Chatrapathi Hindi Remake : తెలుగులో గోపీచంద్ 'రామబాణం' - హిందీలో బెల్లకొండ 'ఛత్రపతి' రీమేక్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న 'ఛత్రపతి' హిందీ రీమేక్ విడుదల తేదీ ఖరారు అయ్యింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో రూపొందిన ఫస్ట్ హిట్ సినిమా 'ఛత్రపతి'. దీనిని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Sai Srinivas Bellamkonda) హీరో. వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది.
హిందీలోనూ 'ఛత్రపతి'గా...
హిందీ రీమేక్ కూడా 'ఛత్రపతి' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. ఆ టైటిల్ కోసమే ఇన్నాళ్లూ విడుదల వాయిదా వేశారనేది మరో ప్రచారం. 'ఛత్రపతి' హిందీ టైటిల్ కోసం చాలా కష్టపడి రైట్స్ సంపాదించారట. టైటిల్ దొరకడంతో ఇప్పుడు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మే 5న హిందీ 'ఛత్రపతి
'Chatrapathi Hindi Remake Release Date : మే 5న 'ఛత్రపతి' హిందీ రీమేక్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో ఆ రోజున గోపీచంద్ 'రామబాణం' విడుదల కానుంది. 'నాంది' తర్వాత ఆ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడలతో 'అల్లరి' నరేష్ చేసిన 'ఉగ్రం', 'మెన్ టూ' అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా తెలుగులో విడుదలకు రెడీ అయ్యాయి. 'ఛత్రపతి' హిందీ రీమేక్ కావడం, వీవీ వినాయక్ దర్శకత్వం వహించడం వల్ల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా మీద తెలుగు ప్రేక్షకుల చూపు కూడా పడుతుంది.
'ఛత్రపతి' చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్, హిందీ రీమేక్ కోసం కొన్ని మార్పులు చేశారు. పాన్ ఇండియా రైటర్ ఆయన. ఆల్రెడీ హిందీ సినిమాలకు కథలు అందించిన అనుభవం ఉంది. అందుకని, హిందీ రీమేక్ స్క్రిప్ట్ సైతం విజయేంద్ర ప్రసాద్ చేతిలో పెట్టారు. అయితే... పెద్దగా మార్పులు చేయలేదట. సెకండాఫ్ మారిందని టాక్. ఇటీవల 'ఛత్రపతి' హిందీ రీమేక్ నిర్మాత జయంతిలాల్ గడా రషెస్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యారట.
బెల్లంకొండకు ఇదొక అగ్ని పరీక్ష?
బెల్లంకొండ శ్రీనివాస్ ఉత్తరాదిలో కొంత మంది ప్రేక్షకులకు తెలుసు. హిందీలో ఆయన సినిమాలు డబ్బింగ్ అయ్యాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. అందువల్ల, అక్కడ ఆయనకు గుర్తింపు ఉంది. అయితే, ఆయన కంటే ఎక్కువగా ప్రభాస్ పాపులర్. 'బాహుబలి' భారీ విజయం తర్వాత ఉత్తరాదిలో ఆయనకు అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. 'సాహో' తెలుగులో సరిగా ఆడలేదు. కానీ, హిందీలో వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలకు హిందీలో భారీ బజ్ ఉంది. ఆయన సినిమా రీమేక్ అంటే బెల్లకొండ మీద భారీ బాధ్యత ఉన్నట్టే. ఆయనకు ఇదొక అగ్ని పరీక్ష. ఏం తేడా వచ్చినా విమర్శలు ఎదుర్కోవాలి.
Also Read : రామ్ చరణ్ ఆస్కార్ డ్రస్ వెనుక కథ - అల్లూరి స్ఫూర్తితో, మిలటరీని రిప్రజెంట్ చేసేలా
'అల్లుడు శీను' సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన వి.వి. వినాయక్... 'ఛత్రపతి' రీమేక్‌తో అతడిని హిందీ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దర్శకుడిగా ఆయనకు కూడా తొలి చిత్రమిది. ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు జానీ లివర్ ఓ రోల్ చేస్తున్నారు.
Also Read : బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్