అన్వేషించండి

Record Break: పాన్ ఇండియా 'రికార్డ్ బ్రేక్' - దివంగత నటుడు చలపతిరావు చివరి సినిమా!

Pan India Movie Record Break Updates: ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు దర్శకత్వం వహించిన సినిమా 'రికార్డ్ బ్రేక్'. హైదరాబాద్ సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా ట్రైలర్ విడుదల చేశారు.

''ఈ సినిమాలో హీరో అంటూ ఎవరు ఉండరు. 'రికార్డ్ బ్రేక్'కి మెయిన్ హీరోలు కళా దర్శకుడు, ఫైట్ మాస్టర్, సంగీత దర్శకుడు. సాబూ వర్గీస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది'' అని నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'రికార్డ్ బ్రేక్'. దీనిని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి ప్రొడ్యూస్ చేశారు. గ్లింప్స్ 'మాతృదేవోభవ' దర్శకులు అజయ్ కుమార్, టీజర్ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ట్రైలర్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ విడుదల చేశారు. 

దివంగత నటుడు చలపతిరావు చివరి సినిమా!
దివంగత నటుడు చలపతిరావు 'రికార్డ్ బ్రేక్'లో ఓ క్యారెక్టర్ చేశారని చదలవాడ శ్రీనివాస రావు తెలిపారు. ఇంకా ఆయన గురించి మాట్లాడుతూ... ''చలపతి రావు గారు మొదటి రోజు నుంచి ఈ సినిమా కోసం నాతో పాటు నిలబడ్డారు. ఆయన చివరి రోజుల్లో డబ్బింగ్ చెప్పారు. అప్పుడు సినిమా చూసి బయటకు వస్తూ నాతో చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇక... 'రికార్డ్ బ్రేక్' ఇంత చక్కగా రావడానికి నాలో సగభాగమైన నా దర్శకుడు అజయ్‌కు దక్కుతుంది. ఇప్పుడు ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి నాకు ఎప్పుడూ నాకు పక్కనే కొండంత అండగా ఉండేది నా ప్రసన్న కుమార్. నాకు ఐదేళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు నాకున్న అనుభవంతో ఒక మంచి కథ సొసైటీకి ఉపయోగపడే కథ కావాలనుకుని ఈ సినిమా మొదలుపెట్టా. కొంతమంది దర్శకులు సినిమా చూసి 'రికార్డ్ బ్రేక్' కరెక్ట్ టైటిల్ అని చెప్పారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుంది. చివరి 45 నిమిషాలు ఎమోషనల్‌గా ఉంటుంది'' అని చెప్పారు.

Also Read: భ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్... మరి సినిమా? లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

సినిమా ప్రేమికుడు చదలవాడ శ్రీనివాస రావు: ప్రసన్న కుమార్
''సినిమా మీద వచ్చిన డబ్బులు చూసుకోకుండా... బిజినెస్ మీద వచ్చే డబ్బును కూడా సినిమాపై పెట్టే అంతటి సినిమా ప్రేమికుడు చదలవాడ శ్రీనివాస రావు గారు'' అని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''చదలవాడ శ్రీనివాస రావు గతంలో 'జీవిత ఖైదీ' చేశారు. 'మాతృదేవోభవ' హిందీ రీమేక్ 'తులసి'ని మనిషా కొయిరాలతో చేశారు. నారాయణ మూర్తి గారితో 'ఏ ధర్తీ హమారీ' హిందీ సినిమా చేశారు. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న వ్యక్తి ఆయన. 'బిచ్చగాడు'ను తెలుగులో విడుదల చేశారు. ఇప్పుడీ 'రికార్డ్ బ్రేక్'తో ఎంతో మందిని చిత్రసీమకు పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'' అని అన్నారు. ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన ఒక కొత్త పాయింట్ టచ్ చేస్తూ చదలవాడ శ్రీనివాస రావు ఈ సినిమా చేశారని 'మాతృదేవోభవ' దర్శకుడు అజయ్ చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్ పూరి, బెంగాలీ, ఒరియా... మొత్తం ఎనిమిది భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమా 'రికార్డ్ బ్రేక్' అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ చెప్పారు.

Also Read: అమెరికాలో ఉంటూ ఇండియాలో సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు - 'ఇంద్రాణి' ట్రైలర్ లాంచ్‌లో అనిల్ సుంకర

''రికార్డ్ బ్రేక్' సినిమాలో మంచి రోల్ చేశా. నాకు ఈ అవకాశం ఇచ్చిన చదలవాడ శ్రీనివాస రావు గారికి థాంక్స్. ఆయన సంస్థలో నాకు రెండో చిత్రమిది'' అని నటి సత్య కృష్ణ చెప్పారు. ఇంకా తిరుపతి డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ, ఆర్టిస్ట్ నాగార్జున, నిహార్ కపూర్, రగ్ధ ఇఫ్తాకర్, సంజన, సోనియా, కథా రచయిత అంగిరెడ్డి శ్రీనివాస్, సంగీత దర్శకుడు సాబూ వర్గీస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: అంజిరెడ్డి శ్రీనివాస్, సంగీతం: సాబు వర్గీస్, కూర్పు: వెలగపూడి రామారావు, ఛాయాగ్రహణం: కంతేటి శంకర్, నిర్మాణం: చదలవాడ బ్రదర్స్, నిర్మాత: చదలవాడ పద్మావతి, కథనం - దర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget