ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఎన్ని నష్టాలో తెలుసా? మనిషి అన్నాక ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవల్సిందే. కానీ, ఏ వయస్సులో అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల కొన్ని నష్టాలున్నాయని మీకు తెలుసా? అవేంటో చూద్దాం. ఆలస్య వివాహం దంపతులపై అదనపు బాధ్యతలను పెంచుతుంది. ఇద్దరి ప్రాధాన్యతలు కూడా మారుతాయి. ఒక నిర్థిష్ట వయస్సు తర్వాత వ్యక్తిలో అహం పెరుగుతుంది. అర్థం చేసుకోవడానికి బదులు గొడవ పడుతుంటారు 30 ఏళ్ల తర్వాత మహిళల్లో సంతానోత్పత్తి తగ్గుతుంది. గర్భవతి అయ్యే అవకాశాలు కాలక్రమేణా తగ్గుతాయి. వయస్సు పెరిగే కొద్దీ శరీరక సాన్నిహిత్యం పట్ల మహిళలు పెద్దగా ఆసక్తి చూపరు. దంపతుల మధ్య గొడవలు షురూ అవుతాయి. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే బాధ్యతలతోపాటు ఒకరినొకరు అర్థం చేసుకోవడం తగ్గుతుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే వారి కెరీర్ పైనే ఫోకస్ పెడతారు. దీంతో భాగస్వామిపై తక్కువ శ్రద్ధ చూపుతారు. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే తొందరగా పిల్లలను కనాలని పెద్దవాళ్లు ఒత్తిడి చేస్తారు. దీంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.