Thor Love and Thunder Movie: ఇండియాలో ఒక్క రోజు ముందుగా 'థార్' - డే అండ్ నైట్ 96 గంటల పాటు...
అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికా కంటే ఒక్క రోజు ముందుగా 'థార్: లవ్ అండ్ థండర్'ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇంకో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే...
ఇండియాలోని మార్వెల్ అభిమానులకు ఒక శుభవార్త. అమెరికాలో కంటే ఒక్క రోజు ముందు ఇండియాలో తమ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఆ సినిమా 'థార్: లవ్ అండ్ థండర్'. అసలు వివరాల్లోకి వెళితే...
ఆస్కార్ పురస్కార గ్రహీత, న్యూజీలాండ్ ఫిల్మ్ మేకర్ తైకా వెయిటిటి 'థార్: లవ్ అండ్ థండర్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో 'అవెంజర్' సిరీస్‌లో థార్ పాత్రలో అందరినీ మెప్పించిన క్రిస్ హేమ్స్‌వర్త్, టెస్సా థాంప్సన్, నటాలీ పోర్ట్‌మన్, క్రిస్టియన్ బేల్ తదితరులు నటించారు.
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
అమెరికాలో 'థార్: లవ్ అండ్ థండర్' జూలై 8న విడుదల అవుతోంది. అయితే... జూలై 7న ఇండియాలో విడుదల చేస్తున్నారు. అంతే కాదు... ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో జూలై 7 నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా 96 గంటల పాటు డే అండ్ నైట్ షోలు వేయనున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.
Also Read : మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ
View this post on Instagram
View this post on Instagram