Huma Qureshi : బికినీ ఫోటో పెట్టాలని అడిగాడు - ఆన్ లైన్ వేధింపులపై బాలీవుడ్ హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్
Huma Qureshi Reaction : బాలీవుడ్ హీరోయిన్ హ్యుమా ఖురేషీ మహిళలపై కామెంట్స్, ఆన్ లైన్ వేధింపులపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఎలా వేధించినా శిక్ష ఒకేలా కఠినంగా పడాలని అభిప్రాయపడ్డారు.

Huma Qureshi Raises Voice Against Online Harassement : పెరుగుతున్న సాంకేతికత, AI దుర్వినియోగంతో ఇటీవల ఆన్‌లైన్‌లో సెలబ్రిటీలు, మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే మార్ఫింగ్ ఫోటోస్‌పై పలువురు హీరోయిన్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మరాఠీ హీరోయిన్ గిరిజా ఓక్, హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల తమకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. తాజాగా... ఈ అంశంపై బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి రియాక్ట్ అయ్యారు.
ఒకటే శిక్ష విధించాలి
రీసెంట్‌గా మహిళలపై ముఖ్యంగా సెలబ్రిటీలపై ఆన్‌లైన్‌లో వేధింపులు ఎక్కువయ్యాయని... వీధుల్లో ఈవ్ టీజింగ్ చేసినా... ఆన్‌లైన్‌లో వేధించినా ఒకటే శిక్ష పడాలని అభిప్రాయపడ్డారు హ్యూమా ఖురేషి. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె... మహిళలపై అనుచిత ప్రవర్తనకు ఇంటర్నెట్‌ను ఈజీగా ఉపయోగిస్తున్నారని దీంతో ఎలాంటి పర్యావసనం ఉండదని కొంతమంది అనుకుంటున్నట్లు ఖురేషి చెప్పారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారు.
'ఇటీవల నాకు సోషల్ మీడియాలో ఒకడు బికినీలో ఒక చిత్రాన్ని పోస్ట్ చేయండి అంటూ కామెంట్ చేశాడు. ఇది చాలా విచారకరం. చాలా అసహ్యంగా కూడా ఉంది. ఆన్ లైన్‌లో ఇలాంటి కామెంట్స్, వేధింపులను చిన్న విషయంగా చూడలేం. ఒక మహిళను వీధిలో వేధించినా... ఆన్‌లైన్‌లో వేధించినా శిక్ష ఒకేలా కఠినంగా ఉండాలి. అసభ్య చిత్రాలు పంపినా, అలాంటి కామెంట్స్ చేసినా, బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై దురుసుగా ప్రవర్తించినా సేమ్ పరిణామాలు ఎదుర్కోవాలి.' అని స్పష్టం చేశారు.
ట్రోలింగ్స్ కామన్ కాదు
ఆన్ లైన్‌లో ఒకరిపై ట్రోలింగ్ చేయడం ఇప్పుడు సాధారణం అయిపోయిందని... అది కామన్ కాదని అన్నారు హ్యుమా ఖురేషి. 'ఒకరిపై అసభ్యంగా కామెంట్ అంటే వారి గౌరవాన్ని ఉల్లంఘించడమే. వారి ఎమోషన్స్‌తో ఆడుకోవడమే. మహిళలకు స్వేచ్ఛ, వారి దుస్తులు, వారి వర్క్ గురించి మాట్లాడడం మానుకోవాలి.' అని అన్నారు.
Also Read : ధనుష్ బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా - ఎవరూ ఊహించని తెలుగు టైటిల్!
'ఆ కామెంట్స్ వద్దు'
'మహిళలు ఎలాంటి దుస్తులు ధరిస్తారు?, వారు ఎలాంటి మేకప్ వేసుకుంటారు? వారు ఎలా జీవిస్తారు? వారు ఏ ఉద్యోగం చేస్తారు? వారు ఏ సమయంలో ఇంటికి వస్తారు? లేదా వారి బరువు ఎంత? ఇలాంటి వాటి గురించి కామెంట్స్ మానేయండి. ఎవరి పని వారు చూసుకోండి.' అంటూ హితవు పలికారు. ఖురేష్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు.
అయితే, రీసెంట్‌గా కోలీవుడ్ హీరోయిన్ గౌరీ కిషన్‌కు కూడా అలాంటి ప్రశ్నే ఎదురైంది. 'అదర్స్' సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజా ఇంటర్వ్యూలో ఆమెను ఓ రిపోర్టర్... 'మీ బరువు ఎంత?' అని ప్రశ్నించాడు. దీనిపై ఆమె మండిపడ్డారు. 'నా బరువు తెలుసుకుని ఏం చేస్తారు? దాని వల్ల మీకు ఏంటి ఇబ్బంది? ఈ సినిమాకు నా వెయిట్ వల్ల ఏమైనా నష్టం ఉందా? నా ప్రతిభ గురించి మాట్లాడండి. నేను ఇప్పటివరకూ చేసిన రోల్స్ గురించి మాట్లాడండి. సినిమాల గురించి అడగండి' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.






















