Deepika Padukone: రోజుకు 8 గంటల వర్క్ - స్పిరిట్, కల్కి 2 నుంచి తప్పించడంపై దీపికా ఫస్ట్ రియాక్షన్
Deepika Padukone Reaction: స్పిరిట్, కల్కి 2 మూవీస్ నుంచి తనను తప్పించడంపై బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు. 8 గంటల వర్కింగ్ అవర్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Deepika Padukone Reaction On Spirit Kalki 2898 AD Sequel: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఇటీవల వరుసగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ నుంచి తప్పించడం హాట్ టాపిక్‌గా మారింది. వర్కింగ్ అవర్స్, కండీషన్స్ వల్లే ఆమెను తప్పించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటిపై రియాక్ట్ అయ్యారు దీపికా.
'వాళ్ల పేర్లు నేను చెప్పదలుచుకోలేదు'
అగ్ర హీరోలు ఎన్నో ఏళ్లుగా 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారని... ఇదేమీ రహస్యం కాదని అన్నారు దీపికా పదుకోన్. 'ఓ ఆత్మాభిమానం ఉన్న నటిగా నన్ను ఇబ్బంది పెట్టే వారిని నేను అంగీకరించను. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది సూపర్ స్టార్స్, అగ్ర హీరోలు ఎన్నో ఏళ్లుగా 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. ఇదేమీ రహస్యం కాదు. అయితే, ఇన్నేళ్లలో ఈ విషయం ఎప్పుడూ వార్తల్లో నిలవలేదు. ఇప్పుడు వాళ్ల పేర్లు చెబితే మొత్తం విషయం తప్పుదోవ పడుతుంది.
అందుకే వారి పేర్లు చెప్పాలనుకోవడం లేదు. కానీ, చాలా మంది హీరోలు 8 గంటలే పని చేస్తారని అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు... వారిలో చాలామంది సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే షూటింగ్‌ల్లో పాల్గొంటారు. వీకెండ్స్‌లో పని చేయరు.' అని తెలిపారు.
Also Read: వెంకీ 'నువ్వు నాకు నచ్చావ్' రీ రిలీజ్ - తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ...
నిశ్శబ్దంగా ఎదుర్కొన్నా
తనకు నిశ్శబ్దంగా యుద్ధాలు చేయడం మాత్రమే తెలుసని దీపికా (Deepika Padukone) అన్నారు. 'న్యాయంగా పోరాటం చేస్తున్న కారణంగా మీరు ఇబ్బంది పడ్డారా?' అంటూ ఎదురైన ప్రశ్నకు ఆమె రియాక్ట్ అయ్యారు. 'నేను దీన్ని చాలాసార్లు ఎదుర్కొన్నా. ఇది కొత్తేం కాదు. దీన్ని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. జీవితంలో ఎన్నో పోరాటాలు నిశ్శబ్దంగా ఎదుర్కొన్నా. కానీ, కొన్ని కారణాల వల్ల అవి బహిరంగంగా మారుతాయి. నేనెప్పుడూ దేనిపైనా రియాక్ట్ కాను. సైలెంట్‌గా యుద్ధాలు చేయడం మాత్రమే నాకు తెలుసు. అలా చేస్తేను అది గౌరవం, హుందాగా ఉంటుంది.' అంటూ చెప్పారు.
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ 'స్పిరిట్' మూవీ నుంచి దీపికా స్థానంలో 'యానిమల్' బ్యూటీ త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు. ఆ తర్వాత తన స్టోరీని లీక్ చేశారంటూ పెట్టిన ట్వీట్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై దీపికా సైతం పరోక్షంగా స్పందించారు. ఇక రీసెంట్‌గా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'వైజయంతీ మూవీస్' కూడా ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి దీపికాను తప్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆమె సీక్వెల్‌లో భాగం కారంటూ వెల్లడించింది. వర్కింగ్ అవర్స్, కండీషన్స్ పెట్టడం వల్లే ఆమెను తప్పించారనే ప్రచారం సాగింది. దీనిపై అటు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే జరిగింది. తాజాగా వర్కింగ్ అవర్స్‌పై దీపికా రియాక్ట్ అయ్యారు.





















