అన్వేషించండి

Saif Ali Khan: ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో చేయ‌డం ఆనందంగా ఉంది, ఎన్టీఆర్ చాలా ఫ్ల్రెండ్లీ - 'దేవ‌ర'లో విల‌న్ సైఫ్ అలీ ఖాన్

Saif Ali Khan: చాలా మంది న‌టులు ఇప్పుడు టాలీవుడ్ లో న‌టించ‌డం త‌మ అదృష్టంగా భావిస్తున్నారు. అదే అంటున్నారు దేవ‌ర విల‌న్ సైఫ్ అలీఖాన్. ఆయ‌న త‌న ఎక్స్ పీరియ‌న్స్ గురించి ఏమ‌న్నారంటే?

Saif Ali Khan About Devara Movie And Working Experience With Jr NTR: ఇప్పుడు ఇండ‌స్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హ‌వా న‌డుస్తుంది . దాంట్లో భాగంగా ఇత‌ర భాష‌ల న‌టీన‌టులు తెలుగు సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంటున్నారు. నిజానికి తెలుగు సినిమాల్లో న‌టించ‌డం వాళ్ల అదృష్టంగా భావిస్తున్నారు. అదే విష‌యాన్ని చెప్పారు బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్. 'దేవ‌ర' సినిమాలో ఆయ‌న విల‌న్ గా న‌టించిన విష‌యం తెలిసిందే. 'దేవ‌ర' ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో ఆయ‌న సినిమా గురించి గొప్ప‌గా చెప్పారు. అంతే కాకుండా తెలుగులో న‌టించ‌డం చాలా అదృష్టంగా భావిస్తున్నాన‌ని, ఎన్టీఆర్ లాంటి వ్య‌క్తితో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం లవ్లీగా ఉందని అన్నారు. తెలుగులో న‌టించ‌డంపై ఆయ‌న ఏమ‌న్నారంటే? 

ఈ రోల్ కి ఒప్పుకోవ‌డానికి గల కార‌ణాలు ఏంటి? 

"సౌత్ ఇండ‌స్ట్రీ, ఆంధ్రా నుంచి చాలా అద్భుత‌మైన సినిమాలు రిలీజ్ అవుతాయి. అలాంటి ఇండ‌స్ట్రీలో చేయ‌డం ఎగ్జైటింగ్ గా అనిపించింది. అంతే కాకుండా ఇలాంటి పెద్ద సినిమాలో చేయ‌డం ఆనందాన్ని ఇచ్చింది. ఎన్టీఆర్, శివ నేనే ఈ సినిమాకు కావాలనుకోవ‌డం హ్యాపీగా ఉంది. నేను చేసింది చాలా ఇంట్ర‌స్టింగ్ క్యారెక్ట‌ర్. ఆ వెర్ష‌న్స్, క్రేజీ మేక‌ప్, యాంటీ హీరోగా చేయ‌డం చాలా ల‌వ్లీగా అనిపించింది. కొత్త‌ ర‌కం సినిమా, కొత్త ల్యాండ్‌ స్కేప్‌లోకి అడుగు పెట్టడంతో కొత్తగా అనిపించింది" అని అన్నారు సైఫ్ అలీ ఖాన్.  

ఎన్టీఆర్ తో క‌లిసి ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది? 

"ఎన్టీఆర్ చాలా ఫ‌న్నీ ప‌ర్స‌న్, ఈజీ గోయింగ్ ప‌ర్స‌న్. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా బాగా అనిపించింది. చాలా కంఫ‌ర్ట్ గా అనిపించింది. ఎప్పుడూ న‌వ్వుతూ అంద‌రినీ న‌వ్విస్తూ ఉంటాడు. ఆఫ్ సెట్స్ లో చాలా ఫ్ల్రెండ్లీగా ఉంటాడు. ఫ‌స్ట్ డే షూట్ రోజు ఆయ‌న న‌న్ను క‌లిశారు. నాతో మాట్లాడారు. అప్పుడు చాలా కంఫ‌ర్ట్ గా అనిపించింది. చాలా డౌన్ టూ ఎర్త్ ప‌ర్స‌న్. న‌న్ను త‌న ఇంటికు పిలిచాడు. వంట వండిపెట్టాడు. చాలా మ‌ర్యాద‌లు చేశాడు. గొప్ప‌గా చూసుకున్నాడు. కెమెరా ముందు చాలా హుందాగా ఉంటాడు. ఆ త‌ర్వాత అంద‌రినీ న‌వ్విస్తూ ఉంటాడు. ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సిన అన్ని ల‌క్ష‌ణాలు ఆయ‌న‌లో ఉన్నాయి. ఆయ‌న‌కు ఓపిక కూడా చాలా ఎక్కువ‌. తెలుగులో ఇది ఫ‌స్ట్ సినిమా నాకు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించేట‌ప్పుడు చాలా కంఫ‌ర్ట్ గా ఫీల‌య్యేలా చేశాడు" అని జూనియ‌ర్ ఎన్టీఆర్ తో వ‌ర్క్ చేయ‌డం గురించి త‌న ఎక్స్ పీరియెన్స్ షేర్ చేసుకున్నారు సైఫ్. 

పాన్ ఇండియా సినిమాల‌పై మీ అభిప్రాయం?  

"భార‌త‌దేశంలో వివిధ ఇండ‌స్ట్రీలు ఉన్నాయి. అన్ని భాష‌ల‌, అన్ని రాష్ట్రాల న‌టుల‌ను ఒక సినిమాలో పెట్టి చేయ‌డం అనేది గొప్ప ఐడియా. అది గొప్ప స్టాండ‌ర్డ్స్ ని పాటించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. చాలా సినిమాలు అలా చేశారు. భ‌విష్య‌త్తులో కూడా అలా కంటిన్యూ చేయాల‌ని కోరుకుంటున్నాను. నేను చాలా ల‌క్కీ ఈ సినిమా వ‌ల్ల తెలుగు నేర్చుకుంటున్నాను. అలా చాలా మంది న‌టులు వాళ్ల కంఫ‌ర్ట్ జోన్ లో నుంచి బ‌య‌టకు వ‌చ్చి కొత్త విష‌యాలు నేర్చుకోవ‌చ్చు పాన్ ఇండియా సినిమాలు చేయ‌డం వ‌ల్ల" అని చెప్పుకొచ్చారు సైఫ్ అలీ ఖాన్. 

సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ కానున్న 'దేవ‌ర‌'

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా 'దేవ‌ర‌'. భారీ అంచ‌నాల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 27న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ హీరోయిన్, సైఫ్ అలీ ఖాన్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. జాన్వీ క‌పూర్, సైఫ్ ఇద్ద‌రూ ఈ సినిమాతోనే తెలుగులో ప‌రిచ‌యం కానున్నారు. ఇక ఈసినిమా ట్రైల‌ర్ ఇప్ప‌టికే అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ట్రైల‌ర్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా హిట్ బొమ్మ అని ధీమా వ్య‌క్తి చేస్తున్నారు. 

Also Read: మలైకా ఆరోరా ఇంట విషాదం... బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహ్యత చేసుకున్న తండ్రి

టాప్ హెడ్ లైన్స్

Vadhandhi Season 2 OTT : అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
NTR Dragon Update : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
Chinna Chinna Aasai OTT : అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Ram Charan : రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Embed widget