By: ABP Desam | Updated at : 14 Mar 2022 02:12 PM (IST)
ప్రభాస్, ఆనంద్ మహీంద్రా
ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ప్రాజెక్ట్ కె' (Project K Movie Latest Update). ఇందులో బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'మహానటి' తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో కొన్ని స్పెషల్ వెహికల్స్ ఉన్నాయి. మహీంద్రా రీసెర్చ్ సెంటర్ లో వాటిని తయారు చేయించే పనులు జరుగుతున్నాయి.
'ప్రాజెక్ట్ కె' కోసం కొన్ని రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను నాగ్ అశ్విన్ సాయం కోరగా... ఆయన సానుకూలంగా స్పందించారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... మహీంద్రా రీసెర్చ్ వాలీకి నాగ్ అశ్విన్ వెళ్ళారు. 'ప్రాజెక్ట్ కె'కి అవసరమైన వెహికల్స్ గురించి అక్కడ టీమ్ సభ్యులతో డిస్కస్ చేశారు. మహీంద్రా క్యాంపస్ విజిట్ చేసిన తర్వాత ఆనంద్ మహీంద్రాకు థాంక్స్ చెబుతూ నాగ్ అశ్విన్ ఒక ట్వీట్ చేశారు. దానికి రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్రా, హాలీవుడ్ ను బీట్ చేస్తారని ప్రశంసించారు.
Well @nagashwin7 I have to admit you have got me as excited now about this blockbuster sci fi film you’re creating. I have a hunch you’re going to beat Hollywood hollow… https://t.co/XiqyaEBIDr
— anand mahindra (@anandmahindra) March 13, 2022
"నాగ్ అశ్విన్... మీరు క్రియేట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'ప్రాజెక్ట్ కె'తో నన్ను ఎగ్జైట్ చేశారు. మీరు హాలీవుడ్ ను బీట్ చేస్తారని నమ్మకంగా చెప్పగలను" అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 'ప్రాజెక్ట్ కె'ను వైజయంతి మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఆల్రెడీ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు.
Also Read: ప్రభాస్‌తో మారుతి మసాలా ఎంటర్‌టైనర్, మరిన్ని డీటెయిల్స్ ఇవిగో!
Also Read: Radhe Shyam First Weekend collections: 'రాధే శ్యామ్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్, నిర్మాతలు సేఫ్!
What a beautiful campus, where nature meets cutting edge tech...a fruitful start to our journey with @Velu_Mahindra and team..thank you so much @anandmahindra sir. This promises to be v exciting.🙏 #mahindraresearchvalley #projectk pic.twitter.com/FH7kJ8VP53
— Nag Ashwin (@nagashwin7) March 13, 2022
Chiranjeevi - Mega 154 Story: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?
Venkatesh New Movie: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్
Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే
Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Amalapuram Protests: అమలాపురం విధ్వంసంపై పోలీసులు విశ్లేషణ- కారుకులను గుర్తించే పనిలో ఖాకీలు
Amazon: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’