అన్వేషించండి

Saraswati River Pushkaralu 2025: పుష్కర స్నానం ఎందుకు చేయాలి ? ఎలా చేయాలి? దాని ప్రాముఖ్యత ఏంటి!

 Saraswati River : ఏటా ఏదో ఒక నదికి పుష్కరాలొస్తాయ్..భక్తులంతా భారీగా తరలివెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అయితే పుష్కర స్నానం ఎందుకు చేయాలి? ఎలా చేయాలో తెలుసా?

Saraswati River Pushkaralu: సరస్వతి నదికి పుష్కరాలు వచ్చేస్తున్నాయ్. మే 15 నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన మొదటి 12 రోజులు సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల సందర్భంగా ఏదో ఒక సమయంలో పుష్కరనదిలో స్నానం ఆచరించడం మంచిది అని చెబుతారు ఆధ్యాత్మిక వేత్తలు. కుదిరితే స్నానం ఆచరించండి...ఇంకా కుదిరితే కొన్ని నియమాలు పాటించండి అని సూచిస్తున్నారు. 

పుష్కర స్నానం ఆచరించేందుకు నది దగ్గరకు వెళ్లే భక్తులు...ముందుగా గట్టుమీదున్న చిటికెడు మట్టిని తీసుకుని నీటిలో వేస్తూ ...
 
పిప్పలాదాత్సముత్పన్నే క్రుత్యేలోక భయంకరి
మృత్తికాంతే మయాదత్తం ఆహారార్ధం ప్రకల్పయ 

ఈ శ్లోకాన్ని చదవాలి...

పుష్కర స్నానాలు జరిగే సమయంలో వేలమంది భక్తులు వస్తుంటారు, పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.. గట్లన్నీ మట్టిగా మారిపోతుంటాయి. వాటిపై తడి బట్టలతో వెళితే కాసేపటికే అంతా బురదమయం అయిపోతుంది. ఆ బురద నివారణ కోసం ఇలా చేయమని పెద్దలు చెప్పి ఉండొచ్చు. ఇక పుష్కర సమయంలో వేల మంది భక్తులు ఒకేసారి స్నానం ఆచరిస్తారు. ఆ సమయంలో చర్మవ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. గట్టుమీదున్న ఒండ్రు మట్టిని నీటిలో వేస్తే...ఒండ్రుమట్టి చాలా అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. చర్మ వ్యాధులను రాకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. 

నదిలో స్నానం చేసేముందు నదిలో దిగి ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి

పావని త్వం జగత్పూజ్యే సర్వతీర్థమయే శుభే।

త్వయిస్నాతు మనుజ్ఞాంమేదేహి మహానదీ॥

మిథునగతే దేవగురౌ పితౄణాం తారణాయచ।

సర్వపాప విముక్త్యర్థం తీర్థ స్నానం కరోమ్యహం॥

తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైకపావనీ।

త్వయిస్నానం కరోమ్యద్య భవబంధవిముక్తయే॥

ఆ తర్వాత నదిలోకి దిగి సంకల్పం చెప్పుకుని...నదీ ప్రవాహానికి ఎదురుగా నిల్చుని స్నానం ఆచరించాలి. 

నదీ స్నానం ముగిసిన తర్వాత...
సూర్యుడికి, సరస్వతి దేవికి, త్రిమూర్తులకూ, గురువుకి, పుష్కరుడికీ, అన్ని నదులకు, ఏడుగురు రుషులకు,  అరుంధతికి అర్ఘ్యం సమర్పించాలి. 
అర్ఘ్యాలు పూర్తయ్యాక నదిలో దక్షిణ దిశవైపు తిరిగి మరోమారు మునిగి పితృదేవతలకు నీటిని వదలాలి. 

స్నానం పూర్తై బయటకు వచ్చిన తర్వాత..విభూది, కుంకుమ పెట్టుకోవాలి.  

భూమ్మీద ఉన్న ప్రతిజీవి మనకుగడుకు జీవనాధారం నీరు. నీరు పుట్టిన తర్వాతే జీవకోటి ఉద్భవించింది. పుష్కరాల సమయంలో స్నానం ఆచరిస్తే మోక్షం, ఆరోగ్యం, ఆయుష్షు సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. సకల పాపాలు నశిస్తాయంటారు. కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు ఇవన్నీ నీటితో ముడిపడినవే. నదీతీరంలో పితృకర్మలు ఆచరించడం మోక్షానికి మార్గం అని పెద్దలు చెబుతారు. పితృదేవతలను ఉద్ధరించేందుకే భగీరదుడు గంగను భూమికి తీసుకొచ్చాడని పురాణాల్లో ఉంది. తిలోదకాలు ఇచ్చామంటే వారికి స్వస్తి చెప్పామని అర్థం. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మదేవుడి నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఔషధులు, ఔషధుల నుంచి అన్నం , అన్నం నుంచి జీవుడు పుట్టాడు. ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు అందించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ఇది ప్రాధమిక సమాచారం మాత్రమే. వీటిని ఆచరించే ముందు అనుభవజ్ఞులైన పండితుల సలహాలు స్వీకరించండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

ఆగస్టు 28 చంద్రగ్రహణం - భారత రాజకీయాలు మరింత వేడెక్కుతాయా? రాహుల్ గాంధీపై వ్యతిరేకత, CJP ఉద్యమం ఎలా ఉండబోతోంది?
ఆగస్టు 28న చంద్రగ్రహణం - భారత రాజకీయాలు మరింత వేడెక్కుతాయా? రాహుల్ గాంధీపై వ్యతిరేకత, CJP ఉద్యమం ఎలా ఉండబోతోంది?
శని కష్టాల నుంచి ఉపశమనం: దానం చేయాల్సిన 3 వస్తువులు, చేయకూడని 6 పనులు!
శని కష్టాల నుంచి ఉపశమనం: దానం చేయాల్సిన 3 వస్తువులు, చేయకూడని 6 పనులు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget