Animal: ‘యానిమల్’లో రణబీర్, బాబీ డియోల్ కిస్ సీన్ - థియేటర్‌లో కట్, ఓటీటీలో అన్‌కట్, త్వరలోనే!
Ra ‘యానిమల్’ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఉన్నాయి. అందులో హీరో, విలన్ కెమిస్ట్రీ కూడా ఒకటి. ఇక వీరిద్దరి మధ్య ఉండే ఒక కీలక సన్నివేశం థియేట్రికల్ వర్షన్‌లో లేదని బాబీ బయటపెట్టాడు.
Ranbir Kapoor: ఈరోజుల్లో కొన్ని సినిమాలు థియేట్రికల్ వెర్షన్‌లో ఒకలాగా, ఓటీటీ వెర్షన్‌లో ఒకలాగా విడుదల అవుతున్నాయి. థియేటర్‌లో అనుమతి లేని, నిడివి ఎక్కువయ్యింది అని కట్ చేసిన కొన్ని సీన్స్‌ను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకుంటున్నారు మేకర్స్. ప్రస్తుతం ‘యానిమల్’ విషయంలో కూడా అదే జరగనుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ మూవీ థియేటర్‌లోనే 3 గంటల 21 నిమిషాల నిడివితో విడుదలయ్యింది. ఇక ఓటీటీలో విడుదలయ్యే వెర్షన్ అంతకంటే పెద్దగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఓటీటీ వర్షన్‌లో రణబీర్ కపూర్‌తో తనకు ఉన్న కిస్ సీన్‌ను కూడా యాడ్ చేసే అవకాశం ఉందని షాకింగ్ విషయం బయటపెట్టాడు మూవీ విలన్ బాబీ డియోల్.
కిస్ సీన్ లేదు..
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా.. ‘యానిమల్’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్‌లతో నటీనటులంతా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆ నటీనటులతో సందీప్ రెడ్డి వంగా చేసిన మ్యాజిక్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఓవైపు విమర్శలు అందుకుంటున్నా కూడా కలెక్షన్స్ విషయంలో ‘యానిమల్’ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక ఈ మూవీలో విలన్ అబ్రార్ పాత్రలో బాబీ డియోల్ నటన అందరినీ కట్టిపడేసింది. రణ్ విజయ్‌గా రణబీర్ నటన కూడా దానికి ధీటుగా ఉంది. అయితే ‘యానిమల్’లో ఈ ఇద్దరి నటులకు ఒక కిస్ సీన్ ఉంటుందని బాబీ డియోల్ తాజాగా రివీల్ చేశాడు.
అన్నదమ్ముళ్ల ప్రేమ, కోపం..
రణబీర్, బాబీ డియోల్ మధ్య జరుగుతున్న జరుగుతున్న సీరియస్ ఫైట్ మధ్యలో వీరిద్దరికి ఒక కిస్ సీన్ ఉందట. అయితే ఆ సీన్‌ను థియేట్రికల్ వర్షన్‌లో కట్ చేశారని బాబీ బయటపెట్టాడు. ఆ సీన్ క్లైమాక్స్‌లో వస్తుందట. ఆ సీన్‌ను మొదట్లో దర్శకుడు.. తనకు ఎలా వివరించాడు అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ‘‘ఇద్దరు అన్నదమ్ముళ్లు ఉంటారు. వారు ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ వారిద్దరి మధ్యలో ప్రేమ కూడా ఉంటుంది. ఒక బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న క్లైమాక్స్ ఫైట్ సీన్‌ను నేను షూట్ చేయాలని అనుకుంటున్నాను. ఆ పాట మొత్తం ప్రేమ గురించే ఉంటుంది’’ అని సందీప్.. క్లైమాక్స్ గురించి బాబీతో చెప్పాడట.
నెట్‌ఫ్లిక్స్ వర్షన్‌లో ఉండవచ్చు..
ఇక ఆ ఫైట్ మధ్యలో ఒక్కసారిగా మీరు తనను కిస్ చేయాలి అని బాబీతో చెప్పాడట సందీప్. ఆ తర్వాత ఫైట్ చేస్తూ ఉండగా.. రణబీర్ మిమ్మల్ని చంపేస్తాడని అన్నాడట. ‘‘కానీ క్లైమాక్స్‌లో ఆ కిస్‌ను తీసేశారు. అక్కడ కిస్ ఉండాలి. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే అన్‌కట్ వర్షన్‌లో ఈ కిస్ ఉంటుందని భావిస్తున్నాను. ఇదంతా చెప్పిన తర్వాత చివర్లో నేను మూగవాడిని అని నాతో చెప్పాడు సందీప్’’ అని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు బాబీ డియోల్. క్లైమాక్స్ ఫైట్‌లో బాబీ డియోల్.. రణబీర్‌పై పడుకొని సిగరెట్ తాగే సీన్ కూడా వైరల్ అవ్వగా అది కూడా సందీప్ ఐడియానే అని తెలిపాడు. తను ప్రతీ క్యారెక్టర్‌కు ఒక ఆల్ఫాను తీసుకొచ్చాడని అన్నాడు.
Also Read: లోకేష్ కనగరాజ్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ - క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!