అన్వేషించండి

Daaku Mahaaraj Box Office Day 2 : డాకు మహారాజ్ డే 2 కలెక్షన్స్.. థియేటర్లలో మాస్​ వైబ్​ని కొనసాగిస్తోన్న బాలయ్య

Daaku Mahaaraj Day 2 Collection : సంక్రాంతికి డాకు మహారాజ్​తో మాస్​ హిట్​ని అందుకున్నాడు బాలయ్య. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్​ని అందుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టింది.

Daaku Mahaaraj Box Office Collection Day 2 : డాకు మహారాజ్​గా వచ్చి.. సంక్రాంతి 2025కి తన సత్తా చూపాడు బాలయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న విడుదలై హిట్​ టాక్​ని అందుకుంది. సంక్రాంతి రేస్​లో వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్​ని అందుకుని ఫ్యాన్స్​ని ఆకట్టుకుంది. స్టోరి రొటీన్​ అయినా.. దానికి ప్రేక్షకులకు కావాల్సినవిధంగా కమర్షియల్ ఎలిమినెంట్స్​ను జోడించి ఫెస్టివల్ ఫీస్ట్​గా విడుదల చేసింది చిత్రబృందం.

బాలయ్య వైల్డ్ యాక్షన్ చూసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. ఫస్ట్​ డే మంచి కలెక్షన్స్ అందుకున్న ఈ చిత్రం.. రెండో రోజు కూడా తన సత్తా చాటింది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 56 కోట్లు కలెక్ట్ చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో 22.31 కోట్లు కొల్లగొట్టింది. మరి రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే.. 

రెండో రోజు కలెక్షన్స్ ఇవే 

తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ రెండో రోజు కూడా ఊహించని వసూళ్లు సాధించింది. నిజాంలో 2.44 కోట్లు, సీడెడ్​లో 1.72 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.26 కోట్లు, గుంటూరులో 0.74 కోట్లు, కృష్ణలో 0.72 కోట్లు, తూర్పు గోదావరిలో 0.79 కోట్లు, పశ్చిమ గోదావరి 0.46 కోట్లు, నెల్లూరు 0.38 కోట్లు వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా రెండో రోజు డాకు మహారాజు తెలుగు రాష్ట్రాల్లో 8.51 కోట్లు వసూలు చేశాడు బాలయ్య. 

డాకు మహారాజ్​ సినిమాను యాక్షన్​ డ్రామాగా రూపొందించి.. దానికి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు డైరక్టర్. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్​లు హీరోయిన్లుగా చేశారు. బాబీ డియోల్ విలన్​ పాత్రలో కనిపించగా.. ఊర్వశి రౌతేలా స్పెషల్ పాత్ర చేసింది. ఓ సాంగ్​లో కూడా ఆమె నటించి మెప్పించింది. తమన్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్​గా నిలిచింది. బాలయ్య, తమన్ కాంబినేషన్​లో వచ్చిన సినిమాలు మ్యూజికల్​గా కూడా హిట్​ టాక్​ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కూడా వీరు అదే జోరును కొనసాగించారు. 

సంక్రాంతి స్పెషల్ సినిమాలు

టాలీవుడ్​లో సంక్రాంతి స్పెషల్​గా వచ్చిన మూడు ప్రధాన సినిమాలు కూడా బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్​ని సంపాదించుకున్నాయి. ముందుగా వచ్చిన గేమ్ ఛేంజర్​ మిక్డ్స్​ టాక్​ని తెచ్చుకుంది. అయినా సరే మంచి కలెక్షన్స్​ని రాబడుతూ.. ప్రేక్షకులను ఎంటర్​టైన్ చేస్తుంది. అలాగే డాకు మహారాజ్​ కూడా పాజిటివ్​ టాక్​తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్​ను టార్గెట్ చేస్తూ వచ్చిన సంక్రాంతికి వస్తున్నాము సినిమాతో వెంకీ మామ కూడా మంచి హిట్​ టాక్​ని సొంతం చేసుకున్నాడు. టీఎఫ్​ఐ కట్టుబానిసలకు ఈ సంక్రాంతి మంచి సినిమాలనే అందించిందంటూ టాక్​ నడుస్తుంది. 

Also Read : 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Embed widget