అన్వేషించండి

Dacoit box office collection day 2: రెండవ రోజు పెరిగిన కలెక్షన్స్... బాక్సాఫీస్ వద్ద నిలకడగా ‘డెకాయిట్’ - ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Dacoit two days collections: రెండో రోజు బాక్సాఫీస్ బరిలో డెకాయిట్ నిలబడింది. బాక్స్ ఆఫీస్ బరిలో మంచి కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లో సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే? 

అడివి శేష్ అంటే ఆడియెన్స్‌లో మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంటుంది. క్షణం, గూఢచారి,ఎవరు, మేజర్ ఇలా వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టి ఉన్నాడు. అయితే గత మూడేళ్లుగా అడివి శేష్ ‘డెకాయిట్’ అంటూ ఊరిస్తూ వచ్చాడు. అయితే ఈ డెకాయిట్ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి మీడియా నుంచి పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ అయితే రాలేదు. దీంతో అడివి శేష్ సినిమాకి చాలా చోట్ల దెబ్బ పడిందని అర్థం అవుతోంది. మౌత్ టాక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ మిక్స్డ్ టాక్‌తోనూ బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ మంచి కలెక్షన్లనే రాబడుతోన్నట్టుగా అనిపిస్తోంది.

అడివి శేష్ ‘డెకాయిట్’ని హిందీలోనూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ మాత్రం డెకాయిట్ మినిమం స్థాయిలో కూడా ప్రభావం చూపించడం లేదు. అసలే అక్కడ ఇప్పుడు ‘ధురంధర్ 2’ హవా నడుస్తోంది. ఆ తుఫానులో ‘డెకాయిట్’ నిలబడదన్న సంగతి తెలిసిందే. హిందీ ఏరియాని వదిలేస్తే.. తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో డెకాయిట్‌కు మంచి కలెక్షన్లు వస్తున్నట్టుగానే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలో దాదాపు 5 కోట్ల నెట్ వచ్చినట్టుగా సమాచారం. ఇక వరల్డ్ వైడ్‌గా మొదటి రోజు 13 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇక రెండో రోజు కూడా ‘డెకాయిట్’ నిలకడగానే ఉంది. డిజాస్టర్ టాక్ వస్తే గనుక రెండో రోజే సినిమాలు తేలిపోతోన్నాయి. కానీ డెకాయిట్ విషయంలో మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా డే వన్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రెండో రోజు వచ్చాయి.

Also Read: Ustaad Bhagat Singh OTT: ఈ వారమే ఓటీటీలో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'... స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ తెల్సా?

రెండో రోజు డెకాయిట్‌ దాదాపు ఏడు కోట్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3, 734 షోలు పడ్డట్టుగా తెలుస్తోంది. అలా మొత్తంగా రెండు రోజుల్లో డెకాయిట్‌కి ఇండియాలో 13.55 కోట్ల నెట్ వచ్చినట్టు సమాచారం. ఇక ఓవర్సీస్‌లో రెండో రోజు దాదాపు 2.5 కోట్లు వచ్చాయట. అలా మొత్తంగా చూసుకుంటే ఓవర్సీస్‌‌లో రెండు రోజులకు కలుపేసుకుంటే 9 కోట్ల గ్రాస్ అవుతుంది. ఇక ఓవరాల్‌గా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి 24.81 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

'డెకాయిట్' కలెక్షన్స్ రిపోర్ట్..

  • తెలుగు డే 2 నెట్ కలెక్షన్స్ : 5.6 కోట్లు
  • హిందీ డే 2 నెట్ కలెక్షన్స్ : 1.4 కోట్లు
  • ఇండియాలో రెండో రోజు నెట్ కలెక్షన్: రూ. 7 కోట్లు
  • ఇండియాలో రెండు రోజుల గ్రాస్ కలెక్షన్: రూ. 15.81 కోట్లు
  • ఓవర్సీస్ డే 2 గ్రాస్ కలెక్షన్: రూ. 2.5 కోట్లు
  • ఓవర్సీస్ రెండు రోజుల గ్రాస్ కలెక్షన్: రూ. 9 కోట్లు
  • వరల్డ్ వైడ్ టూ డేస్ గ్రాస్ కలెక్షన్: రూ. 24.81 కోట్లు

Also ReadLIK First Day Collection: ఫస్ట్ డే ఫ్లాప్ టాక్... మరి కలెక్షన్స్? ప్రదీప్ రంగనాథన్ 'లైక్' ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన 'డెకాయిట్'కు షానియల్ డియో దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు మొదటి చిత్రమిది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ చిత్రానికి భీమ్స్ సాంగ్స్ అందించగా... గ్యాని ఆర్ఆర్ చేశారు. ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్, జాన్ కొకెన్, కామాక్షి భాస్కర్ల తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు.

Also ReadDacoit First Day Collection: డెకాయిట్ ఫస్ట్ డే కలెక్షన్స్... బాక్సాఫీస్‌లో అదరగొట్టిన అడివి శేష్, ఎన్ని కోట్లు వచ్చాయంటే?

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget