Delhi Capitals Performance In IPL 2025 | అనూహ్యంగా తడబడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ | ABP Desam
ఐపీఎల్ 2025 సీజన్ ను ఘనంగా ప్రారంభించిన జట్టు ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ క్యాపిటల్సే. మిగిలిన జట్లన్నీ ఒక్క మ్యాచ్ అయినా ఓడిన టైమ్ లో కూడా ఒక్క ఓటమి కూడా లేకుండా నిలబడింది ఢిల్లీ క్యాపిటల్స్. ఫస్టాఫ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న డీసీ సెకండాఫ్ లో కంప్లీట్ బోరింగ్ గా తయారైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫస్టాఫ్ లో 6 మ్యాచ్ లు ఆడితే అందులో 5 మ్యాచుల్లో విజయాలు సాధించింది. ముంబై మీద 12పరుగుల తేడాతో ఓడిపోవటం తప్ప ఫెయిలైన సందర్భాలు లేవు. రాజస్థాన్ మీద అయితే లాస్ట్ ఓవర్ లో 9 పరుగులు కొట్టనివ్వకుండా అడ్డుకుని సూపర్ ఓవర్ ఆడి మరీ గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. అంతలా ఐపీఎల్ 2025 సీజన్ లో కంప్లీట్ గా డామినేషన్ చూపించింది. అలాంటిది సెకండాఫ్ కి వచ్చే సరికి జరిగిన ఐదు మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించిన ఢిల్లీ..నిన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫలితం తేలకపోగా...మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఫస్టాఫ్ లో కరుణ్ నాయర్, డుప్లెసి, పోరల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ బ్యాటింగ్ లో స్టార్క్, కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ బౌలింగ్ లో అందరూ కలిసి కట్టుగా రాణించారు. JFM సరిగ్గా ఆడకపోతుండటంతో అతన్ని తప్పించారు. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి వాళ్ల ప్రధాన బలమైన కేఎల్ రాహుల్ స్థాయికి తగిన ప్రదర్శన చేయటం లేదు. లీగ్ స్టేజ్ ముగించటానికి, ప్లే ఆఫ్స్ కి వెళ్లటానికి ఇంకా మూడు మ్యాచుల ఛాన్స్ ఉంది కాబట్టి...రాహుల్ సహా ప్లేయర్లు ఫామ్ లోకి రావాలని టీమ్ మేనేజ్మెంట్ కచ్చితంగా కోరుకుంటుంది. మొత్తం 11 మ్యాచుల్లో 13 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో 5వస్థానంలో ఉన్న ఢిల్లీ..ప్లే ఆఫ్స్ కి వెళ్లటానికి మిగిలి ఉన్న 3 మ్యాచుల్లో 2 గెలిస్తే దర్జాగా వెళ్లిపోవచ్చు. చూడాలి మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఏం చేస్తుందో.





















