
 
కాగా, 'ఏజెంట్' చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Psych Siddhartha OTT: సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Psych Siddhartha OTT: సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Happy News Year 2026: 2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Alexa Chief Technology Officer: మొబైల్ యాప్‌ల శకం ముగిసినట్టే! అలెక్సా చీఫ్ టెక్నాలజీ చెబుతున్న సంచలన విషయాలు
మొబైల్ యాప్‌ల శకం ముగిసినట్టే! అలెక్సా చీఫ్ టెక్నాలజీ చెబుతున్న సంచలన విషయాలు
Nayanthara: అనిల్ రావిపూడికి షాక్ ఇచ్చిన నయనతార... కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండమ్మా!
అనిల్ రావిపూడికి షాక్ ఇచ్చిన నయనతార... కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండమ్మా!
Embed widget