అన్వేషించండి

BRO Teaser Update : డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ - ‘బ్రో’ టీజర్‌ వచ్చేది రేపే, ఎన్ని గంటలకో తెలుసా?

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న పొందుతున్న 'బ్రో' మూవీ నుంచి టీజర్ రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా, తాజాగా పవన్ కళ్యాణ్ టీజర్ కు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు.

వర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మెగా మల్టీ స్టారర్ మూవీ 'బ్రో' (BRO). ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆరంభం నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విలక్షణ నటుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. తమిళంలో హిట్ అయిన 'వినోదయ సీతం' అనే సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక మూవీ టీం ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ భారీ హై క్రియేట్ చేస్తున్నారు. క్రమంలోనే తాజాగా 'బ్రో' మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు.  

తాజాగా విడుదలైన పోస్టర్లో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ఇద్దరరూ లుంగీ కట్టుకొని, వింటేజ్ లుక్ లో అదిరిపోయారు. ఇక ఈ పోస్టర్ను రిలీజ్ చేస్తూ త్వరలోనే టీజర్ రాబోతుందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే టీజర్ అప్డేట్ ఇచ్చారు. కానీ డేట్ అండ్ టైం మెన్షన్ చేయలేదు. ఇలాంటి తరుణంలోనే తాజాగా 'బ్రో' టీజర్ సంబంధించి మరో అప్డేట్ తో ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు మేకర్స్.

తాజాగా 'బ్రో' టీజర్ కు సంబంధించి డబ్బింగ్ పూర్తయినట్లు మూవీ టీం కొన్ని వర్కింగ్ స్టిల్స్ పోస్ట్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ టీజర్ కు సంబంధించి డబ్బింగ్ చెబుతున్నారు. పక్కనే దర్శకుడు సముద్రఖని కూడా ఉన్నారు. ఈ మేరకు మేకర్స్ వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'బ్రో' టీజర్ డబ్బింగ్ పూర్తయిందని, త్వరలోనే టీజర్ అనౌన్స్మెంట్ ఉండబోతుందని తెలియజేశారు. ఇక ఈ అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎప్పుడెప్పుడు టీజర్ వస్తుందా అని ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by People Media Factory (@peoplemediafactory)

ఇక తాజాగా మేకర్స్ వదిలిన టీజర్ డబ్బింగ్ వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండడంతో టీజర్లో కేవలం ఆయన చెప్పే డైలాగ్స్ మాత్రమే ఉంటాయని కొంతమంది అంటున్నారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తోనే ఈ టీజర్ ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన 'బ్రో' టీజర్ కి డబ్బింగ్ చెప్పడం విశేషం.

కాగా పవన్ కళ్యాణ్, సాయి తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిగా శర్మ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. జూలై 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓ జి' సినిమాలతో బిజీగా ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget