(Source: ECI/ABP News/ABP Majha)
Deepika Padukone: రణ్వీర్ కంటే దీపికా పదుకోన్ సంపాదనే ఎక్కువ... కుమార్తెకు వారసత్వంగా ఎంత ఆస్తి వస్తుందో తెలుసా?
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ తల్లిదండ్రులు అయ్యారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది. అయితే, ఇప్పుడు ఆ బిడ్డకి సంబంధించి వార్త వైరల్ అవుతుంది. అదే ఆ పాపకి వచ్చే ఆస్తి గురించి.
Deepika Padukone Becomes A Mother.. A Look At Her Net Worth: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకోన్ వీళ్లిద్దరూ బాలీవుడ్ లో చాలా ప్రాజెక్ట్స్ చేశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది వాళ్లకి. ఇప్పుడు వాళ్ల గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. అవే వాళ్ల సంపాదన, వాళ్లకు వచ్చే రెమ్యునరేషన్, లగ్జరీ కార్లు తదితర విషయాల గురించి. అయితే, రణ్ వీర్ సింగ్ కంటే దీపికా పదుకోన్ ఎక్కువగా సంపాదిస్తోందట. ఇప్పుడు వాళ్ల గారాల పట్టికి ఎంత ఆస్తి సంక్రమిస్తుంది? వారసత్వంగా ఏం వస్తుంది? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి దీపిక ఆస్తి ఎన్ని కోట్లు, బిజినెస్ లు ఏమున్నాయి? రెమ్యునరేషన్ ఎంత? లగ్జరీ కార్లు ఎన్ని ఉన్నాయి? ఆ వివరాలు ఒకసారి చూద్దాం.
అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న దీపిక
అత్యంత రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఒకరు. కన్నడ సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టిన దీపిక ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి బ్రేకులు లేకుండా ముందుకు సాగుతున్నారు. 'ఐశ్వర్య' అనే సినిమాతో 2008లో దీపికా కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత షారుక్ ఖాన్ సరసన 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో ఫీమేల్ సూపర్ స్టార్ ఎంజాయ్ చేస్తున్న ఆమె ఆస్తుల విలువ అక్షరాల రూ. 500 కోట్లు. అయితే, కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు, ఆమెకు ఎన్నో బిజినెస్ లు కూడా ఉన్నాయి. మరి ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం.
సక్సెస్ కి కేరాఫ్..
దీపికా పదుకోన్ సక్సెస్ కి కేరాఫ్ గా మారిపోయింది. ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టాయి. కలెక్షన్ల వర్షం కురిపించాయి. వరుస హిట్ లు నమోదవ్వడంతో ఆమెకు ఛాన్సులు కూడా ఎక్కవగానే వచ్చాయి. ఆ తర్వాత హాలీవుడ్ సినిమాలో కూడా నటించడంతో ఒక్కసారిగా ఆమె రేంజ్ డబుల్ అయ్యింది. దాంతో పాటుగా ఆస్తుల విలువ కూడా పెరిగిపోయింది.
2024లోనూ హవా..
దీపికా హవా 2024లో కొనసాగింది. 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో ఆమె నటించగా అది సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా టైంలోనే దీపికా ప్రగ్నెంట్ అని ప్రకటించింది. బేబీ బంప్ తోనే ఆమె ప్రమోషన్స్ కూడా చేశారు. కాగా.. సెప్టెంబర్ 8న ఆమె పాపకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు ఆ స్టార్ కపుల్. ఇక దాంతో పాటు ఈ ఏడాది ఆమె తన బ్యూటీ ప్రాడెక్ట్స్ బిజినెస్ లో కొత్త రకాలను ఇంట్రడ్యూస్ చేశారు. బిజినెస్ కూడా బాగా జరిగింది. దీంతో 2024 దీపికకు కలిసి వచ్చిందని, ఆమె రేంజ్ ఇంకా పెరిగిపోయింది అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
పెంచిన రెమ్యునరేషన్..
వరుస హిట్లు, ఫ్యాన్ ఫాలోయింగ్ తో దీపిక రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమె ఆస్తి ఒక్కసారిగా రూ. 500 కోట్లకు చేరినట్లు సమాచారం. ఒక్కో సినిమాకి ఆమె రూ. 30 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. అంటే... ఆమె ఏడాది సంపాదన దాదాపు రూ. 40కోట్ల పైమాటే. దీపికా 2016 - 17 ఆర్థిక సంవత్సరానికి గాను... దాదాపు పదికోట్లు ట్యాక్స్ లు చెల్లించార. ఇప్పుడు ఆమె ఆస్తి దాదాపు 40 శాతం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
82°E: బజినెస్ వెంచర్..
దీపికాకి 82°E అనే బ్యూటీ ప్రాడెక్ట్స్ బిజినెస్ కూడా ఉంది. ఈ బ్రాండ్ ని ఆమె జిగర్ షా అనే వ్యక్తితో కలిసి 2022లో మొదలు పెట్టారు. ఆ బిజినెస్ యాన్యువల్ రెవెన్యూ రేట్ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఆమె చాలా తెలివిగా ఇన్వెస్ట్ మెంట్ చేస్తారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. రియల్ ఎస్టేట్ లో ఆమె పెట్టుబడులు ఇప్పుడు డబుల్ అయ్యాయని అంటున్నారు. 2013లో ప్రభాదేవిలో రూ.16 కోట్లు పెట్టి లగ్జరీ భవనాన్ని కొనుగోలు చేశారు దీపిక. ఆ తర్వాత రణ్ వీర్ బాంద్రాలో రూ. 119 కోట్లతో వాళ్ల డ్రీమ్ హౌస్ కట్టుకున్నారు. ఇక ఈ స్టార్ కపుల్ కి వర్లీలో 5 బెడ్ రూమ్ ల ఆపార్ట్ మెంట్ ఉంది. అది దాదాపు రూ.40 కోట్లు చేస్తుంది. దాంతో పాటుగా అలీభాగ్ లో దాదాపు రూ.22 కోట్ల విలువగల బంగ్లా కూడా ఉంది. అలా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు ఈస్టార్ కపుల్.
లగ్జరీ కార్లు..
ఇదిలా ఉంటే.. దీపికా కార్ల కలెక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఆమెకి చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. దీపికకు మెర్సడెస్ మేబాజ్ ఎస్500 కారు ఉంది. దాని ఖరీదు దాదాపు రూ.1.67 కోట్లు, రెండు ఆడీలు ఉన్నాయి వాటి ధర రూ.1.57 కోట్లు, రూ.93.35 లక్షలు. వాటితో పాటు రూ.64 లక్షలతో ఇటీవల బీఎండబ్ల్యూ 5 సిరీస్ కొనుగోలు చేశారు దీపిక.
స్టార్టప్స్ లో పెట్టుబడులు..
ఇదిలా ఉంటే ఆమె చాలా స్టార్ట్ అప్స్ లో పెట్టుబడులు పెట్టారు. ఎపీగమీ, సూపర్ టైల్స్ లో దాదాపు రూ. 35 కోట్లు పెట్టుబడి చేశారు. ఇక దాంతో పాటుగా ఆమె చాలా లగ్జరీ ఐటమ్స్ వాడుతున్నారు. టిస్సాట్ క్లాసిక్ ప్రిన్స్ డైమండ్స్ వాచ్ రూ. 8 లక్షలు కాగా... ఆమె బ్రెస్ లెట్ రూ. 4లక్షలు. దీపికా హై ఎండ్ హ్యాండ్ బ్యాగ్స్ వాడతారు. ఆమె వేసుకున్న ఒక బ్యాగ్ ధర రూ. 8 లక్షలు కాగా... మరోటి దాదాపు రూ. 2.24 లక్షల విలువ ఉంటుంది. అలా తన లైఫ్ స్టైల్ చాలా లగ్జరీగా ఉంటుంది.
ఇద్దరి ఆస్తి ఎంతంటే?
దీపిక, రణ్ బీర్ సింగ్ ఇద్దరికి బాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉంది. 2013లో ఇద్దరు కలిసి సినిమా చేశారు. ఆ తర్వాత ఆరేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట 2018లో పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో ఇద్దరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. రణ్ బీర్ ఆస్తి వివరాలు చూస్తే ఆయనకు దాదాపు రూ.245 కోట్లు ఉంది. దీపిక సంపాదన దాదాపు రూ.500 కోట్లు కలిపితే ఇద్దరి ఆస్తి రూ.745 కోట్ల వరకు ఉంది. దీంతో వారసురాలికేగా ఆ ఆస్తి మొత్తం అంటూ అంచనా వేస్తున్నారు నెటిజన్లు.
Also Read: ముంబైలో ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగా మీటింగ్ - ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే...