అన్వేషించండి

Christopher Nolan: టైమ్‌తో ఆటాడుకుంటాడు... సైన్స్ ఫిక్షన్‌తో అదరగొడతాడు... నోలన్ మామకు అంత క్రేజ్ ఎందుకంటే?

క్రిస్టోఫర్ నోలన్ ప్రేక్షకులకు అర్థం కాని సినిమాలు తీస్తారని కొందరు చెబుతున్నా... మెజారిటీ ఆడియన్స్ ఆయన సినిమాలను చూసేందుకు క్యూ కడతారెందుకు? ఆయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మీద స్పెషల్ స్టోరీ

జనరల్ గా ఆడియన్స్ సినిమాకు వెళ్లేద్ది ఓ ఎక్స్ పీరియన్స్ కోసం. మన నిజ జీవితంలో జరిగే విషయాలను కాసేపు పక్కనపెట్టి డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడనే కథా ప్రపంచంలోకి వెళ్లి ఆ రీల్ లైఫ్ నే రియల్ లైఫ్ గా ఎక్స్ పీరియన్స్ చేసి వస్తాం. డైరెక్టర్ ఎంత ఎఫెక్టివ్ గా చెబుతున్నాడు? నటీనటుల యాక్టింగ్ స్కిల్స్, టెక్నీషియన్స్ ప్రతిభ అన్నీ కలిసి ప్రేక్షకుడికి ఓ మరిచిపోలేని అనుభూతిని కల్పించటం సినిమాల పని. అయితే అలాంటి అనభూతిని తన ప్రతీ సినిమాకు అందించటంలో మాస్టర్ డైరెక్టర్ ఎవరైనా ఈ తరంలో హాలీవుడ్ లో ఉన్నారా? అంటే తప్పనిసరిగా వినిపించే పేరు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan).

Why Christopher Nolan Movies Gives Unforgettable Experiences?: 1998లో డైరెక్టర్ గా సినిమాలు తీయటం మొదలుపెట్టిన నోలన్ 27 సంవత్సరాల తన కెరీర్ లో ఇప్పటి వరకూ కేవలం 12 సినిమాలు మాత్రమే తీశారు. అయితేనేం ఒక్కో సినిమాకు ఒక్కో తరహా కథను తీసుకుంటూ... తీసుకున్న కథలను ఇప్పటి వరకూ మరే డైరెక్టరూ చెప్పని విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు క్రిస్టోఫర్ నోలన్. 1970లో లండన్ లో పుట్టిన నోలన్... యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్న తర్వాత పూర్తిగా తన దృష్టిని సినిమాల వైపే పెట్టారు. మొదట చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ... తన మొదటి సినిమా 'ఫాలోయింగ్'కు కథ రాసుకున్నారు. ఆ క్రైమ్ థ్రిల్లర్ కు తనే రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ కూడా. తన ఫస్ట్ సినిమాతోనే తను అందరి లాంటి దర్శకుడిని కాదని... కథను చెప్పటంలో తనదో డిఫరెంట్ స్టైల్ అని ప్రూవ్ చేసుకున్నాడు నోలన్. 2000లో వచ్చిన తన రెండో సినిమా 'మెమెంటో'తో క్రిస్టోఫర్ నోలన్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది. నోలన్ 'మెమొంటో' సినిమా పాయింట్ ను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఫిల్మ్ మేకర్స్ వాడుకున్నారు. తెలుగు, తమిళంలో వచ్చిన 'గజినీ' సినిమాకు మూలం క్రిస్టోఫర్ నోలన్ 'మెమొంటో' సినిమానే. 'ఇన్ సోమ్నియా, ప్రెస్టీజ్, బ్యాట్ మన్ ట్రయాలజీ, ఇన్ సెప్షన్, ఇంటర్ స్టెల్లార్, డన్ కిర్క్, టెనెట్', మొన్న వచ్చి 'ఓపెన్ హైమర్' వరకూ ఒక్కో రకమైన కథను ఒక్కో రకమైన జోన్రాలో తీసుకుని తనదైన స్టైల్ లో స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తారు క్రిస్టోఫర్ నోలన్. ఆయన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ను అర్థం చేసుకోవాలంటే దాన్ని మూడు రకాలుగా విభజించొచ్చు..

నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్!
జనరల్ గా ఓ సినిమా కథను ఎవరైనా ప్రారంభం నుంచి ముగింపు వరకూ రాసుకుంటారు. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి చిన్నతనం నుంచి మొదలుపెట్టి అతను ముసలోడు అయ్యేవరకూ జీవితంలో ఏం సాధించాడో ఓ సినిమాగా తీద్దాం అనుకుంటే కథను కూడా అదే ఆర్డర్ లో చెప్పే పాత స్టోరీ టెల్లింగ్ స్టైల్ కు ఎండ్ కార్డ్ వేశారు నోలన్. ఇప్పుడు అదే కథను నోలన్ ఎలా చెబుతాడంటే ముందు ఓ ముసలోడి కథను చూపిస్తాడు. తన గురించి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఏదో కథను చెబుతూ ఉంటాడు. మధ్యలో ఓ పిల్లాడి స్టోరీ వస్తుంది సినిమాలో. మధ్యలో మరెక్కడో ఓ మిడిల్ ఏజ్ వాడి కథ చెబుతాడు. సినిమా చివరకు వచ్చేసరికి ఈ మూడు కథలు ఒకరివేనని మనకు అర్థం అవుతుండటంతో... ఆడియెన్స్ ను ఓ రకమైన థ్రిల్ ఫీల్ అవుతారు. కథ మొదట్లోనే అర్థం కాకుండా ఉండటం కోసం వేర్వేరు టైమ్ లైన్స్ లో జంపింగ్స్ కొట్టిస్తూ ఉంటారు. కథను అర్థం చేసుకుని ఫాలో అయ్యేవాళ్లకు ఆ నెరేషన్ స్టైల్ ఎక్కడలేని మజాను ఇస్తుంది. దీన్నే సినీ పరిభాషలో నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ అంటారు. ఉదాహరణకు మన తెలుగులో 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం చూసే ఆ మూడు కథలు ఒక్కరేవేనని డైరెక్టర్ వెంకటేష్ మహా చివర్లో రివీల్ చేసినప్పుడు ఎలా థ్రిల్ కి గురయ్యామో అలాంటి థ్రిల్స్ ను తన సినిమాల ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అని చెప్పుకోవచ్చు.

కాలంతో ఆడుకోవటం ఇష్టం!
నోలన్ కి కాలంతో ఆడుకోవటం అంటే చాలా ఇష్టం. ఉదాహరణకు Memento సినిమాను రివర్స్ లో చెప్పుకుంటూ వచ్చిన నోలన్… Dunkirk అనే సినిమాను ఒక్క రోజులో జరిగిన కథ, ఒక వారంలో జరిగిన కథ, ఓ గంటలో జరిగిన కథ అని మూడు భాగాలు చేసుకుని సినిమాగా తీశారు. Interstellar సినిమా relativity of time ఆధారంగా తీస్తే... Tenet సినిమా ఇంకా పీక్స్... ఏక కాలంలో కాలంలో ముందుకు వెనక్కూ రెండు ప్రపంచాలు కదులుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సినిమా చూసే ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూనే కాస్త మెదడుకు పదును పెట్టే పని కూడా చేస్తాయి. టైమ్ తో ఆడుకోవటం అంటే తనకున్న ఇష్టాన్ని తన సినిమా కథలపై చూపిస్తూ చూసే ప్రేక్షకుడు అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ ఉండాలి అని ఫీలయ్యేలా చేయటం నోలన్ సిగ్నేచర్ ట్రేడ్ మార్క్. వన్స్ నోలన్ చెప్పాలనుకుంటున్న పాయింట్ అర్థమైనా...ఆ ప్లాట్ ను పట్టుకున్నా ఆ సినిమా ప్రేక్షకుడికి ఎవర్ లాస్టింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వటం మాత్రం ఖాయం.

సైన్స్ ఫిక్షన్... బలమైన ఎమోషన్స్‌! 
టైమ్ తో ఎంత జిమ్మిక్కులు చేస్తున్నా... నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ తో బుర్రను హీటెక్కిస్తున్నా... నోలన్ సినిమాలు మాస్టర్ పీస్ లుగా మిగలటానికి కారణం ఆయన సినిమాల్లో లోతైన థీమ్స్ ఇంకా సైన్స్ ఫిక్షన్ అని చెబుతాను. మనిషి ఓ భావోద్వేగానికి లోనైనప్పుడు కదిలిపోతాడు. తన కథలతో ఆ ఎమోషన్ ని పోక్ చేస్తాడు నోలన్. ఆ థ్రెడ్ ఉంటే చాలు ఇక నోలన్ ఆ సినిమాలో ఎటు తిప్పి ఏం చూపించినా చూస్తాం. హాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా నోలన్ నిలబడటానికి కారణం తన సినిమా కథల్లో బలమైన ఎమోషన్స్ ఉంటాయి. డార్క్ నైట్ సినిమా ప్రపంచంలో ఉన్న ఖేయాస్ ని ఆర్డర్ ను డీప్ లెవల్లో క్వశ్చన్ చేస్తుంది కాబట్టే ఇప్పటికి మనందరికీ జోకర్ పాత్ర చనిపోయినా కూడా హీత్ లెడ్జర్ గుర్తుండిపోయారు. ప్రెస్టీజ్ సినిమా మనిషిలోని Obsession ని టార్గెట్ చేస్తుంది. ఇంక తన కెరీర్ లోనే కాంప్లెక్స్ సినిమా అని ఫ్యాన్స్ చెప్పుకునే ఇంటర్ స్టెల్లార్ లో బ్లాక్ హోల్స్ ని, మైండ్ బెండింగ్ ఫోర్త్ డైమన్షన్ గా టైమ్ ని చూపించిన సినిమాలోనే అంత కంటే బలంగా తండ్రీ కూతుళ్ల బంధాన్ని చూపించాడు కాబట్టే ఇంటర్ స్టెల్లార్ మాస్టర్ పీస్ అయ్యి కూర్చుంది. ఎంత పెద్ద సినిమా తీసినా ఈ ఎమోషన్ ని మిస్ కాడు కాబట్టే అవంత పెద్ద సినిమాలుగా మిగిలిపోయాయి.

Also Read: ఓ చిల్లర గ్యాంగ్‌ దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగింది. ఓజీలోని యకూజా గ్యాంగ్స్… చరిత్ర తెలిస్తే వణికిపోతారు?

నోలన్ సినిమాల్లో సైన్స్ అనే ఎలిమెంట్ ను కూడా బలమైన టూల్ గా వాడుకుంటాడు. ప్రత్యేకించి సైన్స్ ఫిక్షన్ అనే ఫాసినేటింగ్ సబ్జెక్ట్ ని అంత కంటే ఫాసినేటింగ్ గా తెరపై చూపిస్తాడు నోలన్. బ్లాక్ హోల్ ఉంటుందో మన సైంటిస్టులకు కూడా పూర్తిగా తెలియదు. కానీ అందుబాటులో ఉన్న టెక్నాలజీ ని యూజ్ చేసి ఇంటర్ స్టెల్లార్ సినిమాలో బ్లాక్ హోల్ వెండితెరపై చూపించారు నోలన్. 'ఇన్ సెప్షన్' సినిమా అయితే మన మైండ్ దాని తాలుకూ సబ్ కాన్షియస్ కి ఓ పెద్ద అద్దం లాంటి సినిమా. టెనెట్ సినిమాలో టైమ్ ఇన్వర్షన్, ఎన్ ట్రోపీ లాంటి కాన్సెప్ట్ లతో  చెడుగుడు ఆడుకుంటుంది. రీసెంట్ ఓపెన్ హైమర్ సినిమా మనిషి మానసిక స్థితి..సంఘర్షణలకు ప్రతీక. ఇలా అటు ఎమోషన్ ను ఇటు సైన్స్ ఫిక్షన్ ను అద్భుతంగా బ్లెండ్ చేస్తూ నోలన్ తీసిన 12 సినిమాలు 12 వజ్రాలు అని చెప్పుకోవాలి. అవార్డులను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోని నోలన్... తన సినిమాలకు మాత్రం 18సార్లు ఆస్కార్ అవార్డులను దక్కించుకున్నారు. డైరెక్టర్ గా మాత్రం తను తీసిన రీసెంట్ సినిమా ఓపెన్ హైమర్ తో బెస్ట్ డైరెక్టర్ గా తొలిసారి ఆస్కార్ ను అందుకున్నారు. ఇప్పుడు ఒడిస్సీ అని గ్రీక్ హిస్టరీ నుంచి ఓ సినిమా చేస్తున్న నోలన్...తన సినిమాలతో మాత్రం ప్రేక్షకుడి స్థాయిని పెంచుతూ వరల్డ్ సినిమాపై తనదైన సిగ్నేచర్ ను పెట్టేశాడు.

Top 5 Must Watch Christopher Nolan Movies: నోలన్ సినిమాలు ఇప్పటివరకూ మీరు చూడకపోతే కచ్చితంగా చూడాల్సిన ఐదు సినిమాలు మాత్రం... 1. ఇన్ సెప్షన్, 2. ఇంటర్ స్టెల్లార్, 3. ప్రెస్టీజ్, 4. డార్క్ నైట్, 5. డన్ కర్క్.

Also Read: ఎన్టీఆర్‌తో సినిమా తీసిన తాతయ్య... 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనవడు... 'లిటిల్ హార్ట్స్' దర్శకుడి బ్యాగ్రౌండ్ తెల్సా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Police website hacked :  తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
IndiGo Flights canceled: ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు-  వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు- వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
Tamil Film Producer AVM Saravanan: తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
Sasirekha Song: మీసాల పిల్ల తర్వాత శశిరేఖ... చిరు - నయన్ కొత్త సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
మీసాల పిల్ల తర్వాత శశిరేఖ... చిరు - నయన్ కొత్త సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police website hacked :  తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
IndiGo Flights canceled: ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు-  వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు- వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
Tamil Film Producer AVM Saravanan: తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
Sasirekha Song: మీసాల పిల్ల తర్వాత శశిరేఖ... చిరు - నయన్ కొత్త సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
మీసాల పిల్ల తర్వాత శశిరేఖ... చిరు - నయన్ కొత్త సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
Akhanda 2 Twitter Review: 'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?
'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?
Year Ender 2025: 2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!
2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!
November 2025 Car Sales: గత నెలలో జనం ఎక్కువగా కొన్న కార్లు - మారుతి ఫస్ట్‌, రెండు-మూడు స్థానాల్లో మహీంద్రా-టాటా
ఇండియాలో హాటెస్ట్ కార్లు ఇవే, నవంబర్‌లో జనం ఎగబడి కొన్న టాప్‌-10 కార్ల లిస్ట్‌
Virat Kohli : విరాట్ కోహ్లీ సెంచరీతో 3 రికార్డులు బ్రేక్‌! ఈ విషయంలో మొదటి భారతీయుడిగా కొత్త చరిత్ర!
విరాట్ కోహ్లీ సెంచరీతో 3 రికార్డులు బ్రేక్‌! ఈ విషయంలో మొదటి భారతీయుడిగా కొత్త చరిత్ర!
Embed widget