Deadpool And Wolverine: ఇండియాలో ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’కు సూపర్ క్రేజ్ - ప్రీ బుకింగ్స్ విషయంలో సినిమా రికార్డ్
Deadpool And Wolverine: ఈ ఏడాది ఇప్పటికే పలు హాలీవుడ్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్‌లో మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు అలాంటి సక్సెస్ కోసమే ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’ కూడా సిద్ధమవుతోంది.
Deadpool And Wolverine Release In India: ఈ ఏడాదిలో విడుదల కావడానికి ఎన్నో భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’. హ్యూ జాక్‌మన్, ర్యాన్ రేనాల్డ్స్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా ఫైనల్‌గా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. జూలై 26న ఓవర్సీస్‌లో మాత్రమే కాకుండా ఇండియాలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇప్పటికీ ఎన్నో చిత్రాలు విడుదల అయ్యాయి. అందులో దాదాపుగా అన్ని చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’ కూడా అదే కేటగిరిలో చేరడానికి సిద్ధమయ్యింది.
అత్యధిక స్క్రీన్స్...
ఇండియాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)... ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’కు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 8 నిమిషాలు అని తెలుస్తోంది. ఇండియాలో ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను డిస్నీ తీసుకుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హాలీవుడ్ సినిమా విడుదల కాని రేంజ్‌లో ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’ విడుదలకు ప్లాన్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ కోసం ఇండియాలో 3000 స్క్రీన్స్‌ను లాక్ చేసిందట. ముఖ్యంగా యూత్‌కు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడం కోసం మల్టీప్లెక్స్‌లు అన్నీ ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’తో సిద్ధమయ్యాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు కూడా బాగానే హైప్ క్రియేట్ అయ్యింది.
నార్త్‌పైనే ఆశలు...
ఇప్పటికే పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలిస్ లాంటి మల్టీప్లెక్స్ ఛైన్స్‌లో ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’ సినిమాకు 1.45 లక్షల టికెట్లు అమ్ముడు అయ్యాయి. సినిమా విడుదలయ్యేలోపు మొత్తం 2.25 లక్షల టికెట్లు అమ్ముడుపోయే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ఇప్పటికే ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక అడ్వాన్స్ బుకింగే ఈ రేంజ్‌లో ఉంటే ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా ఇదే రేంజ్‌లో ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నార్త్‌లోనే ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’కు దాదాపు రూ.20 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.
పోటీ లేదు..
నార్త్‌లోనే కాకుండా సౌత్‌లో కూడా ఇంగ్లీష్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కానీ ఇండియాలో ఇంగ్లీష్ సినిమాలకు ఎక్కువశాతం కలెక్షన్స్ నార్త్ నుండే వస్తాయి. కానీ ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’ మాత్రం సౌత్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయగలిగితే దీని కలెక్షన్స్ వేరే లెవెల్‌లో ఉంటాయని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు. పైగా ఆగస్ట్ 15 వరకు ఇండియాలో పెద్దగా రిలీజ్‌లు ఏమీ లేవు. దీంతో ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’కు మంచి టాక్ లభిస్తే.. ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించగలదని భావిస్తున్నారు. ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ తరహాలో ఇది కూడా హిట్ అవ్వచ్చని అంటున్నారు. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ ట్రైలర్స్ చూస్తుంటే ఇందులో యాక్షన్‌తో పాటు కామెడీ కంటెంట్ కూడా చాలానే ఉండనుందని అర్థమవుతోంది.
Also Read: ‘డెడ్‌పూల్ 3’ టీజర్: మార్వెల్‌కు మహారాజు తానేనట - ‘వోల్వరైన్’తో పెట్టుకున్నాడు, ఏమైపోతాడో!