Devara Movie: ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి కొత్త అప్డేట్ - నైట్ ఎఫెక్ట్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్!
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఇటీవలే మూవీ టీమ్ హైదరాబాద్ లో షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Devara Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమా కోసం పనిచేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ నుంచి వచ్చే తదుపరి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అందుకే ‘దేవర’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకు టాలెంటెడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభించిన షూటింగ్ షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసింది మూవీ టీమ్. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనట్టు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ లో షూట్ చేసిన స్పెషల్ నైట్ ఎఫెక్ట్ యాక్షన్ సీక్వెన్స్ గురించి మూవీ సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు ఒక ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడీ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
నీళ్లల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు..
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయింతో తెలిసిందే. అందుకే ఈ ‘దేవర’ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ ను ముగించుకుంది మూవీ టీమ్. ఇక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను తెరెక్కించారట. అయితే షూటింగ్ పూర్తయిన సందర్భంగా మూవీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తో నైట్ ఎఫెక్ట్ లో, తక్కువ లైట్ లో, నీళ్లల్లో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఇప్పుడే షూటింగ్ పూర్తయింది అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు దానికి షూటింగ్ స్పాట్ లోని ఓ ఫోటోను కూడా జతచేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు ‘దేవర’..
కొరటాల శివ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘జనతా గ్యారేజ్’ లో చూస్తే అది అర్థమవుతుంది. అయితే ఈ ‘దేవర’ సినిమాను కొరటాల శివ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. అందుకే మేకింగ్ విషయంలో ఎక్కడా తగ్గడంలేదు. ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఫైట్స్ డిజైన్ చేస్తున్నారు. సముద్రంలో జరిగే భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయని అంటున్నారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే తారాగణాన్ని కూడా ఎంపిక చేశారు దర్శకుడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. తెలుగులో ఇదే ఆమెకు మొదటి సినిమా కావడం విశేషం. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై హరికృష్ణ కె, యువసుధ ఆర్ట్స్‌పై సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Also Read: సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్
Filmed an interesting night effect action sequence in extreme low light n shade 🌊 with @tarak9999 brother 🔥 #Devara director #KoratalaSiva @anirudhofficial @NTRArtsOfficial @YuvasudhaArts @ARRIChannel #Arri Alexa LF #Arri Signature Primes pic.twitter.com/kYM7PPKwOU
— Rathnavelu ISC (@RathnaveluDop) June 25, 2023