అన్వేషించండి

Detective Teekshana Song : కనికరమే లేని యువతి - ప్రియాంకా ఉపేంద్ర షీరోయిజం ఎలివేట్ చేసే 'డిటెక్టివ్ తీక్షణ' టైటిల్ సాంగ్ 

యాక్షన్ క్వీన్ ప్రియాంకా ఉపేంద్ర (Priyanka Upendra) 50వ సినిమా 'డిటెక్టివ్ తీక్షణ'లో మొదటి పాట విడుదల 'రేజ్ ఆఫ్ తీక్షణ' విడుదలయింది. 

Rage of Teekshana Song : ప్రముఖ కన్నడ కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన ఉపేంద్ర భార్య, యాక్షన్ క్వీన్ డా. ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'డిటెక్టివ్ తీక్షణ' (Detective Teekshana Movie). కథానాయికగా ఆమెకు 50వ చిత్రమిది. త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహిస్తున్నారు. ఈవెంట్ లింక్స్ ఎంటర్టైన్మెంట్, ఎస్డిసి సినీ క్రియేషన్స్ సంస్థలపై గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం బి. కోయురు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తొలి పాటను ఇటీవల విడుదల చేశారు. 

''రణరణమున రధము నిలిపి...
రుధిర నదిని ఎదురు మలిపి... 
కుత్తుకల కోట కూల్చే తీక్షణా!
కణకణమున యుద్ధ నీతి... 
కనికరమే లేని యువతి... 
క్రూర కథల కత్తివేటు తీక్షణా!''
అంటూ సాగిన టైటిల్ సాంగ్ (Detective Teekshana Title Song)ను హైమత్ మొహమ్మద్, సాయి చరణ్ భాస్కరుని, అరుణ్ కౌండిన్య ఆలపించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ కంపోజర్ పెద్దపల్లి రోహిత్ (పీఆర్) సంగీతం అందిస్తున్నారు. ఈ పాటను కూడా ఆయనే రాశారు. తాను అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగించే యువతిగా 'రేజ్ ఆఫ్ తీక్షణ'లో ప్రియాంక ఉపేంద్రను చూపించారు. లిరికల్ వీడియో కూడా ఆకట్టుకుంది. 

Also Read : నవంబర్‌లో క్రేజీ క్రేజీ ఫిలిమ్స్ - థియేటర్లలో సందడి చేసే సినిమాలు

ఏడు భాషల్లో 'డిటెక్టివ్ తీక్షణ' విడుదల!
తెలుగు, కన్నడతో పాటు తమిళ, మలయాళ, ఒరియా, బెంగాలీ, హిందీ భాషల్లో 'డిటెక్టివ్ తీక్షణ'ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇదొక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని నిర్మాతలు తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుందని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామన్నారు.  

Also Read ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?

భయంకరమైన హత్యల నేపథ్యంలో 'డిటెక్టివ్ తీక్షణ' తెరకెక్కించారు. ఆ హత్యలు చేసిన వాళ్ళను ప్రియాంక ఉపేంద్ర ఎలా పట్టుకున్నారు? ఆ కేసును ఆమె ఎలా సాల్వ్ చేశారు? అనేది చిత్ర కథాంశమని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శకుడు చెప్పారు.


 
ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో అవినాష్, మంజునాథ హెగ్డే, ముని వెంకట చరణ్, విజయ్ సూర్య, సిడ్లింగు శ్రీధర్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి  కూర్పు : వైఎస్ శ్రీధర్, కళా దర్శకత్వం : బిఎం నవీన్ కుమార్, ఛాయాగ్రహణం : మను దాసప్ప, సంగీతం: రోహిత్ పెద్దపల్లి, రచన & దర్శకత్వం: త్రివిక్రమ్ రఘు, నిర్మాతలు: గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం బి. కోయురు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
AP Investments: ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
Narne Nithin Engagement: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం - సైలెంట్‌గా చేసుకున్న ‘ఆయ్’ హీరో!
ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం - సైలెంట్‌గా చేసుకున్న ‘ఆయ్’ హీరో!
Google Pixel Phones Banned: యాపిల్ తర్వాత గూగుల్‌పై పడ్డ ఇండోనేషియా - పిక్సెల్ ఫోన్లు బ్యాన్ - ఎందుకంటే?
యాపిల్ తర్వాత గూగుల్‌పై పడ్డ ఇండోనేషియా - పిక్సెల్ ఫోన్లు బ్యాన్ - ఎందుకంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP DesamIndia Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP DesamRishabh pant out Controversy | రిషభ్ పంత్ అవుటా..నాట్ అవుటా..వివాదం మొదలైంది | ABP DesamInd vs NZ 3rd Test Highlights | భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా వైట్ వాష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
AP Investments: ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
Narne Nithin Engagement: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం - సైలెంట్‌గా చేసుకున్న ‘ఆయ్’ హీరో!
ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం - సైలెంట్‌గా చేసుకున్న ‘ఆయ్’ హీరో!
Google Pixel Phones Banned: యాపిల్ తర్వాత గూగుల్‌పై పడ్డ ఇండోనేషియా - పిక్సెల్ ఫోన్లు బ్యాన్ - ఎందుకంటే?
యాపిల్ తర్వాత గూగుల్‌పై పడ్డ ఇండోనేషియా - పిక్సెల్ ఫోన్లు బ్యాన్ - ఎందుకంటే?
AP Assembly: ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా?
ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా?
Hyderabad News: బయటి ఫుడ్ తింటున్నారా? - చికెన్‌లో పురుగు, దోశలో బొద్దింక - ఇవి చూస్తే నిజంగా షాక్
బయటి ఫుడ్ తింటున్నారా? - చికెన్‌లో పురుగు, దోశలో బొద్దింక - ఇవి చూస్తే నిజంగా షాక్
Karimnagar News: ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ - గంటల తరబడి ఎదురుచూపులు, కరీంనగర్‌లో ప్రయాణికుల ఇబ్బందులు
ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ - గంటల తరబడి ఎదురుచూపులు, కరీంనగర్‌లో ప్రయాణికుల ఇబ్బందులు
IND vs NZ 3rd Test Highlights: టెస్టు చరిత్రలో టీమిండియా తొలి వైట్ వాష్! ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
టెస్టు చరిత్రలో టీమిండియా తొలి వైట్ వాష్! ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
Embed widget