అన్వేషించండి

Captain Miller First Single : ధనుష్ 'కెప్టెన్' మిల్లర్ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది - ఎప్పుడంటే?

Captain Miller : ధనుష్ హీరోగా నటించిన 'కెప్టెన్ మిల్లర్' మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Captain Miller First Single: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 'కెప్టెన్ మిల్లర్'(Captain Miller) మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ని తాజాగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ధనుష్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ఇంతకీ కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు? డీటెయిల్స్ లోకి వెళితే.. తమిళ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది 'సార్'(Sir) సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం 'కెప్టెన్ మిల్లర్' అనే సినిమాలో నటిస్తున్నాడు.

యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ మూవీ ధనుష్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అరుణ్ మాథేశ్వర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వరల్డ్ వార్ నేపథ్యంలో సాగుతున్నట్లు సమాచారం. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన అందుకుంది. టీజర్ లో ధనుష్ బీస్ట్ మోడ్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో కామ్రేడ్ అవతార్లో కనిపిస్తూ సమరానికి అందర్నీ మేలుకొలుపుతున్నట్టుగా ఉన్న లుక్ ఆకట్టుకుంది. ఇక చెప్పిన దాన్ని ప్రకారమే కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ రానే వచ్చింది.

జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ ని బుధవారం నవంబర్ 22న విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ధనుష్ ముఖానికి ఎరుపు రంగు గుడ్డ చుట్టుకొని, చేతిలో గన్ పట్టుకొని సీరియస్ లుక్ లో దర్శనమిచ్చాడు. అలాగే గోడ మీద 'కిల్లర్ కిల్లర్' అని రాసి ఉంది. దాని ప్రకారం కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ 'కిల్లర్ కిల్లర్' అనే లిరిక్స్ తో సాగనుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ పాటని స్వయంగా ధనుష్ పాడడం విశేషం. ఇప్పటివరకు జీవి ప్రకాష్ - ధనుష్ కాంబోలో వచ్చిన సాంగ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే.

ఇక మరోసారి కెప్టెన్ మిల్లర్ కోసం వీళ్లిద్దరు కలవడంతో ఈ ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇదే పోస్టర్లో సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. పొంగల్ 2024 కి సినిమా రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ధనుష్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

విప్లవ యోధుడు కేప్టెన్ మిల్లర్స్ స్పూర్తితో వస్తున్న ఈ మూవీని మూడు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు వినిపిస్తోంది. సందీప్ కిషన్, నివేదిత సతీష్, ఆర్ఆర్ఆర్ ఫేమ్ ఎడ్వర్డ్ సోన్నెన్ బ్లిక్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ తమిళం తో పాటు తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read : త్రిషపై అనుచిత వ్యాఖ్యలు - అది కాంప్లిమెంట్ అని చెప్పిన మన్సూర్ అలీ ఖాన్ - వైరల్ గా మారిన పోస్ట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget