Indian Army Ready to Strike | సరిహద్దుల్లో పాక్ ఓవరాక్షన్ - పవర్ ఫుల్ వీడియో పెట్టిన ఇండియన్ ఆర్మీ | ABP Desam
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యం 9 వేర్వేరు చోట్ల వైమానిక దాడులు చేసింది. ఉగ్రశిబిరాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడులతో ఉగ్రవాద సంస్థలతో పాటు పాకిస్థాన్ బిత్తరపోయింది. పాక్ స్పాన్సర్స్డ్ టెర్రరిస్ట్ సంస్థల నుంచి వచ్చే ఒత్తిడితో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మన సైన్యం ముందు పాకిస్థాన్ ఓవరాక్షన్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ రాజౌరీ పూంచ్ సెక్టార్లలో సీజ్ ఫైర్ ను అతిక్రమించిన పాకిస్థాన్ కాల్పులు జరుపుతూ భారత ఆర్మీని రెచ్చగొడుతోంది. దీంతో ఆర్మీ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ పవర్ ఫుల్ వీడియోను పోస్ట్ చేసింది. భారత సైనిక సంపత్తి ఎంత ఉందో చూపిస్తూనే తోకజాడిస్తే తొక్కి పారేయటానికి రెడీ గా ఉన్నామని ఆర్మీ ఓ వార్నింగే పంపింది. రెడీ టూ స్ట్రైక్..ట్రైన్డ్ టూ విన్ అనే క్యాప్షన్ తో ఆర్మీ పోస్ట్ చేసిన ఈ వీడియోతో సరిహద్దుల్లో మన సైనికుల సన్నద్ధతతో తెలియచేయటంతో పాటు ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చెప్పినట్లైంది.





















