రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా 'దేవర' : కొరటాల శివ భారీ స్కెచ్
కొరటాల శివ డైరెక్షన్లో రాబోతున్న ఎన్టీఆర్ కొత్త సినిమా 'దేవర' గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని సన్నివేశాలను నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.
Real-life Incidents in Devara : 'ఆర్ఆర్ఆర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న 'దేవర' కోసం ఇప్పుడు అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్ డేట్ రివీల్ అయింది. 'దేవర' స్టోరీ విషయంలో డైరెక్టర్ చాలా కేర్ తీసుకుని.. ఈ మూవీని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో.. 'దేవర' స్టోరీపై మరింత పకడ్బందీగా ప్రణాళిక చేసినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా హల్ చల్ చేస్తోన్న సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ప్రకారం.. 'దేవర'ను రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారట కొరటాల శివ. ఇంతకీ ఆ రియల్ ఇన్సిడెంట్స్ దేన్నుంచి తీసుకున్నారు.. అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కొరటాల శివ ‘దేవర’ చిత్రాన్ని గతంలో దళితులపై జరిగిన క్రూరమైన హత్యాకాండ ఆధారంగా రూపొందింస్తున్నట్లు తెలుస్తోంది. కారంచేడు విషాద ఘటనను ఇందులో చూపించనున్నారని సమాచారం. 1985లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు. ఈ నిజ జీవిత సంఘటనలను ‘దేవర’ చిత్రంలో చూపించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అప్పట్లో ఈ సంఘటన ఆ రాష్ట్రంలో పెద్ద రాజకీయ తుఫానును రేపింది.
మామూలుగా కొరటాల శివ సినిమాలంటేనే ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడం లేదంటే ఏదైనా సామాజిక అంశాన్ని టచ్ చేయడం ఉంటాయి. ‘మిర్చి’ సినిమాలో ఫ్యాక్షన్ గొడవలను, ‘శ్రీమంతుడు’ చిత్రంలో గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ‘భరత్ అనే నేను’ మూవీలో రాజకీయాల్లో జవాబుదారీతనం, ‘ఆచార్య’లో నక్సలైట్ ఉద్యమాన్ని చూపించారు. అదే తరహాలో ఇప్పుడు ఎన్టీఆర్ ‘దేవర’ స్టోరీలోనూ కారంచేడు విషాద ఘటన తాలూకు సీన్లు ఉండవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
కొరటాల శివ స్టోరీ విషయంలోనే కాదు.. కాస్టింగ్ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కానట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తారక్‌కు జోడీగా ఎంపిక చేశారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ను విలన్‌గా చూస్ చేసుకున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. అంతే కాదు ఈ చిత్రానికి టాప్ మోస్ట్ టెక్నికల్ టీమ్ పనిచేస్తున్నట్టు సమాచారం. కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ దేవరకు మ్యూజిక్ అందిస్తుండగా.. ఈ సినిమాలోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్ల కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
Read Also : Bawaal Movie Review - 'బవాల్' రివ్యూ : అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ సినిమా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial