అన్వేషించండి

Priyanka Chopra : మేమిద్దరం విడిపోవాలని కోరుకుంటున్నారా? - డివోర్స్ రూమర్స్‌పై ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్

Priyanka Chopra Divorce : సోషల్ మీడియాలో డివోర్స్ రూమర్స్‌పై బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. ఎనిమిదేళ్లుగా తాము ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.

Priyanka Chopra Emotional Comments On Divorce Rumours : గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో తాను డివోర్స్ తీసుకోబోతున్నానంటూ సాగుతున్న ప్రచారంపై బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. వీటికి గతంలోనే చెక్ పెట్టినా మరోసారి తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. సోషల్ మీడియాలో ఏదైనా ఫోటో షేర్ చేసినా... కొందరు అదే పనిగా ఏవేవో ఊహించుకుంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె భర్త గురించి మాట్లాడారు.

'విడిపోవాలని కోరుకుంటున్నారా?'

తన భర్త నిక్ జొనాస్‌తో జీవితంలో ఎంతో సంతోషంగా ముందుకెళ్తున్నామని చెప్పారు ప్రియాంక చోప్రా. 'మేము బయట విషయాలను పెద్దగా పట్టించుకోం. డివోర్స్ తీసుకోబోతున్నామంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వచ్చినట్లు తెలిసింది. తమ వివాహ బంధం ముగిసిపోవాలని వారు కోరుకుంటున్నారా? ఎంతగా చెప్తున్నా తరచూ ఇలాంటి రూమర్స్ ఎందుకు వైరల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. మేము వేర్వేరు దేశాలకు చెందిన వారం. వేర్వేరు మతాలు.

మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఇలా కొన్ని కారణాలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఎనిమిదేళ్లుగా మేము ఎంతో సంతోషంగా కలిసే ఉంటున్నాం. నిక్ జొనాస్ పరిచయం అయిన తర్వాత 6 నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం. మా గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను. నిక్ నాకు పరిచయం అయ్యాక సరైన జోడీ అనిపించి మరో అడుగు ముందుకేశాను.' అంటూ స్పష్టం చేశారు.

Also Read : పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ

'చాలా అలర్ట్‌గా ఉంటాం'

తన కుటుంబ భద్రత, తన కుమార్తె మాల్టి మేరీ ప్రైవసీ విషయంలో అత్యంత అలర్ట్‌గా ఉంటామని చెప్పారు ప్రియాంక చోప్రా. 'మా కుటుంబ భద్రత విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. నా కుమార్తె ఫోటోలు తీసి నెట్టింట వైరల్ చేయడం నాకు నచ్చదు. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకే సెక్యూరిటీని పెట్టుకున్నాం. మా అనుమతి లేకుండా మమ్మల్ని ఫోటోలు తీయకుండా వారు చూసుకుంటారు. నా కూతురి ప్రైవసీ కాపాడడం నా బాధ్యత. నాతో నేరుగా మాట్లాడే వారిని చాలా గౌరవిస్తా. నాతో ఎవరైనా ఫోటోలు దిగొచ్చు.' అని చెప్పారు.

తనకు నచ్చిన పని చేస్తూ కుటుంబంతో కలిసి టైం స్పెండ్ చేయడమే నిజమైన విజయం అని అన్నారు ప్రియాంక. బాలీవుడ్‌లో ఓ స్టార్‌గా ఎదిగిన తర్వాత 30 ఏళ్ల వయసులో అన్నింటినీ వదులుకుని హాలీవుడ్‌లోకి ఎంటర్ కావడం ఓ పెద్ద సాహసమని అన్నారు. అక్కడ స్టార్టింగ్‌లో కొన్ని స్టీరియో టైప్ రోల్స్ వచ్చినప్పటికీ... పట్టుదలతో శ్రమించి ఇప్పుడు తనకు నచ్చిన రోల్స్ ఎంచుకునే స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. కొత్త సవాళ్లను స్వీకరించడమే తనను ఈ స్టేజ్‌లో నిలబెట్టిందని వెల్లడించారు.

ప్రస్తుతం ప్రియాంక మహేశ్, రాజమౌళి కాంబో పాన్ వరల్డ్ అడ్వెంచరస్ వారణాసి‌లో మందాకిని పాత్రలో నటిస్తున్నారు. 2027, ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ కానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget