అన్వేషించండి

Chiranjeevi : 'విశ్వంభర' కోసం ‘మెగా’ వర్కవుట్స్ - చిరంజీవి డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా, ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు

Chiranjeevi : 'విశ్వంభర' మూవీ కోసం మెగాస్టార్ హెవీ వర్కౌట్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Chiranjeevi preparation for Vishwambhara in GYM : మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందనున్న ఈ సినిమా ఇటీవల ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ ఆ షెడ్యూల్లో చిరంజీవి పాల్గొనలేదు. ఇక ఇప్పుడు 'విశ్వంభర' సెట్స్ లో అడుగుపెట్టేందుకు మెగాస్టార్ రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే సినిమా కోసం భారీ కసరత్తులు మొదలుపెట్టారు.

'విశ్వంభర' కోసం చిరంజీవి భారీ కసరత్తులు

'విశ్వంభర' సినిమా కోసం మెగాస్టార్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వర్కౌట్ వీడియోని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో చిరంజీవి హెవీ వర్కౌట్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏజ్ లో కూడా చిరు ఇంతలా కష్టపడుతుడడం చూసి మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇక ఈ వీడియో చివర్లో చిరంజీవి 'గెట్టింగ్ రెడీ ఫర్ విశ్వంభర' అంటూ ఫుల్ జోష్ లో చెప్పారు. ప్రస్తుతం మెగాస్టార్ వర్కౌట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

హైదరాబాద్ లో భారీ సెట్

'విశ్వంభర' మూవీ కొత్త షెడ్యూల్ ఈ వారంలోనే ఉండబోతోంది. ఈ షెడ్యూల్ లోనే మెగాస్టార్ పాల్గొన్నారు. ఇందుకోసం హైదరాబాదులో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఓ భారీ సెట్ వేసినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, హీరోయిన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మూవీటీమ్ క్లారిటీ ఇవ్వలేదు. గత కొద్ది రోజులుగా ఇందులో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే హీరోయిన్ విషయమై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.

'విశ్వంభర' లో కోలీవుడ్ స్టార్

కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తాజా సమాచారం. ఇందులో శింబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, ఆర్య వంటి హీరోలు తెలుగు సినిమాల్లో విలన్ గా మెప్పించారు. ఇప్పుడు శింబు కూడా 'విశ్వంభర' లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. అయితే శింబు ఇందులో మెయిన్ విలన్ గా చేస్తున్నారా? లేక నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

'విశ్వంభర' కాస్ట్ అండ్ క్రూ

మెగాస్టార్ కెరియర్ లో 156వ సినిమాగా ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. UV క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.

Also Read : ఫస్ట్ టైమ్ ఆ దేశంలో అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ - అంతా ‘హనుమాన్’ మహిమే!

టాప్ హెడ్ లైన్స్

Payal Rajput : అలా అయితే డోంట్ సబ్ స్క్రైబ్ - పాయల్ ఇన్ స్టా పోస్ట్ వైరల్
అలా అయితే డోంట్ సబ్ స్క్రైబ్ - పాయల్ ఇన్ స్టా పోస్ట్ వైరల్
Agadha Release Date : గెట్ రెడీ ఫర్ సూపర్ థ్రిల్... అగధ వచ్చేస్తోంది - వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
గెట్ రెడీ ఫర్ సూపర్ థ్రిల్... అగధ వచ్చేస్తోంది - వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
Lenin: అఖిల్ అక్కినేని ఒక్కడికే కాదు... భాగ్యశ్రీ బోర్సేకీ 'లెనిన్' సక్సెస్ ఇంపార్టెంటే
అఖిల్ అక్కినేని ఒక్కడికే కాదు... భాగ్యశ్రీ బోర్సేకీ 'లెనిన్' సక్సెస్ ఇంపార్టెంటే
Trikala OTT : ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల
ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Embed widget