News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఇన్ స్టా లో రష్మికను ఫాలో అవుతున్న శ్రద్ధా కపూర్ - ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసేందుకేనా?

ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో శ్రద్ధా కపూర్ రష్మికను పట్టించుకోకుండా వెళ్లిన వీడియో వైరల్ అవ్వగా.. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు రష్మికను ఇన్ స్టాలో ఫాలో అవ్వడం మొదలుపెట్టింది.

FOLLOW US: 
Share:

సినిమా ఇండ్రస్ట్రీ అన్నాక హీరోయిన్ల మధ్య ఈర్ష్య, అసూయలు సర్వసాధారణమే. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల విషయంలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అగ్ర హీరోయిన్లు ఒక్కోసారి జెలసీతో ఒకరినొకరు పట్టించుకోకుండా ఉండడం చూస్తూనే ఉంటాం. తాజాగా రష్మిక మందన విషయంలో ఇదే జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, రష్మిక మందన్న ఒకే కార్యక్రమంలో సందడి చేయగా, రష్మిక మందన శ్రద్ధా కపూర్ ని పలకరించినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ప్రముఖ బిలినియర్ ముఖేష్ అంబానీ ఇంట్లో తాజాగా జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు ఈ ఇద్దరు హీరోయిన్లు అటెండ్ అయ్యారు. శ్రద్ధా కపూర్ ఇంటి నుంచి బయటకు వస్తుండగా, రష్మిక లోపలికి వెళ్తోంది. ఆ సమయంలో మీడియా వాళ్ళు ఫోటోలకు రిక్వెస్ట్ చేయడంతో స్మైల్ ఇస్తూ కెమెరాలకు ఫోజులు ఇచ్చింది. ఇక వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న శ్రద్ధా కపూర్ ని చూసి రష్మిక పలకరించింది. కానీ శ్రద్ధ కపూర్ మాత్రం ఏం పట్టించుకోకుండా తలకిందికి వేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోవడంతో రష్మిక కాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఇద్దరు హీరోయిన్ల మధ్య ఏదో వైరం నడుస్తుందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైపోయింది.

ఈ డిస్కషన్ శ్రద్ధ కపూర్ దాకా వెళ్ళిందో ఏమో తెలియదు కానీ ఆ డామేజ్ ను కంట్రోల్ చేయడానికి శ్రద్ధా కపూర్ తాజాగా రష్మికను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. శ్రద్ధా కపూర్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో రష్మికను ఫాలో అవ్వడంతో పాటు ఓ ఫోటోకి 'వాటే బ్యూటీ' అంటూ కామెంట్ కూడా చేయడం విశేషం. గతంలో ఎప్పుడు రష్మిక పోస్టుల్లో కనిపించని శ్రద్ధా కపూర్.. ఇప్పుడు స్పెషల్ గా రష్మిక పై ఇలాంటి కామెంట్ చేయడంతో శ్రద్ధా కపూర్ ఆ డామేజ్ ని కంట్రోల్ చేయడానికి ఇలా కామెంట్ చేసిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. దీంతో శ్రద్ధా కపూర్ రష్మిక ఫోటో పై పెట్టిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

రష్మిక మందన బాలీవుడ్లో రణబీర్ కపూర్ తో కలిసి 'యానిమల్'(Animal) మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ నుంచి తన ఫోటోను ఇన్ స్టా లో షేర్ చేసింది రష్మిక. ఈ ఫోటో పైన శ్రద్ధ 'వాట్ ఏ బ్యూటీ' అంటూ కామెంట్ చేసింది. ఇక పుష్ప మూవీతో రష్మిక మందన కి బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో అక్కడ ఈ ముద్దుగుమ్మ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటించిన రష్మిక త్వరలోనే ,'యానిమల్' అనే మూవీ తో రాబోతోంది. టాలీవుడ్ డైరెక్టర్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 లోనూ నటిస్తుంది రష్మిక.

Also Read : చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 25 Sep 2023 06:57 PM (IST) Tags: Rashmika Shraddha Kapoor Acctress Rashmika Mandanna Shraddha Follows Rashmika Bollywood Acctress Shraddha

ఇవి కూడా చూడండి

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?

Renu Desai : అంకుల్ మీకు ఇంత వయసొచ్చింది, ఇదేనా మీ అనుభవం - సీనియర్ జర్నలిస్టుపై రేణు దేశాయ్ ఆగ్రహం

Renu Desai : అంకుల్ మీకు ఇంత వయసొచ్చింది, ఇదేనా మీ అనుభవం - సీనియర్ జర్నలిస్టుపై రేణు దేశాయ్ ఆగ్రహం

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?