అన్వేషించండి

Devagudi Movie Review - 'దేవగుడి': ఫ్యాక్షన్‌ విలన్‌గా రఘు కుంచె... కుల వ్యవస్థను ప్రశ్నించిన సీమ సినిమా ఎలా ఉందంటే?

Devagudi Review Telugu: ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దేవగుడి'. బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శక రచయిత. ఈ సినిమా ఎలా ఉందంటే?

గాయకుడు, సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రఘు కుంచె నటుడిగా మారిన సంగతి తెలిసిందే. పలు సినిమాల్లో నటించారు. విలన్ రోల్స్ కూడా చేశారు. రఘు కుంచె ప్రతినాయకుడిగా నటించిన తాజా సినిమా 'దేవగుడి'. అభినవ శౌర్య, అను శ్రీ జంటగా నటించారు. నరసింహ ప్రధాన పాత్రధారి. బెల్లం రామకృష్ణారెడ్డి దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (Devagudi Movie Story): వీరారెడ్డి (రఘు కుంచె) ఫ్యాక్షన్ లీడర్. ఆయనది దేవగుడి. ఊరిలో ప్రజలు అందరి బాగోగులు చూసుకోవడంలో ఎటువంటి లోటు చేయడు. తన అనుచరులలో ఒకరి కుమారుడైన ధర్మ (అభినవ్ శౌర్య)తో కన్న కూతురు శ్వేత (అను శ్రీ) ప్రేమలో పడుతుంది. మరోవైపు ధర్మతో సమానంగా తన కొడుకు (నరసింహ)ను ప్రజలు చూడటానికి వీరారెడ్డి సహించలేడు. దాంతో ఊరి నుంచి ధర్మను పంపించేస్తాడు.  

ధర్మ వెళ్లిన కొన్ని రోజులకు వీరారెడ్డి అనారోగ్యం పాలవుతాడు. ఆ సమయంలో ఇద్దరు అనుచరులు హత్యకు గురి కావడంతో పాటు శ్వేత కనిపించకుండా పోతుంది. శ్వేత మిస్సింగ్ వెనుక ఎవరు ఉన్నారు? కారణం ఏమిటి? వీరారెడ్డి కొడుకుతో ఎంతో స్నేహంగా తిరిగే ధర్మ, నిజంగా స్నేహితుడి చెల్లెల్ని ప్రేమించాడా? ఒక వైపు అనుచరుల మరణం, మరో వైపు కుమార్తె మాయం... వీరారెడ్డి ఏం చేశాడు? అనేది సినిమా. 

విశ్లేషణ (Devagudi Review Telugu): రాయలసీమ ఫ్యాక్షన్ మీద ఎన్ని కోణాల్లో కథలు చెప్పాలో... అన్ని కోణాల్లోనూ తెలుగు తెరపై దర్శక రచయితలు కథలు చెప్పారు. ఇప్పటి వరకు ఎక్కువగా కక్షలు, ప్రతీకారాలు నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. అయితే బెల్లం రామకృష్ణారెడ్డి ఫ్యాక్షన్ కథకు కుల వ్యవస్థను మేళవించి కొత్త కోణం ఇచ్చే ప్రయత్నం చేశారు. గ్రామ దేవతలు, భక్తి వంటి అంశాలనూ కాస్త ప్రస్తావించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pushyami Film Makers (@pushyami_film_makers)

ఇటీవల కుల వ్యవస్థ నేపథ్యంలో 'దండోరా' వచ్చింది. గతంలో కంటే కాస్త ఘాటుగా ప్రశ్నలు సంధించింది. ఇప్పుడీ 'దేవగుడి' సైతం అదే విధంగా కులవ్యవస్థపై కొన్ని ప్రశ్నలు సంధించింది. కాకపోతే ఫ్యాక్షన్ నేపథ్యంలో కథ సాగుతుంది. 'దేవగుడి' దర్శక రచయిత బెల్లం రామకృష్ణారెడ్డి ఆలోచన బావుంది. ఆయన కథను చెప్పిన విధానం కూడా బావుంది. అయితే... కథనం, సన్నివేశాల్లో గతంలో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలను గుర్తు చేసేలా దర్శకత్వం సాగింది. అది సినిమాకు మైనస్. కానీ, చాలా వరకు ఎంగేజింగ్‌గా తీశారు. టెక్నికల్ అంశాల పరంగా సినిమాను బాగా తీశారు. ఇటీవల కాలంలో వచ్చిన లో బడ్జెట్, చిన్న సినిమాల్లో స్ట్రాంగ్ టెక్నికల్ అవుట్ పుట్ ఇచ్చిన సినిమాల్లో ఇదొకటి.

Also Read: Gatha Vaibhava Review - 'గత వైభవం' రివ్యూ: Prime Videoలో ఆషికా రంగనాథ్ సినిమా... మూడు జన్మల ప్రేమకథ ఎలా ఉందంటే?

'దేవగుడి'లో పాటలు బావున్నాయి. చిత్ర పాడిన పాటతో పాటు రఘు కుంచె పాడిన సాంగ్ కూడా హైలైట్ అని చెప్పాలి. విజువల్స్ బావున్నాయి. సినిమాకు కమర్షియల్ టచ్ ఇవ్వడంలో కెమెరా వర్క్ హెల్ప్ అయ్యింది. కథకు అవసరమైన మేరకు ఖర్చు చేశారు. రాయలసీమ నేపథ్యంలో ఆసక్తికరంగా ప్రారంభమైన సినిమా... మధ్యలో కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నా కమర్షియల్ సినిమాలు కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ముందుకు వెళుతుంది. క్లైమాక్స్ అయితే ఒక షాక్ ఇస్తుంది. యాక్షన్ సీక్వెన్సులు బాగా కుదిరాయి. కామెడీ మాత్రం ఆశించిన రీతిలో నవ్వులు తీసుకు రాలేదు.   

'దేవగుడి'కి అసలైన హీరో రఘు కుంచె. ఆయన విలన్ రోల్ చేశారు కానీ నటనతో అదరగొట్టారు. సరైన కథ, పెద్ద సినిమా పడితే ఆయన నటన (విలనిజం) మరింత ఎలివేట్ అవుతాయి. విలన్ లేని కొరతను తీరుస్తారు. హీరో అభినవ్ శౌర్య తన పాత్రకు న్యాయం చేశారు. అనుశ్రీ నటన, అందం ఆకట్టుకుంటాయి. మీసాల లక్ష్మణ్, నరసింహ, రాకెట్ రాఘవ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.   

విలన్‌గా రఘు కుంచె వన్ మ్యాన్ షో చేసిన సినిమా 'దేవగుడి'. రాయలసీమ, ఫ్యాక్షన్ నేపథ్యంలో కుల వ్యవస్థను ప్రశ్నించిన చిత్రమిది. హీరో హీరోయిన్లు కొత్తవాళ్ళు అయినా ఎంకరేజ్ చేయాలని, కమర్షియల్ సినిమాలు చూడాలని ఆశించే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళడం మంచిది.

Also ReadOm Shanti Shanti Shantihi Review Telugu - 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ: మొగుడ్ని పెళ్ళాం కొడితే... తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget