Chiranjeevi New Movie : వంద కోట్ల సినిమా తీసిన మలయాళీకి చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్?
Jude Joseph Antony to direct Chiranjeevi : మలయాళీ దర్శకుడితో సినిమా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పారా? కొత్త కథ ఓకే చేశారా?
మలయాళీ దర్శకుడితో సినిమా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? త్వరలో ఆయన నుంచి కొత్త కబురు వినొచ్చా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినబడుతోంది. కథ, కథా నేపథ్యం కూడా ఖరారు అయ్యిందని... దర్శకుడితో 'మెగా' చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది.
'2018' దర్శకుడితో చిరంజీవి సినిమా!
మలయాళ ప్రజలను మాత్రమే కాదు... ఇతర రాష్ట్రాల్లో పేక్షకుల హృదయాలను సైతం కదిలించిన తాజా మలయాళీ సినిమా '2018'. కేరళను కుదిపేసిన వరదల నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సుమారు 20 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తీసిన ఆ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ చిత్రానికి జూడ్ జోసెఫ్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. అతనికి చిరంజీవి అవకాశం ఇచ్చారనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ ఖబర్.
చిరంజీవిని కలిసి జూడ్ జోసెఫ్ ఆంటోనీ ఓ కథ చెప్పారని, దానికి 'మెగా'స్టార్ ఆమోద ముద్ర లభించిందని సమాచారం. నిజం చెప్పాలంటే... దర్శకుడిగా జూడ్ అనుభవం కేవలం నాలుగు సినిమాలు మాత్రమే! ఆ నాలుగు పదేళ్లలో తీశారు. మిగతా మూడు కంటే '2018' సినిమా ఆయన్ను ఇతర భాషల ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. '2018' సినిమాను తెలుగులో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థలో కీలకమైన వ్యక్తి, నిర్మాత 'బన్నీ' వాసు విడుదల చేశారు. బహుశా... అటు నుంచి చిరు దగ్గరకు జూడ్ వెళ్లారేమో!?
విశాఖ నేపథ్యంలో చిరు, జూడ్ సినిమా!?
చిరంజీవి, జూడ్ ఆంటోనీ జోసెఫ్ కలయికలో సినిమాను ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించనుందట. నిఖిల్ సిద్దార్థ తాజా సినిమా 'స్పై' నిర్మించినది ఈ సంస్థే. విశాఖ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని గుసగుస. దాంతో హుద్ హుద్ బేస్ చేసుకుని సినిమా ఏమైనా చేస్తున్నారా? అని ప్రేక్షకులు ఎవరికీ తోచిన విధంగా వారు కథలు అల్లేస్తున్నారు.
Also Read : రామ్ చరణ్ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే
'భోళా శంకర్' తర్వాత చిరు సినిమా ఏమిటి?ఇప్పుడు చిరంజీవి 'భోళా శంకర్' సినిమా చేస్తున్నారు. దాని తర్వాత ఎవరితో సినిమా చేస్తారు? దానికి దర్శకుడు ఎవరు? అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మొన్నటి వరకు లిస్టులో పూరి జగన్నాథ్ పేరు వినిపించింది. అయితే... రామ్ పోతినేని హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' స్టార్ట్ చేయడానికి పూరి రెడీ అవుతున్నారు. అందువల్ల, ఆయనతో సినిమా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
వీవీ వినాయక్ దర్శకత్వంలో చిరు?
చిరంజీవి, వీవీ వినాయక్ కాంబినేషన్ కూడా మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగు సినిమా దర్శకుల్లోని మెగా అభిమానుల్లో వీవీ వినాయక్ (VV Vinayak) ఒకరు. చిరు హీరోగా 'ఠాగూర్', 'ఖైదీ నంబర్ 150' చేశారాయన. అయితే... ఆ రెండూ రీమేకులే. ఈసారి స్ట్రెయిట్ కథతో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నారని టాక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు హిట్ సినిమా 'ఛత్రపతి'ని హిందీలో ఆ పేరుతో రీమేక్ చేశారు. ఇటీవల విడుదలైన ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. మినిమమ్ షేర్ రాబట్టడంలో ఫెయిల్ అయ్యింది. అయినా సరే వినాయక్ ప్రతిభ మీద చిరు నమ్మకం ఉంచారని తెలిసింది.
Also Read : పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఛాన్స్ కొట్టేసిన 'ఏజెంట్' బ్యూటీ!