By: ABP Desam | Updated at : 30 Jun 2023 12:23 PM (IST)
'బ్రో' సినిమాలో సాయి ధరమ్ తేజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫుల్ జోష్, ఎనర్జీతో వచ్చినప్పుడు... స్క్రీన్ మీద ఇతర ఆర్టిస్టులు ఉన్నప్పటికీ, వాళ్ళ మీద కన్ను పడటం కష్టమే. 'బ్రో' టీజర్ విషయంలోనూ అదే జరిగింది. సుమారు పాతికేళ్ళ క్రితం వచ్చిన 'తమ్ముడు'లోని 'వయ్యారి భామ...' పాటలో లుక్ గుర్తు చేస్తూ తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్, స్మైల్ & నటనతో పవర్ స్టార్ ఆకట్టుకున్నారు. ఆయనకు తోడు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సైతం కనిపించారు.
ఆ అమ్మాయి ఎవరు బ్రో?
'బ్రో' టీజర్ చూశారా? అందులో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మాత్రమే కాదు... ఓ హీరోయిన్ కూడా ఉన్నారు! సరిగ్గా 65 సెకన్ల దగ్గర పాజ్ బటన్ నొక్కి చూడండి. సాయి ధరమ్ తేజ్ ఎందుకో ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఆయన వెనుక చేతులు కట్టుకుని ఓ అమ్మాయి నిలబడింది. ఆమె ఎవరో తెలుసా? ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier).
Priya Prakash Varrier In Bro Teaser : మలయాళ సినిమా 'ఒరు ఆదార్ లవ్'లో ప్రియా వారియర్ కన్ను గీటిన సన్నివేశం చూడని ప్రేక్షకులు లేరు అని చెబితే అతిశయోక్తి కాదేమో! తెలుగులో 'చెక్', 'ఇష్క్' సినిమాలు చేశారు. ఇప్పుడామె 'బ్రో'లో నటించారు. టీజర్ కనుక హీరోయిన్లకు స్కోప్ దక్కలేదు. ట్రైలర్, తర్వాత పాటల్లో కనిపించే అవకాశం ఉంది.
'బ్రో'లో రొమాంటిక్ భామ కేతికా శర్మ కూడా ఉన్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. అందులో మామా అల్లుళ్ళతో కలిసి ఆవిడ స్టెప్పులు వేశారు. ఊర్వశి రౌతేలా ఒక్కో పాటకు మినిమమ్ 50 లక్షల రూపాయలు తీసుకుంటారని టాక్. ఆవిడ రెమ్యూనరేషన్ కంటే నాలుగైదు రేట్లు పాట కోసం ఖర్చు పెట్టారని తెలిసింది. సెట్స్, లైటింగ్... ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదని తెలిసింది.
ప్రపంచవ్యాప్తంగా జూలై 28న విడుదల!
మాస్ మహారాజా రవితేజ 'శంభో శివ శంభో', నాని 'జెండా పై కపిరాజు' చిత్రాల తర్వాత తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహించిన సినిమా 'బ్రో'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. జూలై 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
Also Read : 'స్పై' సినిమా రివ్యూ : నిఖిల్ గురి ఎక్కడ తప్పింది? ఎందుకు తేడా కొట్టింది?
'బ్రో' సినిమాలో సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, 'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), నర్రా శ్రీను, యువ లక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ప్రధాన తారాగణం. ఇంకా ఈ చిత్రానికి కళా దర్శకత్వం : ఏ.ఎస్. ప్రకాష్, కూర్పు : నవీన్ నూలి, పోరాటాలు : సెల్వ, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్, సంగీతం : ఎస్.ఎస్. థమన్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల, నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & జీ స్టూడియోస్, నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, కథనం & మాటలు : త్రివిక్రమ్ శ్రీనివాస్, రచన & దర్శకత్వం : పి. సముద్రఖని.
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్
‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Tiger Nageswara Rao Movie : రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
/body>