Deepika Padukone : 8 అవర్స్ వర్కింగ్ - మరోసారి దీపికా పదుకోన్ రియాక్షన్
Deepika Padukone Reaction : రోజుకు 8 గంటల పనిపై బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ మరోసారి స్పందించారు. తన నిర్ణయం సరైనదేనని... రోజుకు అన్ని గంటలే పని చేస్తామని స్పష్టం చేశారు.

Deepika Padukone Reaction On 8 Hours Working Demand : బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్... 8 గంటల వర్కింగ్ డిమాండ్, ఇతర కండీషన్లతో భారీ ప్రాజెక్టుల నుంచి తప్పించారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. తాజాగా మరోసారి ఆమె ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. తన డెసిషన్ సరైనదేనని... రోజుకు 8 గంటలు మాత్రమే వర్క్ చేయగలమంటూ సమర్థించుకున్నారు.
డెడికేషన్ కోసం...
8 గంటల వర్కింగ్ డిమాండ్ సరైనదేనని... నిబద్ధత కోసం ఇండస్ట్రీలో అధిక వర్క్ భరిస్తున్నామని అన్నారు దీపికా పదుకోన్. ఈ రెండింటి మధ్య ఎంతో గందరగోళానికి గురవుతున్నట్లు చెప్పారు. 'నేను ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నా తల్లిపై నాకు మరింత గౌరవం పెరిగింది. ఒక తల్లిగా పిల్లల బాధ్యతతో పాటు వర్క్‌ను కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవచ్చని అందరూ అంటారు. కానీ వాస్తవంలో అది చాలా కష్టం. కొత్తగా తల్లయిన వారు తిరిగి పనికి వచ్చినప్పుడు వారికి అందరూ సపోర్ట్‌గా నిలవాలి.
మనం అధికంగా వర్క్ చేయడాన్ని కూడా కామన్ చేసేశాం. రోజుకు 8 గంటల పని అటు శరీరానికి ఇటు మనసుకు సరిపోతుంది. మనం హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే ది బెస్ట్‌గా పని చేయగలం. ఎప్పుడైనా టెన్షన్, ఒత్తిడితో ఉన్నప్పుడు మంచి అవుట్ పుట్ ఇవ్వలేం. నా సొంత కార్యాలయంలో కూడా మేం సోమవారం నుంచి శుక్రవారం వరకూ 8 గంటలు మాత్రమే పని చేస్తాం.' అని దీపికా స్పష్టం చేశారు.
Also Read : GlobeTrotter ఈవెంట్ - టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్‌తో పాటు సర్‌ప్రైజ్ ఇదే... రాజమౌళి అఫీషియల్ అనౌన్స్‌మెంట్
రీసెంట్‌గా ప్రభాస్ 'స్పిరిట్', 'కల్కి 2898AD' సీక్వెల్ మూవీస్ నుంచి దీపికా పదుకోన్‌ను తప్పించడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. 8 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పడం ఇతర కండీషన్లతోనే ఆమెను ఇంతటి భారీ ప్రాాజెక్టుల నుంచి తప్పించారనే ప్రచారం సాగింది. ఈ క్రమంలో హీరోయిన్‌కు సపోర్ట్ చేయగా మరికొందరు ఆమెను ట్రోల్ చేశారు. దీనిపై గతంలోనే దీపికా స్పందించారు. తనకు ఆరోగ్యం ఇంపార్టెంట్ అని అన్నారు.
'వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తీరిక లేకుండా గడుపుతున్నా... ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలని అర్థం చేసుకున్నా. నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. వినే వారికి ఇది బోరింగ్ అనిపించినా... నేను ప్రతీ ఇంటర్వ్యూలోనూ ఇదే చెబుతుంటాను. కానీ ఇదే నిజం. నిద్ర, వ్యాయామం, పోషకాహారం వీటికి లైఫ్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఐస్ బాత్‌లు, రెడ్ లైట్ థెరపీ ఇవి కూడా మంచివే కానీ ఎందుకో అద్భుతంగా అనిపించవు. నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే నాకు అన్నింటికంటే ముఖ్యం.' అని చెప్పారు.





















