Nenekkadunna Movie Teaser : తెలుగు తెరకు బాలీవుడ్ వారసుడు - పవన్ సినిమాలో స్వామిజీగా నటించిన...
తెలుగు తెరకు బాలీవుడ్ వారసుడు పరిచయం కానున్నారు. ఆ సినిమా 'నేనెక్కడున్నా'. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ రోజు టైటిల్, టీజర్ విడుదల చేశారు.
సీనియర్ హిందీ కథానాయకుడు, నటుడు మిథున్ చక్రవర్తి గుర్తు ఉన్నారు కదా! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గోపాల గోపాల' చిత్రంలో స్వామిజీ పాత్ర చేశారు. ఆ తర్వాత ఆది పినిశెట్టి 'మలుపు' సినిమాలోనూ నటించారు. ఆయన కుమారుడు మిమో చక్రవర్తి (Mimoh Chakraborty) ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.
మిమో చక్రవర్తిని తెలుగు తెరకు హీరోగా పరిచయం చేస్తూ చేస్తూ నూతన దర్శకుడు మాధవ్ కోదాడ తెరకెక్కిస్తున్న చిత్రం 'నేనెక్కడున్నా' (Nenekkadunna Movie). ఇందులో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి (Sasha Chettri) కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఈ రోజు టైటిల్ పోస్టర్ ఆవిష్కరించడంతో పాటు సినిమా టీజర్ విడుదల చేశారు.
జర్నలిజం, టెర్రరిజం నేపథ్యంలో...
Nenekkadunna Teaser Review : మిమో చక్రవర్తి పోలీస్ / మిలటరీ అధికారి పాత్ర చేసిన ఈ సినిమాలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఝాన్సీ పాత్రలో సశా ఛెత్రి నటించారు. 'హాలో సార్... నా పేరు ఝాన్సీ. నేనొక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు' అని హీరోకి హీరోయిన్ ఫోన్ చేయడంతో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? అనేది రివీల్ చేయకుండా సస్పెన్సులో ఉంచేశారు. అభిమన్యు సింగ్, మురళీ శర్మ, శయాజీ షిండే, ప్రదీప్ రావత్, రాహుల్ దేవ్, మహేష్ మంజ్రేకర్, రవి కాలే... అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో పోషించిన నటీనటులు అందరూ ఈ సినిమాలో ఉన్నారు.
జర్నలిజం, రాజకీయం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రమిది. టెర్రరిజాన్ని కూడా టచ్ చేశారు. అయితే... జర్నలిజం, రాజకీయం, టెర్రరిజం ఈ మూడు అంశాలను ఎలా కనెక్ట్ చేశారనేది ఆసక్తికరం. బ్రహ్మానందం, సీవీఎల్ నరసింహారావు, రవి కాలే, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి తదితరుల పాత్రలను కూడా పరిచయం చేశారు. ప్రతి ఒక్కరి పాత్రకు సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. టీజర్ లాస్ట్ విజువల్స్ చూస్తే మిమో చక్రవర్తి, సశా ఛెత్రి యాక్షన్ సీక్వెన్సులు బాగా చేశారని అర్థం అవుతోంది.
Also Read : అక్షయ్ కుమార్ పరువు తీసిన 'సెల్ఫీ' - పదేళ్ళలో వరస్ట్ ఓపెనింగ్!
'నేనెక్కడున్నా' టైటిల్, టీజర్ విడుదల సురేష్ బాబు ''టీజర్ ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకాదరణ లభిస్తుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని చిత్ర నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవుతాయని, ఆ తర్వాత విడుదల తేదీ వెల్లడిస్తామని ఆయన చెప్పారు. మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ''ముంబై, హైదరాబాద్, బెంగళూరులో చిత్రీకరణ చేశాం. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. కథ, సంగీతం, దర్శకత్వం, ఛాయాగ్రహణం మా సినిమాకు బలం. ప్రముఖ నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో రష్యన్ డాన్సర్లతో చేసిన పబ్ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది'' అని అన్నారు.
Also Read : వచ్చే వారమే మంచు మనోజ్, మౌనిక పెళ్ళి - ఏడడుగులు వేసేది ఎప్పుడంటే?