అన్వేషించండి

Chiranjeevi: చిరంజీవి హిట్ సినిమా... ఓసారి ర‌జ‌నీ, మ‌రోసారి ధ‌నుష్‌ - రెండు తమిళ్ రీమేక్స్ ఏవో తెలుసా?

చిరంజీవి హీరోగా న‌టించిన ఓ తెలుగు సినిమాను రెండుసార్లు త‌మిళంలో రీమేక్ చేశారు. ఈ రీమేక్‌ల‌లో కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, ధ‌నుష్ హీరోలుగా న‌టించారు. ఆ సినిమాలు ఏవో తెలుసా?

ఇప్పుడు ఓటీటీలలో సినిమాలు చూసే వీక్షకుల సంఖ్య పెరగడంతో రీమేక్ ట్రెండ్ త‌గ్గింది. కానీ 2000లకు ముందు ఆ ట్రెండ్ చాలా పాపుల‌ర్‌. బోలెడు రీమేక్స్ వచ్చేవి. ఓ భాష‌కు చెందిన సినిమా హిట్ట‌యితే చాలు ఆ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రొడ్యూస‌ర్లు పోటీప‌డేవారు. టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ రీమేక్ సినిమాల‌తో పెద్ద పెద్ద విజయాలు అందుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. వెంక‌టేష్ కెరీర్‌లో స్ట్రెయిట్ సినిమాల కంటే రీమేక్ సినిమాలే ఎక్కువ‌. మన హీరోలు రీమేక్స్ చేయడం కాదు... మన హీరోల సినిమాలను ఇతర భాషల్లో రీమేక్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో చిరంజీవి సినిమాను రెండుసార్లు రీమేక్ చేశారు.

రజనీకాంత్ ఒకసారి...
ధనుష్ మరోసారి - ఆ రీమేక్ ఏది?
తెలుగు హీరోల‌ సినిమాలు ఇత‌ర భాష‌ల్లోకి రీమేక్ అయ్యాయి. చిరంజీవి హీరోగా న‌టించిన ఓ తెలుగు సూప‌ర్ హిట్ సినిమాను మాత్రం రెండు సార్లు త‌మిళంలో రీమేక్ చేశారు. ఓసారి కోలీవుడ్ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రీమేక్ చేయ‌గా... మ‌రోసారి ఆయన మాజీ అల్లుడు - కోలీవుడ్ యంగ్ స్టార్ హీరోలలో ఒకరైన ధ‌నుష్ రీమేక్ చేశారు. ఆ రెండు రీమేకులూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అంతే కాదు... ఆ రీమేక్‌ల‌లో ఒక‌ సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో నటించ‌డ‌మే కాకుండా నిర్మాతగా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఆ సినిమా ఏదో తెలుసా?

అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు
చిరంజీవి కథానాయకుడిగా కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా 'అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు' (Attaku Yamudu Ammayiki Mogudu Movie). ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌ బ‌స్ట‌ర్‌. తెలుగులో 1989లో విడుదలైన ఆ సినిమా ఆ ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Also Read: Bookie Review - 'బూకి' రివ్యూ: సునీల్, లక్ష్మీ మంచు చేసిందేమిటి? విజయ్ ఆంటోనీ మేనల్లుడి సినిమా హిట్టా? ఫట్టా?

'అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు' సినిమాను 'మాప్ఫిళ్లై' పేరుతో ర‌జ‌నీకాంత్ త‌మిళంలో రీమేక్ చేశారు. ఆ త‌మిళ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి సమర్పకులుగా వ్య‌వ‌హ‌రించారు. ఇంతకీ, తమిళ సినిమా నిర్మాత ఎవరో తెలుసా? చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్. 'మాప్పిళ్లై' మూవీలో ర‌జ‌నీకాంత్ స్నేహితునిగా చిరంజీవి అతిథి పాత్రలో సందడి చేశారు. క్లైమాక్స్‌లో ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌లో క‌నిపిస్తారు. చిరంజీవి ఎంట్రీ ఈ సినిమాకు అప్ప‌ట్లో ఓ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. 'మాప్పిళ్లై' త‌మిళంలో బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. 

Also ReadNawab Cafe Review - 'నవాబ్ కేఫ్' రివ్యూ: ఇడ్లీ కొట్టు ప్లస్ ఉస్తాద్ హోటల్… సినిమా ఎలా ఉందంటే?

'మాప్పిళ్లై'లో ర‌జ‌నీకాంత్‌కు జోడీగా అమ‌ల అక్కినేని హీరోయిన్‌గా న‌టించింది. ఆ తర్వాత మ‌రోసారి 'మాప్పిళ్లై' పేరుతో 'అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు'ను ధ‌నుష్ కూడా రీమేక్ చేశాడు. ఇందులో హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించ‌గా... అత్త పాత్ర‌లో మ‌నీషా కొయిరాలా క‌నిపించింది. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించారు. ధ‌నుష్ న‌టించిన సినిమా కూడా హిట్టు టాక్‌ను తెచ్చుకుంది.

Also ReadHey Balwanth Review - 'హే బల్‌వంత్' రివ్యూ: సుహాస్ సినిమా హిట్టా? ఫట్టా? బిజినెస్ అంటూ చేసిన కామెడీ ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Alekhya: మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
GDN Release : మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
Bhari Movie: 'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి
'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి
Makutam Trailer: శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?
శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget