Srikanth Day 1 Collections: ‘శ్రీకాంత్’ మూవీకి పాజిటివ్ టాక్ - తన పర్ఫర్మెన్స్‌తో కలెక్షన్స్ కురిపిస్తున్న రాజ్‌కుమార్ రావు
Srikanth Box Office Collections: రాజ్‌కుమార్ రావు హీరోగా నటించిన మూవీ ‘శ్రీకాంత్’.. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ స్టార్ట్‌ను సాధించింది. బ్లైండ్ స్టూడెంట్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు హీరో.
Srikanth Box Office Day 1 Collections: బయోపిక్స్‌ను తెరకెక్కించడంలో బాలీవుడ్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుందని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు. అదే అభిప్రాయాన్ని చాలాసార్లు బీ టౌన్ మేకర్స్ నిజం చేశారు కూడా. తాజాగా మరో బయోపిక్‌తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది బాలీవుడ్. ఈసారి ఒక తెలుగు వ్యక్తి బయోపిక్‌తో పాజిటివ్ రివ్యూలను అందుకుంటోంది. అమెరికాకు వెళ్లి చదువుకున్న మొదటి బ్లైండ్ స్టూడెంట్‌గా రికార్డ్ సాధించిన శ్రీకాంత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమానే ‘శ్రీకాంత్’. తాజాగా విడుదలయిన ఈ మూవీ మొదటి రోజు మంచి కలెక్షన్స్‌తో ఓపెనింగ్ సాధించింది.
మంచి కలెక్షన్స్‌తో..
శ్రీకాంత్ బయోపిక్‌లో టైటిల్ పాత్రలో నటించాడు రాజ్‌కుమార్ రావు. రాజ్‌కుమార్ రావు నటన ఎలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావరేజ్ స్టోరీని కూడా తన నటనతో ఎక్కడికో తీసుకెళ్లే రాజ్‌కుమార్.. అలాంటిది ఒక బ్లైండ్ స్టూడెంట్ పాత్రలో ఒదిగిపోయాడని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ‘శ్రీకాంత్’ మూవీలో ఈ హీరో పర్ఫార్మెన్స్‌కు ఎన్నో అవార్డులు వస్తాయని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. మే 10న విడుదలయిన ఈ బయోపిక్.. మొదటిరోజే రూ.2.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు సమాచారం. ఫస్ట్ వీకెండ్‌లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
విమర్శకుల ప్రశంసలు..
ముంబాయ్, ఢిల్లీలాంటి రాష్ట్రాల్లో ఇతర సినిమాల రిలీజ్ ఉన్నా కూడా ప్రేక్షకులు ఎక్కువగా ‘శ్రీకాంత్’ మూవీని చూడడానికే ముందుకొస్తున్నారు. అందుకే చాలా ప్రాంతాల్లో 12.14% ఆక్యుపెన్సీతో థియేటర్లు నిండిపోయాయి. మొదటిరోజే ఇండియాలో రూ.2.25 నెట్ కలెక్షన్స్ సాధించిన శ్రీకాంత్.. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేలోపు మరింత పుంజుకుంటుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఎంతోమంది విమర్శకులు ఈ సినిమాను, అందులో రాజ్‌కుమార్ రావు పర్ఫార్మెన్స్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. మరికొందరు అయితే 2024లో విడుదలయిన గుర్తుండిపోయే సినిమాల్లో ఇది కూడా ఒకటని అంటున్నారు.
ఇది శ్రీకాంత్ కథ..
ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన బ్లైండ్ స్టూడెంట్ శ్రీకాంత్ బొల్లా సైన్స్ చదవాలనే ఆశపడతాడు. కానీ, అంథులకు సైన్స్‌లో చదివే ఆప్షన్ లేదని చెబుతారు. దీంతో శ్రీకాంత్ ఇండియాలోని చట్టాలను ఎదిరించి, అమెరికా వరకు వెళ్లి అక్కడ టాప్ యూనివర్సిటీలో చదువును పూర్తిచేశాడు. అంతే కాకుండా చదువు పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించి తనలాంటి ఎంతోమందికి ఉపాధిని కల్పించాడు. ఈ కథ చాలామందికి తెలియాలి అనే ఉద్దేశ్యంతో దీనిని సినిమాగా మలిచారు డైరెక్టర్ తుషార్ హీరానందని.
ఇందులో జ్యోతిక, అలాయా ఎఫ్, శరద్ కెల్కర్ కీలక పాత్రల్లో నటించారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, నిధి పర్మర్ హీరానందని.. ‘శ్రీకాంత్’ను సంయుక్తంగా నిర్మించారు. ఒక తెలుగబ్బాయి బయోపిక్.. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలబోతుందని తెలుగు ప్రేక్షకులు గర్వంగా ఫీలవుతున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో రియల్ లైఫ్ శ్రీకాంత్ కూడా పాల్గొన్నాడు.
Also Read: ఇల్లు కొంటానంటే.. షారుఖ్ ఆ సలహా ఇచ్చారు, జాన్వీ బంగ్లా కొనడానికి కారణం ఇదే: రాజ్‌కుమార్ రావ్