Kora Movie: 'కోర' మాస్... యాక్షన్ ప్యాక్డ్ టీజర్... స్టార్స్ లేకున్నా సెన్సేషన్ క్రియేట్ చేసేలా!
Kora Teaser Review: స్టార్ హీరోలు ఒక్కరూ లేరు. కానీ, లేటెస్టుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేసిన యాక్షన్ మూవీ 'కోర' టీజర్ మీద ప్రేక్షకుల దృష్టి పెడుతోంది. ఇందులో ఏముంది?
స్టార్ హీరోల సినిమాలకు ఆడియన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళతారు. కొత్త వాళ్ళతో తీసిన సినిమాలు కొన్ని ఈ మధ్య సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన 'కోర' టీజర్ చూస్తే... ఆ కోవలోకి చేరేలా ఉంది.
యాక్షన్ ప్రిన్స్ ధృవ్ సర్జా సమర్పణలో...
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పాన్ ఇండియా ఆడియన్స్ అందరికీ తెలుసు. మరి, ఆయన మేనల్లుడు ధృవ్ సర్జా? హిట్టూ ఫ్లాపులు పక్కన పెడితే... పొగరు, మార్టిన్ సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన సమర్పణలో రూపొందుతున్న సినిమా 'కోర'.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో 'కోర' ఒకటి. ఒరాట శ్రీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రియాలిటీ స్టార్ 'సునామీ' కిట్టి హీరోగా యాక్ట్ చేస్తున్నారు. చరిష్మా, పి. మూర్తి ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ సంస్థలపై డా. ఏబీ నందిని, ఏఎన్ బాలాజీ, పి. మూర్తి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
'కోర' టీజర్ చూస్తే... ఒక్క డైలాగ్ కూడా లేదు. కానీ, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఆ విజువల్స్ చూస్తూ ఉండేలా చేసింది. అందుకు కారణం సినిమా స్టోరీ బ్యాక్ డ్రాప్. ఓ దేవత, ఆమె ముందు కొందరిని బలి ఇవ్వడానికి సిద్ధమైన రాక్షసుడి లాంటి మనిషి. అతడిని ఎదిరించిన ఓ యువకుడు. గూస్ బంప్స్ ఇచ్చేలా హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులతో 'కోర' తెరకెక్కినట్టు అర్థం అవుతోంది. టీజర్ వరకు విజువల్స్, కెమెరా వర్క్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్ మాస్ జనాలకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. త్వరలో సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.
Launching the teaser of #KORA, Best Wishes to the entire team! https://t.co/bhOElnlxUF
— VijaySethupathi (@VijaySethuOffl) January 3, 2025
Action Prince @dhruva_sarjaa Presents #Tsunamikitty Hero #MKMATA #SOUJANYA.#Charishma #ANBalaji #PMurthy#DrABNandini #SriLakshmiJyothiCreations #RathnammaMovies#Oratashree… pic.twitter.com/5vSknZHzBI
Kora Movie Cast And Crew: సునామీ కిట్టి, చరిష్మా, పి మూర్తి, ఎంకె మాత, మునిరాజు, నినాసం అశ్వత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సెల్వం మత్తప్పన్, సంగీత దర్శకుడు: బి ఆర్ హేమంత్ కుమార్, కూర్పు: కె. గిరీష్ కుమార్, విన్యాసాలు: కోరా చిన్నయ్య, కళా దర్శకత్వం: జినేద్ర, నిర్మాణ సంస్థలు: శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ - రత్నమ్మ మూవీస్, నిర్మాతలు: డా. ఏబీ నందిని - ఏఎన్ బాలాజీ - పి. మూర్తి, సమర్పణ: యాక్షన్ ప్రిన్స్ ధృవ్ సర్జా, రచన - దర్శకత్వం: ఒరాట శ్రీ.