By: ABP Desam | Updated at : 12 Apr 2023 05:11 PM (IST)
చిరంజీవి (Image Courtesy : Chiranjeevi Instagram)
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గ్యారేజీలో ఖరీదైన కార్లకు కొదవ లేదు. ఆయన దగ్గర రోల్స్ రాయిస్ స్పెషల్ ఎడిషన్ ఉంది. ఇంకా బోలెడు లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చిరంజీవి మరో కారు కొన్నారు. ఆ కారు రిజిస్ట్రేషన్ కోసం సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలిసింది. ఇంతకీ, ఆ కారు ఏది? నంబర్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
చిరు గ్యారేజీలో టయోటా!
చిరంజీవి లేటెస్టుగా టయోటా వెల్ ఫైర్ (Toyota Vellfire) కారు కొనుగోలు చేశారు. దాని రేటు సుమారు రెండు కోట్ల రూపాయలు. ఆన్ రోడ్ వచ్చే సరికి రూ. 1.90 కోట్లు అని తెలిసింది. బ్లాక్ కలర్ కారు రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయ్యింది. చిరంజీవికి 1111 నంబర్ సెంటిమెంట్ ఉంది. ఆయన ప్రతి కారుకు అదే నంబర్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కొన్న కారుకు కూడా సేమ్ నంబర్ తీసుకున్నారు. ఆ నంబర్ కోసం కాస్త ఖర్చు పెట్టారు.
సుమారు ఐదు లక్షలు పెట్టి మరీ...
చిరంజీవి కొత్త టయోటా కారు నంబర్ 'టీఎస్ 09 జీబీ 1111'. ఈ ఫ్యాన్సీ నంబర్ కోసం రూ. 4.70 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి. దీని కోసం చిరంజీవి స్వయంగా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. అదీ సంగతి!
Also Read : కన్నడ సినిమా షూటింగులో సంజయ్ దత్‌కు గాయాలు
చిరంజీవి చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' చేస్తున్నారు. అందులో ఆయనకు జోడీగా తమన్నా భాటియా నటిస్తున్నారు. చిరు సోదరి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా... 'భోళా శంకర్'లో ఆయన నటిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
లవర్ బాయ్ తరహా పాత్రలో...
'భోళా శంకర్'లో లవర్ బాయ్ తరహా పాత్రలో సుశాంత్ కనిపించనున్నారని చిత్ర బృందం తెలిపింది. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఆమెకు జోడీగా సుశాంత్ కనిపిస్తారేమో!? కొన్ని రోజులు వెయిట్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది.
పవన్ అభిమానిగా చిరు!?
యంగ్ హీరోలు పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించడం వేరు. ఏకంగా మెగాస్టార్ అభిమానిగా కనిపిస్తే? త్వరలో ఆ ఊహ నిజం కానుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. 'భోళా శంకర్'లో చిరుది పవన్ ఫ్యాన్ రోల్ అని టాక్. పవన్ కళ్యాణ్ అభిమానిగా చిరంజీవి కనిపించనున్నారని వార్తలు రావడమే ఆలస్యం. 'ఖుషి' నడుము సీన్ రీ క్రియేట్ చేస్తే ఎలా ఉంది? అనే డిస్కషన్ మొదలు అయ్యింది.
ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. మణిశర్మ కుమారుడు, యువ సంగీత సంచలనం మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, అర్జున్ దాస్, రష్మీ గౌతమ్, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?
LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!
Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్
కోలీవుడ్ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్
తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!