Mega 158 Movie : చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Chiranjeevi Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ మూవీ గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు.

Chiranjeevi Mega 158 Movie Launching Ceremony : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబో మెగా 158 మూవీ పూజా కార్యక్రమాలతో గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మెగా బ్రదర్స్ ఒకే కారులో రావడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
అన్నయ్య చిరుపై పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా... చిరు కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ మూవీ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా పలు కారణాలతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య తర్వాత చిరు బాబీ కాంబోలో వస్తోన్న రెండో మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఈవెంట్‌కు హీరోయిన్ అనస్వర రాజన్ కూడా హాజరయ్యారు.
The captain of the MEGA storm❤️🔥
— KVN Productions (@KvnProductions) May 21, 2026
Blockbuster Director #BobbyKolli arrives at the Grand Launch of #KVNTeluguDebut - #Mega158💥
Watch #ChiruBobby2 pooja ceremony Live here!
— https://t.co/8q6FrysrTR
A @dirbobby Film 🪓
Megastar @KChiruTweets #VenkatKNarayana @MusicThaman… pic.twitter.com/9JKRqzzOHy
Also Read : ఎన్టీఆర్ డ్రాగన్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ - 24 గంటల్లోనే న్యూ హిస్టరీ
మూవీ ప్రీ లుక్‌తోనే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. బెంగాల్ నేపథ్యంలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా మూవీని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ అనురాగ్ కశ్యప్ విలన్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ లెజెండ్ ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు























