అన్వేషించండి

Devil : కళ్యాణ్ రామ్ 'డెవిల్' విడుదల వాయిదా - అసలు కారణం ఏమిటంటే?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'డెవిల్'. నవంబర్ 24న విడుదల చేయాలనుకున్నారు. అయితే... ఇప్పుడు వాయిదా పడింది. అసలు కారణం ఏమిటంటే?

Devil release postponed : నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'డెవిల్'. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. నిర్మాత అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో రూపొందింది. దర్శకుడిగా ఆయనకు తొలి చిత్రమిది. 

ఈ సినిమాలో సంయుక్తా మీనన్ కథానాయిక. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ సరసన మరోసారి ఆమె నటించిన చిత్రమిది. నవంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే... ఆ తేదీకి సినిమా రావడం లేదు. వాయిదా వేసినట్లు ఇవాళ తెలిపారు. ఎందుకంటే... 

'డెవిల్' విడుదల వాయిదా...
నవంబర్ 24న 'నో' రిలీజ్!నవంబర్ 24న 'డెవిల్' విడుదల కావడం లేదని చిత్ర బృందం నుంచి సమాచారం అందింది. నేపథ్య సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్) వర్క్ ఇంకా పూర్తి కాలేదని, అందువల్ల థియేటర్లలోకి ముందుగా ప్రకటించిన తేదీకి కాకుండా కాస్త ఆలస్యంగా సినిమాను తీసుకు వస్తామని తెలిపారు. త్వరలో కొత్త విడుదల తేదీ అనౌన్స్ చేస్తామని తెలిపారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందివ్వడం కోసం తమ చిత్ర బృందం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని 'డెవిల్' యూనిట్ పేర్కొంది. 

Also Read : వైష్ణవ్ తేజ్, శ్రీ లీల సినిమాపై వరల్డ్ కప్ ఎఫెక్ట్ - దీపావళి బాక్సాఫీస్ బరిలో నుంచి వెనక్కి వెళ్లిన 'ఆదికేశవ'

'డెవిల్' సినిమాను విడుదల చేయాలని అనుకున్న నవంబర్ 24వ తేదీకి... ఇప్పుడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, క్రేజీ కథానాయిక శ్రీ లీల నటించిన 'ఆదికేశవ' సినిమాతో పాటు శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన తారాగణంగా రూపొందిన 'కోట బొమ్మాళి పీఎస్' విడుదల అవుతున్నాయి. 

Also Read 'కీడా కోలా' ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది - బ్రహ్మి, తరుణ్ భాస్కర్ సినిమా ఎలా ఉందంటే?

నందమూరి కళ్యాణ్ రామ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్. మణిమేఖల పాత్రలో రాజకీయ నాయకురాలిగా యంగ్ హీరోయిన్ మాళవికా నాయర్ కనిపించనున్నారు. రోజీగా బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్‌ నరౌజి నటించారు. ఇటీవల వాళ్లిద్దరి ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌ : గాంధీ నడికుడియార్‌, కూర్పు : తమ్మిరాజు, కథా విస్తరణ : ప్రశాంత్‌ బారది, కాస్ట్యూమ్‌ డిజైనర్ : విజయ్‌ రత్తినమ్‌ ఎంపీఎస్‌ఈ, కథ - కథనం - సంభాషణలు : శ్రీకాంత్‌ విస్సా, ఛాయాగ్రహణం : సౌందర రాజన్‌, సంగీతం : హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, నిర్మాణ సంస్థ : అభిషేక్‌ పిక్చర్స్, సమర్పణ : దేవాంశ్‌ నామా, నిర్మాణం & దర్శకత్వం: అభిషేక్‌ నామా. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget