Thangalaan : చియాన్ విక్రమ్ బర్త్ డే స్పెషల్ - 'తంగలాన్' నుంచి మేకింగ్ వీడియో, విక్రమ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా 'తంగలాన్' మూవీ టీం సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తూ విక్రమ్ కి బర్త్డే విషెస్ అందజేశారు.
Vikram's Thangalaan Making Video : సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు చియాన్ విక్రమ్. పాత్ర కోసం మేకవర్ అవ్వాలంటే విక్రమ్ తర్వాతే ఎవరైనా. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలను చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. విక్రమ్ ఓ పాత్రను ఎంచుకున్నాడు అంటే కచ్చితంగా ఆ పాత్రకి జీవం పోస్తాడు. 'శివపుత్రుడు', 'అపరిచితుడు', 'ఐ' వంటి సినిమాల్లో ప్రయోగాత్మక పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఇక ఇప్పుడు మరోసారి 'తంగలాన్' అనే సినిమాలో ఓ విభిన్న తరహా పాత్రతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఏప్రిల్ 17 విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం అతనికి బర్త్ డే విషెస్ అందజేస్తూ ఓ సర్ప్రైజింగ్ వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
విక్రమ్ బర్త్ డే ట్రీట్.. 'తంగలాన్' నుంచి మేకింగ్ వీడియో
ఏప్రిల్ 17 విక్రమ్ బర్త్ డే సందర్భంగా 'తంగలాన్' మూవీ టీం తమ హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తూ సినిమా నుంచి విక్రమ్ మేకోవర్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తూ.." తాను ఒక ఐకానిక్ టాలెంట్ తన గ్లోరితో అందరినీ ఇన్స్పైర్ చేస్తూ తన నటనతో అంచనాలను మించేలా చేసే చియాన్ విక్రమ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. బిగ్ స్క్రీన్ పై తంగలాన్ యొక్క ఆవేశపూరిత ఉనికి కోసం వేచి ఉండండి" అంటూ పేర్కొన్నారు. కాగా ఈ వీడియోలో విక్రమ్ సినిమాలో తన పాత్ర కోసం ఎంతలా కష్టపడ్డారో చూపించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
An iconic talent, inspiring awe with grit and glory, delivering performances that defy expectations ❤️
— Studio Green (@StudioGreen2) April 17, 2024
Happy Birthday @chiyaan #Thangalaan 🏹 Awaiting your fiery presence on big screens! #HBDChiyaan @Thangalaan @beemji @GnanavelrajaKe #StudioGreen #JyotiDeshpande @jiostudios… pic.twitter.com/gflnUS1woV
భారీగా బరువు తగ్గిన విక్రమ్
'తంగలాన్' సినిమా కోసం విక్రమ్ భారీగా బరువు తగ్గారు. ఈ విషయాన్ని సినిమా నిర్మాత జ్ఞానవేల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. సినిమాలో విక్రమ్ తన పాత్ర కోసం ఏకంగా 35 కేజీల బరువు తగ్గినట్లు చెప్పారు. బరువు తగ్గించుకునేందుకు విక్రమ్ రాత్రి, పగలు అని తేడా లేకుండా కష్టపడ్డారని, అందరూ ఆర్టిస్టులా కాకుండా ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకుని చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తారని అన్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో ఓ సరికొత్త విక్రమ్ ను చూస్తారంటూ తెలిపారు.
రిలీజ్ అప్పుడేనా?
కబాలి మూవీ ఫేమ్ పా. రంజిత్ డైరెక్ట్ చేస్తున్న 'తంగలాన్' మూవీని మొదట రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయాలని అనుకుకొని రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ పలు అనివార్య కారణాల వల్ల సినిమాని సమ్మర్ కి అంటే ఏప్రిల్ నెలలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక తాజా సమాచారం ప్రకారం సమ్మర్ కి కూడా 'తంగలాన్' రిలీజ్ అయ్యే అవకాశం లేదట. ఇదే విషయాన్ని నిర్మాత కన్ఫామ్ చేస్తూ ఎలక్షన్స్ తర్వాతే 'తంగలాన్' సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే మూవీ టీం కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనుంది.
Also Read : శ్రీవిష్ణు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ - హిట్ కాంబినేషన్‌లో సినిమా అప్డేట్ ఏమిటంటే?