అన్వేషించండి

Bunny Vasu: అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా 100 కోట్ల క్లబ్బులో 'తండేల్'... నాగ చైతన్యకు 'బన్నీ' వాస్ ప్రామిస్

Thandel: యువ సామ్రాట్ నాగ చైతన్య 'తండేల్' సినిమా విడుదల ఫిబ్రవరి 7కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే... ఆ అసంతృప్తి అక్కినేని అభిమానుల్లో లేకుండా చేసింది బన్నీ వాస్ స్పీచ్.

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) తనను నిర్మాత చేశారని, '100 పర్సెంట్ లవ్'తో తొలిసారి తెరపై తన పేరు నిర్మాతగా పడిందని 'బన్నీ' వాస్ తెలిపారు. '100 పర్సెంట్ లవ్' తర్వాత చైతన్య హీరోగా ఆయన నిర్మిస్తున్న సినిమా 'తండేల్'. డిసెంబర్ 20న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఫిబ్రవరి 7కు వాయిదా వేశారు. ఈ విషయంలో అక్కినేని అభిమానులు ఎవరైనా అసంతృప్తితో ఉన్నా సరే... 'బన్నీ' వాస్ స్పీచ్ వింటే కూల్ అవుతారు. వాళ్లకు గూస్ బంప్స్ ఇచ్చే మాటలు ఆయన చెప్పారు.  

వంద కోట్ల క్లబ్బులో చేరాలా కృషి చేస్తా
'తండేల్' న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 'బన్నీ' వాస్ మాట్లాడుతూ... ''డిసెంబర్ 20 మా టార్గెట్. ఈ సినిమా షూట్ చేయడం మామూలు విషయం కాదు. ఇంత పెద్ద సినిమాకు క్వాలిటీ బాగుండాలంటే సీజీ వర్క్ చేయడానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. అప్పుడే మంచి ప్రొడక్ట్ వస్తుంది. పాకిస్తాన్ నావెల్ షిప్స్ చూపించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఈ కారణాల వల్ల వాయిదా వేశాం. నాకు నిర్మాతగా '100 పర్సెంట్ లవ్' సినిమాకు అవకాశం ఇచ్చారు చైతన్య. 'తండేల్'ను 100 కోట్ల క్లబ్బులో చేర్చడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను'' అని అన్నారు. 'తండేల్'ను తీసుకెళ్లి 100 కోట్ల క్లబ్బులో కూర్చోబెడతామని ఆయన పామిస్ చేశారు. తనను నిర్మాత చేసిన చైతూకు వంద కోట్ల సినిమా ఇస్తామన్నారు. ఫిబ్రవరి 7న మార్నింగ్ షో చూశాక అభిమానులు కాలర్ ఎగరేస్తారని, కాలర్ ఎత్తే సినిమాను 100% డెలివరీ చేస్తామని ఆయన చెప్పారు.

సోలో రిలీజ్ కోసమే డేట్ మార్చాం... అల్లు అరవింద్
గీతా ఆర్ట్స్ అధినేత, 'తండేల్' సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ... ''మా సినిమా సంక్రాంతికి రావాలనే ఉత్సాహం అందరికీ ఉంటుంది. కానీ మేము పెట్టిన ఖర్చుకు మాకు సోలో రిలీజ్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఇచ్చినా తీసుకుంటుంది అంటూంటారు. కానీ ఆ టైమ్ కి థియేటర్లు వేరే సినిమాలకు షేర్ అయిపోతూ ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో వేయలేం. సోలో రిలీజ్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7వ తేదీ అనుకున్నాం. ఇండస్ట్రీ పెద్దలను, డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించి ఈ డేట్ ఖరారు చేయడం జరిగింది'' అని చెప్పారు.

Also Read: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?


హీరో నాగ చైతన్య మాట్లాడుతూ... ''ఇప్పటి వరకు రిలీజ్‌ డేట్‌ ముందుగా అనుకొని దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడిని. కానీ, సినిమా పూర్తయ్యాక డేట్‌ అనౌన్స్ చేస్తే బాగుండేదని అనుకునేవాడిని. నటుడిగా విడుదల తేదీ ఎప్పుడో తెలుసుకోవాలని నాకు ఉంటుంది. అరవింద్ గారిని అడిగితే ముందు సినిమా చూపించమని, ఆయన అనుకున్న సినిమా వస్తే రిలీజ్ డేట్ చెప్తానని అన్నారు. ఆ మాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మామూలు సినిమా కాదిది. శ్రీకాకుళంలోని కొందరు మత్స్యకారుల కష్టం దేశాన్ని షేక్ చేసింది. ఆల్రెడీ మేం ఎడిట్ చూశాం. ఎప్పుడు విడుదల చేసినా పండగ తెచ్చే సినిమా అవుతుంది. ఫిబ్రవరి 7న విడుదల అవుతుండటం సంతోషం. ఇది పెద్ద సినిమా. నన్ను తెరపై నెక్స్ట్ లెవల్ లో చూపించడం కోసం చందూ కష్టపడ్డాడు'' అని చెప్పారు.

Also Readరంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget