అన్వేషించండి

Tamannaah: చిరు చాలా చిలిపి, సెట్‌లో ఆయన ఉంటే సందడే - తమన్నా వ్యాఖ్యలు వైరల్

మెగాస్టార్ చిరంజీవిపై మిల్కీ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సెట్‌లో ఆయన చాలా చిలిపిగా ఉంటారని తెలిపింది.

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’ విడుదలకు సిద్ధమవుతోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో కీర్తి సురేష్, సుశాంత్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్ మెగా అభిమానులను మెప్పించింది. మూవీ విడుదల దగ్గరపడటంతో టీమ్ కూడా ప్రమోషన్స్‌ను స్పీడప్ చేశారు. ఈ నేపథ్యంలో తమన్నా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. 

తమిళంలో అజీత్ కుమార్‌ నటించిన ‘వేదాళం’ మూవీని తెలుగులో ‘భోళా శంకర్’గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తమన్నా మాత్రం.. ఈ మూవీ తమిళ మూవీకి భిన్నంగా ఉంటుందని వెల్లడించింది. ఈ మూవీని పూర్తిగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందేలా రూపొందించారని.. తప్పకుండా అందరికీ నచ్చుతుందంటూ అంచనాలు పెంచేసింది. అంతేకాదు.. చిరంజీవిని సైతం ప్రశంసలతో ముంచెత్తింది. 

చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి చాలా చిలిపి(నాటీ) ఉంటారు. ఆయన సెట్‌లో ఉన్నారంటే బోలెడంత ఫన్ ఉంటుంది. అక్కడ ఉన్నవారంతా సౌకర్యవంతంగా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఈ విషయంలో ఆయనే నా స్ఫూర్తి’’ అని తెలిపారు. సుశాంత్ సైతం.. చిరంజీవితో పనిచేయడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆయనతో  కలిసి పనిచేయడం మరపురాని అనుభూతి అని వెల్లడించాడు. 

ఈ ఇంటర్వ్యూలో ఇంకా దర్శకుడు మెహర్ రమేష్ కూడా పాల్గొన్నారు. ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఇప్పటి నుంచి మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. ‘ఆచార్య’ ఫ్లాప్ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవి మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ‘భోళా శంకర్’ మూవీ ఎలా ఉంటుందనే టెన్షన్ అభిమానుల్లో ఉంది. అయితే, చిత్రయూనిట్ దీన్ని రీమేక్ మూవీలా చూడొద్దని, అందులో కథను మాత్రమే తీసుకున్నామని.. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా అంతా మార్చామని అంటున్నారు. 

రెమ్యునరేషన్ విషయంలో రూటు మార్చిన చిరు

‘భోళాశంకర్’ మూవీకి చిరంజీవి రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదట. దానికి బదులు ఆయన లాభాల్లో వాటా ఆడిగారట. ఈ మేరకు నిర్మాతలతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాపై ఎంతో నమ్మకం ఉండబట్టే  రిలీజ్ తర్వాత లాభాల వాటా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట మెగాస్టార్. ఇక మరోవైపు 'భోళాశంకర్' సినిమాకి ఇప్పటికే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా థియేటర్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నా యి. అలాగే చిత్ర నిర్మాతలు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని అప్పుడే అమ్మాలని అనుకోవడం లేదట.

అతిపెద్ద కటౌట్‌తో చిరు అభిమానుల సందడ :

‘భోళాశంకర్’ చాలా చోట్ల అభిమానులు భారీ కటౌట్ లు కడుతున్నారు. రీసెంట్ గా సూర్యపేటలో సుమారు 100 అడుగుల భారీ చిరంజీవి కటౌట్ ను ఏర్పాటు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఇదే భారీ కటౌట్ అని టాక్. ఇది ఇప్పుడు ప్రత్యేకార్షణగా నిలుస్తోంది. మరోవైపు యూఎస్ఏలో మూవీకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ లు కూడా వేగంగా జరుగుతున్నాయని టాక్. మరి ఈ మూవీలో చిరంజీవి ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారో చూడాలి. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్ తదితరులు నటించారు. ఈ మూవీ ఆగస్టు 11 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Also Read: అనుష్క ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - అనుకున్నదే జరిగింది!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget