Nandamuri Balakrishna: ఘనంగా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల కర్టన్ రైజర్ కార్యక్రమం - పోస్టర్ లాంచ్ చేసిన నందమూరి సోదరులు
Balakrishna Golden Jubliee: నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. త్వరలో బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
నందమూరి 'నటసింహం' బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు కావోస్తోంది. తన తండ్రి నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్, బ్లాక్‌బస్టర్స్ అందించారు. ఇక కెరీర్ పరంగా ఎన్నో మైలురాళ్లు చేరుకున్నఓ. ఈ నందమూరి హీరో ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతోన్నారు. ఆగష్టు 30వ తేదీతో ఆయన నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు కావోస్తోంది. ఈ సందర్బంగా సెప్టెంబర్ 1వ తేదిన బాలయ్య స్వర్ణోత్సవ వేడుకులకు తెలుగు చిత్ర పరిశ్రమ భారీగా ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ బుధవారం ఎఫ్‌ఎన్‌సీసీలో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా సెప్టెంబర్ 1న జరగబోయే వేడుకలు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బాలయ్య సోదరులు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ హాజరై స్వర్ణోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను లాంచ్ చేశారు.ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ.. "మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా నిరూపించుకున్నారు. మా నాన్న గారి నట వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో నిలబడ్డారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లోనూ నాన్నగారి వారసుడిగా బాలకృష్ణ రాణిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందూపురం అడ్డా నందమూరి గడ్డ అని నిరూపించారు" అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. "నేను రామారావుగారి అభిమానిని. నేను అభిమానించిన రామారావుగారికి సినిమా రాయడం అనేది నాకు దొరికిన అదృష్టం. 1981లో నేను ఛండశాసనుడు సినిమాకు కథ రాశాను. ఆ టైమ్‌లోనే ఒక అందమైన కుర్రాడు వచ్చాడు. అతనే బాలకృష్ణ. ఒక్కొక్క హీరోకు ఒక్కో బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అలా బాలయ్యకు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంది. తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది. మేము రాసిన ప్రతి సినిమా బాలయ్యకు సక్సెస్ ఇచ్చింది ఇప్పుడు ఆయన 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. 50 ఏళ్ల వయసు వచ్చిందేమో అనుకున్నా. అన్ని అసోసియేషన్స్ కలుపుకుని బాలయ్య 50 ఏళ్ల వేడకను ప్రపంచానికి తెలిసేలా చేయాలని కోరుతున్నా" అని అన్నారు.
ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణగారి కార్యక్రమంలో అన్ని అసోసియేషన్స్ వాళ్లు పాల్గొనడం సంతోషంగా ఉందని, మా అసోసియేషన్ కూడా పాల్గొనడం తమ అదృష్టమని పేర్కొన్నారు. అనంతరం బాలయ్యకు అఖండతో ఎన్నో భారీ విజయాలు వచ్చేలా చేసిన డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "50 నిమిషాల పాటు వాక్ చేస్తేనే మనం అలసిపోతాం. అలాంటిది ఆయన 50 ఏళ్లు సినిమాలు చేసుకుంటూ వచ్చారంటే ఇది చిన్న విషయం కాదు.
అలాంటి ఆయన కష్టాన్ని గుర్తించి సినిమా పెద్దలందరూ ఒక వేదిక మీదకు వచ్చి ఆయనకు సన్మానం చేయడం చాలా అభినందనీయమైన విషయం. ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. చేసిన పాత్ర చేయకుండా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు 109 సినిమాలు పూర్తి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఎప్పుడూ ఇలా ఎనర్జిటిక్‌గా ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సెప్టెంబర్ 1న ఘనంగా బాలకృష్ణ గారి నట జీవితానికి నిర్వహించే 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నా" అని అన్నారు.
Also Read: రియల్ ఎస్టేట్ చీటింగ్‌పై స్పందించిన యాంకర్ సుమ - అసలు జరిగింది ఇదంటూ వివరణ