అన్వేషించండి

Gatha Vaibhava Review - 'గత వైభవం' రివ్యూ: Prime Videoలో ఆషికా రంగనాథ్ సినిమా... మూడు జన్మల ప్రేమకథ ఎలా ఉందంటే?

OTT Review - Gatha Vaibhava On Amazon Prime: ఆషికా రంగనాథ్ నటించిన కన్నడ సినిమా 'గత వైభవ'. తెలుగులో 'గత వైభవం' పేరుతో డబ్బింగ్ చేశారు. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Ashika Ranganath's Gatha Vaibhava Review In Telugu: అక్కినేని నాగార్జున 'నా సామి రంగ', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో తెలుగులో ఆషికా రంగనాథ్ పాపులర్ అయ్యారు. చిరంజీవి 'విశ్వంభర'లోనూ నటించారు. కన్నడలో ఆషికా రంగనాథ్ కథానాయికగా నటించిన సినిమా 'గత వైభవ'. తెలుగులో 'గత వైభవం'గా డబ్బింగ్ చేశారు. ఇందులో ఎస్ఎస్ దుష్యంత్ హీరో. ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించడంతో పాటు దీపక్ తిమ్మప్పతో కలిసి నిర్మించారు. ఇప్పుడీ సినిమా ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (Gatha Vaibhava Story): ఫేస్‌బుక్‌లో ఆధునిక (ఆషికా రంగనాథ్) ఓ డ్రాయింగ్ పోస్ట్ చేస్తుంది. అందులోని వ్యక్తి ముఖ్యం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, వీఎఫ్ఎక్స్ స్టూడియో అధినేత పురాతన్ (ఎస్ఎస్ దుశ్యంత్)లా ఉంటుంది. తన ఫోటో పోస్ట్ చేయడం వెనుక కారణం ఏమిటి? తనను ఎందుకు కలవాలని అనుకుంటుంది? తెలుసుకోవాలని వెళతాడు పురాతన్. మనది జన్మజన్మల బంధం అని చెబుతుంది ఆధునిక.

ఆధునిక చెప్పింది పురాతన్ నమ్మాడా? లేదా? అమృతం కోసం దేవుళ్ళు - రాక్షసులకు మధ్య జరిగిన సంఘర్షణలో వాళ్ళ పాత్రలు - కథ ఏమిటి? మరొక జన్మలో ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Gatha Vaibhava Telugu Review): పునర్జన్మల నేపథ్యంలో కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. కోకొల్లలుగా వచ్చాయి. ఈతరం ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే... 'మగధీర'. అందులో గత జన్మ ఒక్కటే చూపించారు. 'గత వైభవం'లో మూడు జన్మలు చూపించారు. ఓ జన్మలో అమృతం కోసం అసుర గణానికి - దైవ గణానికి మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రేమకథ చూపిస్తే... మరో జన్మలో జల్లికట్టు తరహాలో కన్నడ నాట జరిగే దున్నలు మధ్య పరుగు పోటీలు చూపించారు. మరొకటి పోర్చుగల్ నేపథ్యంలో తీసిన కామెడీ కథ.

కథ పరంగా చూస్తే... 'గత వైభవం'లో అసలు కొత్తదనం లేదు. పునర్జన్మల కాన్సెప్ట్ బేస్ చేసుకుని వచ్చిన సినిమాలను మిక్సీలో వేసి తీసినట్టు ఉంది. సన్నివేశాల విషయానికి వస్తే... దర్శకుడు చాలా క్రియేటివిటీ చూపించారు. కొంచెం కూడా 'వావ్' అనిపించేలా లేదు. ఈ జన్మ కథలో అమ్మాయి పేరు ఆధునిక. అయితే... ఆమె వేసేది డ్రాయింగ్. కూర్గ్ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య పురాతన కాలానికి చెందిన అమ్మాయిగా, గత జన్మ స్మృతులు గుర్తు చేసుకుంటుంది. అబ్బాయి పేరు పురాతన్. అతని వృత్తి మోడ్రన్ టెక్నాలజీ బేస్ చేసుకుని నడిచే కంపెనీ రన్ చేయడం. బహుశా... ఆయా పేర్లకు భిన్నంగా క్యారెక్టర్లు డిజైన్ చేయడం ఒక్కటే క్రియేటివిటీ, కొత్తదనం అనుకున్నట్టు ఉన్నారు. ఒక్కటంటే ఒక్క సీన్, ఒక్కటంటే ఒక్క కన్వర్జేషన్ (సంభాషణ) సరిగా రాయలేదు. పోర్చుగల్ నేపథ్యంలో కథ ఇంకా హైలైట్... పడవ / ఓడకు రంద్రం పడితే, అందులో నుంచి వచ్చే నీటిని బయటకు తోడటం కోసం ఒడ్డుకు వచ్చి అడుక్కునే అమ్మాయి (హీరోయిన్ ఆషికా రంగనాథ్)ని ఎక్కించుకుని వెళతారు. ఎంత కామెడీ చేయాలని అనుకున్నా... ఆ కామెడీని చూసి నవ్వడం కష్టం.

Also Read: Mardaani 3 Review Telugu - 'మర్దానీ 3' రివ్యూ: మెచ్యూర్ కాని అమ్మాయిలే టార్గెట్... కిడ్నాప్ రాకెట్‌ గుట్టు రట్టు చేసిన రాణీ ముఖర్జీ... యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

ఈ జన్మ, పోర్చుగీస్ జన్మ వదిలేసి... మరొక రెండు జన్మలైనా హృదయానికి తాకేలా చూపించారా? అంటే అదీ లేదు. దేవలోకంలో ప్రేమ కథ చూస్తే కొంచెం కూడా ఇంట్రెస్ట్ రాదు. అసలు ఆ కథలో ప్రేమ కనిపించదు. అసుర గణానికి చెందిన వ్యక్తితో దేవతలకు చెందిన అమ్మాయి ప్రేమలో పడటానికి సరైన కారణం ఉండాలి కదా! అది ఉండదు. మరొక కథలో బరిలో దున్నలను భలే పరిగెత్తిస్తాడని విని ఓ అమ్మాయి ప్రేమలో పడటం ఏమిటో అర్థం కాదు. జల్లికట్టు తరహాలో ఆ దున్నలు పోటీలకు ప్రత్యేకత ఏమైనా ఉందా? అంటే అదీ ఉండదు. జన్మ జన్మలు ఉంటే చాలు అన్నట్టు, సన్నివేశాల్లో భావోద్వేగాలు అవసరం లేదన్నట్టు కథ - కథనం సాగాయి. సినిమాటోగ్రఫీ ఓకే కానీ మ్యూజిక్ అసలు బాలేదు. సుని దర్శకత్వం అసలు ఆకట్టుకోలేదు.

'గత వైభవం'లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం ఏదైనా ఉందంటే... అది ఒక్క ఆషికా రంగనాథ్ మాత్రమే. తెలుగు ప్రేక్షకులకు ఆవిడ తెలుసు, అంతే! కొన్ని సన్నివేశాల్లో అందంగా కనిపించారు. అంతే చక్కగా నటించారు. అయితే మరికొన్ని సన్నివేశాల్లో మరింత పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. ఆషికా నటన తర్వాత గ్రామీణ నేపథ్యంలో వచ్చే ప్రేమకథలో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా హీరో దుష్యంత్ లుక్స్ ఓకే. కానీ, యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి. మిగతా ఆర్టిస్టుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ.

పునర్జన్మల నేపథ్యంలో సినిమాకు బలమైన కథ, భావోద్వేగాలు అవసరం. గత జన్మలో ఏం జరిగిందో, తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలి. 'గత వైభవం' అందుకు భిన్నంగా ఎప్పుడు శుభం కార్డు పడుతుందోనని ఎదురు చూసేలా సాగుతుంది. కథ - ప్రేమ - సంభాషణల్లో ఆసక్తి కలిగించే, ఆకట్టుకునే అంశాలు లేవు. ఓటీటీలోనూ ఫార్వర్డ్ చేస్తూ చూడటం కష్టమే. స్కిప్ చేయడం మంచిది.

Also ReadOm Shanti Shanti Shantihi Review Telugu - 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ: మొగుడ్ని పెళ్ళాం కొడితే... తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా సినిమా ఎలా ఉందంటే?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
Ind vs Nam Match Highlights: T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
YSRCP: మండలిలోనే  పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Muscial Road | ముంబైలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు సంగీతం పాడుతుంది | ABP Desam
India va Namibia Match Preview | T20 World Cup 2026 లో మోత మొదలు పెడతారా.? | ABP Desam
Rohit Sharma on 2027 ODI World Cup | వన్డే వరల్డ్ కప్ భారత్ గెలుస్తుందని హిట్ మ్యాన్ ధీమా | ABP Desam
Saqlain Mushtaq on Ind vs Pak Match Pitch | మ్యాచ్ ఆడకముందే ఏడుపులు మొదలు | ABP Desam
Sanju Samson Playing Against Namibia | నమీబియాతో మ్యాచ్ లో బరిలోకి దిగనున్న సంజూ | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
Ind vs Nam Match Highlights: T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
YSRCP: మండలిలోనే  పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
Ambati Rambabu remanded: తగ్గేదే లే.. మళ్లీ రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు - లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్
తగ్గేదే లే.. మళ్లీ రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు - లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్
MS Dhoni:'ఎంఎస్ ధోని రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది', మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు!
'ఎంఎస్ ధోని రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది', మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు!
AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌కు అసలు ఆర్కిటెక్ట్ రాజ్ కేసిరెడ్డే - బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
లిక్కర్ స్కామ్‌కు అసలు ఆర్కిటెక్ట్ రాజ్ కేసిరెడ్డే - బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
Cop elopes with history sheeter : ఖాకీ ప్రేమ.. ఖైదీతో పరార్- పెళ్లి పీటల మీద  పోలీస్ వరుడికి షాకిచ్చిన మహిళా కానిస్టేబుల్!
ఖాకీ ప్రేమ.. ఖైదీతో పరార్- పెళ్లి పీటల మీద పోలీస్ వరుడికి షాకిచ్చిన మహిళా కానిస్టేబుల్!
Embed widget