Chiranjeevi: జపాన్ వెళుతున్న చిరంజీవి - ఎందుకో తెలుసా?
Viswambara Update: మెగాస్టార్ చిరంజీవి జపాన్ వెళుతున్నారు. మంగళవారం సాయంత్రం సత్యదేవ్ జీబ్రా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన చిరు... ఆ తర్వాత జపాన్ ప్రయాణం అయ్యారు. అదీ విశ్వంభర చిత్రీకరణ కోసం...
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన తాజా పాన్ ఇండియా సినిమా ‘విశ్వంభర’ (Vishwambhara Movie) పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఆయన జపాన్ వెళుతున్నారు. ఎందుకో తెలుసా?
చిరు... ఛలో జపాన్! ఎందుకంటే?
Vishwambhara songs shooting location: తాజా సమాచారం ప్రకారం... 'విశ్వంభర' సినిమా చిత్రీకరణ నిమిత్తం చిరంజీవి జపాన్ వెళ్లనున్నారు. అక్కడ పది రోజుల పాటు షెడ్యూల్ జరుగుతుందని టాక్. అందులో పాటలతో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయనున్నారని తెలిసింది.
'విశ్వంభర' సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు చకచకా జరుగుతున్నాయి.
The universes tremble. The world wobbles. The stars shudder - On ONE MAN'S ARRIVAL 💫#VishwambharaTeaser out now ❤️🔥
— UV Creations (@UV_Creations) October 12, 2024
▶️ https://t.co/eZs7nitgRK
Team #Vishwambhara wishes you all a very Happy Vijaya Dashami ✨
MEGA MASS BEYOND UNIVERSE 💥💥
MEGASTAR @KChiruTweets… pic.twitter.com/z9EqpxsLeU
తనయుడి కోసం సంక్రాంతి త్యాగం!
తొలుత 'విశ్వంభర' సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఈ చిత్రాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ లో విడుదల కావాల్సిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి డేట్ లాక్ చేసుకోవడంతో సంక్రాంతి రేస్ నుంచి ఈ సినిమా తప్పుకుంది.
Also Read: బాలకృష్ణ సినిమా టైటిల్ ఇదే... నందమూరి అభిమానులకు నచ్చేలా, పండగ తెచ్చేలా!
చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు దసరా సందర్భంగా విడుదలైన టీజర్ చిరు అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. అయితే, టీజర్ పై సోషల్ మీడియాలో వచ్చిన కొంత మిశ్రమ స్పందనలు రావడంతో ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టింది చిత్ర యూనిట్.
Also Read: చిరంజీవి కంట్లో పడిన 2024 హిట్లు... చిన్నోళ్లకు 'మెగా' భరోసా!
Vishwambhara Cast And Crew: 'విశ్వంభర' సినిమాలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలు. నాని 'జెంటిల్ మన్' ఫేమ్ సురభి, 'ప్రేమ కావాలి' ఫేమ్ ఇషా చావ్లా, 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ఫేమ్ రమ్య పసుపులేటి సిస్టర్ రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి స్వరకర్త. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. వచ్చే వేసవికి విడుదల కానుందని సమాచారం.