Abdu Rozik Engagement: 20 ఏళ్లకే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్, ప్రేమించిన అమ్మాయితో అట్టహాసంగా నిశ్చితార్థం
బిగ్ బాస్ అబ్దు రోజిక్ పెళ్లికి రెడీ అయ్యాడు. ప్రేమించిన అమ్మాయితో సంసార జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు. తాజాగా రోజిక్ ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Bigg Boss 16's Abdu Rozik Shares Pics Of His Engagement: ప్రముఖ తజికిస్తాన్ గాయకుడు, బిగ్ బాస్ 16 కంటెస్టెంట్ అబ్దు రోజిక్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోతో ఓ రేంజిలో పాపులర్ అయ్యాడు. ఇప్పుడు అతడు వివాహ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు. కేవలం 20 ఏళ్ల వయసులోనే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. వయసులో తనకంటే ఏడాది చిన్న అమ్మాయితో సంసార జీవితాన్ని కొనసాగించబోతున్నాడు.
అట్టహాసంగా రోజిక్ నిశ్చితార్థం
రీసెంట్ గా రోజిక్ తన ప్రియురాలితో అట్టహాసంగా ఎంగేజ్మెంట్ వేడుక జరుపుకున్నారు. ఏప్రిల్ 24న దుబాయ్ వేదికగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఆయన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దుబాయ్ సంప్రదాయ దుస్తుల్లో ఎంగేజ్మెంట్ రింగ్ పట్టుకుని కనిపించాడు. మరో ఫోటోలో ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగినట్లు ఉంది. ఇక ఆయన ప్రియురాలు అమీరా వైట్ దుస్తుల్లో కనిపించింది. కానీ, ఆమె పూర్తి ఫోటోను రివీల్ చేయలేదు.
View this post on Instagram
అమీరాతో ప్రేమ గురించి రోజిక్ ఏం చెప్పాడంటే?
ఇక తన ప్రియురాలు గురించి, ప్రేమ గురించి రోజిక్ కీలక విషయాలు చెప్పాడు. “నా జీవితంలో ప్రేమ కంటే విలువైనది మరేదీ లేదు. పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. జీవితంలో ఇదో కొత్త ప్రయాణం. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమని నేను తెలుసుకున్నాను. అందుకే, ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ ప్రేమ నాకు అంత ఈజీగా దక్కలేదు. చాలా అడ్డంకులు, అవరోధాలు ఎదుర్కొని ఇక్కడి వరకు చేరుకున్నాను. నా లవ్ జర్నీ సవాళ్లతో కూడుకొని ఉన్నది. అమీరా, నేను ఒకరినొకరం ఇష్టపడ్డాం. నాకు 20 ఏండ్లు అని అందరికీ తెలుసు. కానీ, నేను ప్రేమలో పడాలని, నన్ను ఎక్కువగా గౌరవించే, ప్రేమించే అమ్మాయిని పొందాలి అని కలలు కన్నాను. అనుకున్నట్లుగానే అమీరా దొరికింది. నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. నన్ను ప్రేమించే అమ్మాయి దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.
రోజిక్ పెళ్లి ఎప్పుడు? ఎక్కడంటే?
తన పెళ్లి డేట్ కూడా రోజిక్ ఫిక్స్ అయినట్లు వెల్లడించాడు. జూలై 7న సమీరాను వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పాడు. దుబాయ్ వేదికగానే ఈ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అందరూ జులై 7న సేవ్ చేసి పెట్టుకోవాలని రోజిక్ కోరారు. ఆయన ఎంగేజ్మెంట్ విషయం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. సంసార జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆకాంక్షిస్తున్నారు. అటు సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు విషెష్ చెప్తున్నారు. ప్రేమ వివాహం చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: గొప్ప మనసు చాటుకున్న జ్యోతిరాయ్ (జగతి మేడం) - పద్మ శ్రీ మొగిలయ్యకు ఆర్థిక సాయం